22 December 2017 Written by 

నష్టమా? అదృష్టమా?

pavanజీవితంలో కొందరు వ్యక్తుల వల్ల మనకు తెలియకుండానే కొన్ని సంఘటనలు జరిగిపోతుంటాయి. అవి మంచిగా ఉండొచ్చు... చెడుగా కూడా ఉండొచ్చు. 'నువ్వు నాకు నచ్చావ్‌' అనే సినిమాలో బ్రహ్మానందం తీసిన ఫోటో వల్ల హీరో వెంకటేష్‌, హీరోయిన్‌ ఆర్తిఅగర్వాల్‌లకు క్లైమాక్స్‌లో పెళ్లి సెట్‌ అవుతుంది. అంటే తన ప్రమేయం లేకుండానే బ్రహ్మానందం వాళ్ళిద్దరికీ పెళ్లి ఫిక్స్‌ చేసాడు.

ఇలాంటివి నిజజీవితంలోనూ చాలా జరుగుతుంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఇంట్లో ఇద్దరి ఫోటోలను పెట్టుకుని పూజించుకోవచ్చు. వారిలో మొదటి వ్యక్తి లక్ష్మీపార్వతి అయితే, రెండో వ్యక్తి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్‌ పెళ్ళి చేసుకోకపోయి వుంటే 1995 ఆగష్టు సంక్షోభం ఉండేదికాదు. చంద్రబాబు సీఎం అయ్యుండేవాడు కాదు. తాను

ఉన్నంత వరకు ఎన్టీఆరే పదవిలో ఉండేవారు. ఆయన తర్వాత పార్టీ ఎలా వుండేదో, ఎన్ని చీలికలై వుండేదో చెప్పే పరిస్థితి లేదు. కాని, లక్ష్మీపార్వతి మూలంగా ఆ టైంలో పార్టీ తన చేతుల్లోకి రాబట్టి చంద్రబాబు స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు.

అలాగే చంద్రబాబుకు లక్ష్మీపార్వతి లాగే తోడ్పాటునందించన వ్యక్తి పవన్‌కళ్యాణ్‌. 2014 ఎన్నికలు చంద్రబాబు రాజకీయ జీవితానికి ఫైనల్స్‌ లాంటివి. అప్పటికే పదేళ్ళ నుండి అధికారానికి దూరంగా వున్నాడు. ఆ ఎలక్షన్‌లో కూడా ఓడిపోయివుంటే పరిస్థితి ఇంకా దారుణంగా వుండేది. చంద్రబాబు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో పవన్‌ తన అమూల్యమైన సహకారం అందించాడు. ఆయన సహకారంతోనే 2014 ఎన్నికల్లో గెలవగలిగాడు.

చంద్రబాబు అమ్ములపొదిలో వున్న ఆయుధం పవన్‌కళ్యాణ్‌. వచ్చే ఎన్నికల్లో ఆ అస్త్రాన్ని ఎలా వాడుకోవాలన్నదే చంద్రబాబు ముందున్న ప్రశ్న! రాష్ట్రంలో కాపులు బలంగా వున్న చోటల్లా జనసేన అభ్యర్థులను నిలబెట్టాలని, తద్వారా వైకాపాకు ఓట్లు పోకుండా చూడాలని నిన్నటి వరకు ప్లాన్‌. టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయి కాబట్టి ఈసారి జనసేన వాటితో కలవదు. కాపుల ఓట్లున్న చోటే జనసేన పోటీ చేయాలి. వైసిపి ఓట్లను దారి మళ్లించాలి.

అయితే విడిగా పోటీ చేస్తే పవన్‌ ప్రభావం ఎంత వరకుంటుందనే సందేహం కూడా వుంది. పవన్‌ అభిమానులు వేరు, ఆయన సామాజికవర్గం వేరు. పవన్‌ ఏ పార్టీకి మద్దతిచ్చినా లేదా సొంతంగా పోటీ చేసినా అభిమానులు ఆయన బాటలో నడుస్తారు. కాని, కాపులు అలా కాదు. సొంతంగా పోటీ చేస్తే మెజార్టీ ఓటర్లు పవన్‌ వైపే మొగ్గు చూపొచ్చు. అయితే కాపులకు రిజర్వేషన్లను తెరమీదకు తెచ్చిన ప్రస్తుత తరుణంలో ఆ వర్గంవాళ్ళు టీడీపీని పూర్తిస్థాయిలో వ్యతిరేకించే పరిస్థితి లేదు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశంతో వెళ్ళిన కాపు సామాజికవర్గం ప్రస్తుతానికి కూడా ఆ పార్టీలోనే వుంది. మొన్న నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలే దీనికి ఉదాహరణ. కాపు రిజ ర్వేషన్‌లని చెప్పి బీసీలలో వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ చేత విడిగా పోటీ చేయిస్తే పార్టీకి మద్దతునిచ్చిన కాపుల ఓట్లు పోతాయేమోననే భయం తెలుగుదేశంలో వుంది. పవన్‌తో కలిసి పోటీ చేస్తే ఏంటి? లేక ఆయన చేత విడిగా పోటీ చేయిస్తే ఎలా వుంటుందనేదానిపై తెలుగుదేశంలో పరిశీలన జరుగుతోంది. ఏదేమైనా పవన్‌ను మరోసారి చంద్రబాబు ఏ రూపంలో వాడుకోనున్నాడో చూడాలి!Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter