22 December 2017 Written by 

తెలుగు సీఎంనే పిలవలేదు!

chandraతెలుగు ప్రజల ఆత్మగౌరవం నుండి పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు మన ఆత్మగౌరవానికి ఢిల్లీలో అవమానాలు ఎదురవుతుంటే ఎదిరించి పోరాడిన తెలుగు తేజం స్వర్గీయ నందమూరి తారకరామారావు. అయితే ఇప్పుడు తెలుగోడికి ఢిల్లీలో కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్‌లోనే అవమానాలు ఎదురవు తున్నాయి. ఆత్మగౌరవం కూడా అక్కడే దెబ్బతింటోంది.

మొన్నటికి మొన్న చూస్తే హైదరాబాద్‌లో జరిగిన అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్‌ కార్యక్రమానికి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించలేదు. హైదరాబాద్‌ మెట్రో ప్రారంభోత్సవానికి కనీసం ఆయనకు ఆహ్వానం కార్డు కూడా పంపలేదు. ఇప్పటికీ హైదరాబాద్‌పై తెలంగాణతో పాటు ఏపీకి హక్కువుంది. కాని, చంద్రబాబును పూచికపుల్లతో సమానంగా తీసి పడేసారు. సరే, అదంటే సొంత ప్రచారం కోసం జరిగిపోయిందనుకుందాం. హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టి సాటి తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడును పిలవకపోవడమేమిటి? తెలుగోడని చెప్పి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును పిలిచారు. మహారాష్ట్ర గవర్నర్‌ సి.హెచ్‌.విద్యా సాగర్‌రావును పిలిపించారు. దేశంలో ఎక్కడెక్కడో వున్న తెలుగు ప్రముఖులందరినీ ఆహ్వానించారు. కాని, పక్కనే వున్న తెలుగురాష్ట్ర సీఎంకు, అందులోనూ ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన రికార్డు వున్న సీఎం చంద్రబాబును పిలవలేదు. ఇది కేసీఆర్‌ సొంత కార్యక్రమం కూడా కాదు. ప్రభుత్వ పరంగానే హైదరాబాద్‌లో నాలుగురోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. ఇవాంక పర్యటనకు, మెట్రో ప్రారంభోత్స వానికి చంద్రబాబును పిలవనప్పుడే పలు విమర్శలొచ్చాయి. దీంతో ప్రపంచ తెలుగు మహాసభలకు చంద్రబాబును పిలవాలా? వద్దా? అనేదానిపై టీఆర్‌ఎస్‌లో పెద్ద చర్చే జరిగిందని సమాచారం. చంద్రబాబు వస్తే తనను తాను ఫోకస్‌ చేసుకుంటాడని, హైదరాబాద్‌ అభివృద్ధి అంతా నా చలువేనని డప్పు వేస్తాడని, పచ్చ మీడియా సంస్థలు ఆయనకే అధిక ప్రాధాన్యతనిస్తాయని, మనం ఇంతచేసి కూడా ప్రచారం చంద్రబాబుకు పోతుందని, పరిస్థితి సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్లుగా మారుతుందని పలువురు మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేసారని తెలుస్తోంది. కేసీఆర్‌కు చంద్రబాబుతో కలిసి వేదిక పంచుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు క్రింద పనిచేసిన నాయకుడే! కాబట్టి చంద్రబాబును డామినేట్‌ చేయలేడు. అలాగని సొంత గడ్డలో సొంత వేదికపై తగ్గి ఉండలేడు. అందుకనే చంద్రబాబును అసలు పిలవకుండానే ప్రపంచ తెలుగు మహాసభలను ముగించారని తెలుస్తోంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
  నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…
 • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
  ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…

Newsletter