22 December 2017 Written by 

గుజరాత్‌ గుణపాఠం

rahul modiముందుగానే.. సర్వేలు జోస్యం చెప్పినట్లుగానే గుజరాత్‌లోను, హిమాచలప్రదేశ్‌లోనూ కమలం వికసించింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ తాజాగా జరిగిన ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది. గుజరాత్‌లో బిజెపి అధికారం నిలబెట్టుకున్నప్పటికీ, గతంలో వలె బిజెపికి ఇక్కడ భారీ విజయమేమీ లభించలేదు. అత్తెసరు మెజార్టీతో బయటపడింది. 150స్థానాలు గ్యారంటీ అనుకుంటే, కేవలం 99సీట్లతోనే సరిపెట్టు కోవాల్సివచ్చింది. కాంగ్రెస్‌ మాత్రం అనూహ్యంగా బలం పెంచుకుని 77 సీట్లు గెల్చుకుంది. ఇలా జరుగుతుందని బహుశా కమలనాధులు ఊహించి ఉండరు. హిమాచలప్రదేశ్‌లో బిజెపి విజయం ఊహించినదే కనుక పెద్ద ఇక్కడి విజయం పెద్దవిశేషమేమీ కాదు. కానీ, గుజరాత్‌ ఎన్నికలే అటు బిజెపి, ఇటు కాంగ్రెస్‌ ఈసారి ఎంతో ప్రతిష్టాత్మకగా, ఎంతో కీలకంగా భావించాయి. గతంలో లేనంతస్థాయిలో ఈ రెండుపార్టీలు ప్రచారాలు నిర్వహించాయి. అయితే, గుజరాత్‌లో అప్రతిహతంగా విజయం సాధిస్తున్న బిజెపికి ఈసారి ఆశించినస్థాయిలో సీట్లు తగ్గడం ఎంతైనా గమనార్హం. మరీ ముఖ్యంగా, ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాల స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ఈ ఎన్నికలు తొలినుంచి మరింత ప్రాధాన్యతను సంతరించుకోవడమే కాక, జాతీయస్థాయిలోనూ అందరి దృష్టినీ ఆకర్షించాయి. గుజరాత్‌లో విజయం సాధించడం బిజెపికి ఇది వరుసగా ఆరవసారి కావడం ఎంతైనా విశేషమే. ఒకటి రెండుసార్లు అధికారంలో ఉంటేనే ఏదో ఒక రూపాన వ్యతిరేకతలు బయలుదేరి ఆ పార్టీ చతికిలబడిపోవడ మన్నది మనదేశంలో సహజమే అయినా, ఎక్కడో ఒకటిరెండు చోట్ల ఇలాంటి అరుదైన విశిష్టతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయినా, ఏళ్ల తరబడి ఒకే పార్టీ అధికారంలో ఉండడమంటే మాటలు కాదు. అలాంటిది సుమారు మూడు దశాబ్దాలుగా గుజరాతీ యులు బిజెపికే విజయం సాధించిపెడుతుండడం ఆ పార్టీపై వారికున్న విశ్వాసానికి నిదర్శనమనే చెప్పవచ్చు. ఈసారి గుజరాత్‌లో బిజెపి-కాంగ్రెస్‌లు హోరాహోరీ పోరు సాగించాయి. తమకు 150 స్థానాలు లభించడం ఖాయమంటూ అమిత్‌షా ధీమాగా ప్రకటించినా ఆ ఆశలు నిరాశలే అయ్యాయి. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ బిజెపి అధికారంలో ఉన్నప్పటికీ, గతంలో లేనంతగా ఈ సారి మరింత భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించినప్పటికీ బిజెపికి ఆశించిన స్థానాలు దక్కకపోవడం గమనార్హం. ప్రధాని మోడీ ఈ ఎన్నికల్లో అలుపెరగకుండా ప్రచారం నిర్వహించినందువల్ల బిజెపి ఇక్కడ మళ్ళీ నిలదొక్కుకోగలిగిందని అనుకోవచ్చు. 22 సంవత్సరాల పాటు ఏకధాటిగా ఇక్కడ అధికారంలో ఉన్న బిజెపి, ఇప్పుడు కూడా తన అధికారాన్ని నిలబెట్టుకోగలిగిందంటే అందుకు మోడీ జనాకర్షణే ప్రధాన కారణమని చెప్పవచ్చు. అయితే, ప్రధాని మోడీతో పాటు, బిజెపి నేతలంతా కలసి ఈ ఎన్నికల్లో ఎంతగా ప్రచారాలు చేసినా, మరెంతగా వాగ్దానాల వర్షం కురిపించినా ఒకటి తక్కువ నూరు స్థానాలకే బిజెపి ఆగిపోయిందంటే కమలనాధులు ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. కేవలం 15 రోజుల్లోనే 34 సభల్లో ప్రధాని మోడీ ప్రసంగించడం, పెద్దఎత్తున ప్రచారార్భాటాలు జరగడం అందరికీ తెలిసిందే. అయినా, ప్రధాని మోడీ సొంత నియోజకవర్గమైన ఊంఝాలోనూ కాంగ్రెస్‌ గెలిచిందంటే బిజెపి పట్ల ప్రజల అసంతృప్తి పెరుగుతూ ఉందని తెలుస్తూనే ఉంది. కమలనాధులు ఈ విషయాలను మరింతగా ఆలోచించాల్సిన అవసరం

ఉంది. అందుకే, ఇక్కడ కమలం గెలిచినా.. గెలిచి ఓడినట్లేనన్నది అందరూ భావిస్తున్న విషయమే. ఇక్కడ కాంగ్రెస్‌ ఓడినా, గతంలో కంటే ఓట్లశాతం, సీట్ల సంఖ్య పెరగడంతో ఒకరకంగా తాము గెలిచినట్లేనన్నంత సంతోషంలో ఉంది. గతంలో నీరసపడిన కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో పుంజుకుని 77 స్థానాలను కైవశం చేసుకుంది దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాతనైనా తాము గుజరాత్‌ కోటలో పాగా వేయగలిగామని కాంగ్రెస్‌కు సంబరంగానే ఉంది. ఎవరూ ఊహించనివిధంగా ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ ఆ మేరకు కొంతబలాన్ని మూటగట్టు కోవడం ఎంతైనా విశేషమే. రాహుల్‌గాంధీ తాజాగా కాంగ్రెస్‌ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో, ఈ సంకేతం కాంగ్రెస్‌కు ఆనందాన్ని కలిగిస్తోందనడంలో సందేహం లేదు. ఎన్నికలకు ముందు ఇక్కడ బిజెపి విజయం తథ్యమని అందరూ భావించినా, ఎన్నికలు దగ్గరపడేకొద్దీ సమ స్యలు బయటపడుతూ వచ్చాయి. ఎంతోకాలంగా ఇక్కడున్న కరువు పరిస్థితులను ఎవరూ పట్టించు కోకపోవడం, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ప్రజలు అనేకరకాల బాధలు పడుతున్నా ప్రభుత్వం లక్ష్యపెట్టకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు పెరిగిపోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం, పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి వంటి అంశాల్లో కూడా ప్రజల్లో బిజెపి పట్ల ఉన్న వ్యతిరేకత బట్టబయలుగా వ్యక్తమవుతుండడం ఇవన్నీ కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశాలయ్యాయి. అందుకు తగ్గట్టుగా రాహుల్‌గాంధీ గతంలో కన్నా చురుగ్గా కదిలి గుజరాత్‌లో కాంగ్రెస్‌ బలం పెరిగేందుకు కృషిచేయడం ఆ పార్టీకి కొంతమేరకైనా సత్ఫలితాలనిచ్చింది. గుజరాత్‌లో తమకు తిరుగులేదనుకున్న బిజెపికి ఇది ఆశనిపాతమే అయింది. వరుసగా ఆరోసారి గుజరాత్‌లో బిజెపి అధికారంలోకి వచ్చినా, ఈ ఎన్నికల్లో సీట్ల సంఖ్య మాత్రం రెరడంకెల్ని దాటకపోవడం ఎంతైనా ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామమేనని చెప్పక తప్పదు. అంతేకాదు, గుజరాత్‌లో గతంలో ఉన్నట్లుగా బిజెపికి పటిష్టవంతమైన నాయకత్వం కూడా ఇప్పుడు లేకపోవడం, స్థానిక సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకునేవారు లేకపోవడం, ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించకపోవడం, వంటివన్నీ ఈ ఎన్నికల్లో ప్రతిఫలించాయనే చెప్పవచ్చు.

ఎన్నికల్లో గెలుపోటములు ఎవరికైనా సహజమే అయినప్పటికీ, విజయాలు అందుకున్నవారు ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లుగా వ్యవహరించకుంటే చివరికి ఇలాంటి ఫలితాలే ఉంటాయన్నది ఈ ఎన్నికల ద్వారా ఏ పార్టీ అయినా తెలుసుకోవాల్సిన విషయం. అయితే, మరీ ముఖ్యంగా తాజాగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన బిజెపి..ఈ ఎన్నికల ఫలితాలను ఒక గుణపాఠంగానే తీసుకోవాల్సి ఉంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter