Friday, 22 December 2017 10:53

పరిమిత ఆంక్షలతో... ట్రాఫిక్‌ను దారికి తేవొచ్చు!

Written by 
Rate this item
(0 votes)

trafficనెల్లూరు నగరంలో ట్రాఫిక్‌ సమస్య చాలా పెద్దది. దీనిని దారికి తేవడం ఏ ఒక్కరి వల్ల కూడా కాదు. ట్రాఫిక్‌ పెరగడానికి కారణం ప్రధాన రోడ్లు తక్కువ. అయ్యప్పగుడి నుండి బోసుబొమ్మ వరకు, వెంకటేశ్వరపురం నుండి అయ్యప్పగుడి ఫ్లైఓవర్‌ వరకు, సంతపేట నుండి కొత్తూరు వరకు వున్న ట్రంకురోడ్డు, మినీబైపాస్‌, పొదలకూరురోడ్డుల మీదే 80శాతం ట్రాఫిక్‌ రన్‌ అవుతుంటుంది. దీనిలో కూడా ట్రంకురోడ్డు మీద ట్రాఫిక్‌ మరీ ఎక్కువ. వేల సంఖ్యలో ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాలు, బస్సులు, ఇతర వాహనాలన్నీ ఈ రోడ్డు మీదే రాకపోకలు సాగిస్తుంటాయి.

నగరంలో ట్రాఫిక్‌ పోలీసులకు ఎప్పుడూ సవాలే! వాహనాలు ఎక్కువుగా వుండడం అటుంచితే వాహనదారులు క్రమశిక్షణా రాహిత్యం ట్రాఫిక్‌ సమస్యలను జఠిలం చేస్తుంది. రద్దీగా వున్న ప్రాంతాలలో వాహనాలను పార్కింగ్‌ చేయడం, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌, ఫ్రీ లెఫ్ట్‌ల వద్ద సైతం బండ్లు ఆపడం, జంక్షన్‌ల వద్ద తొందరగా పోవాలనే ఆత్రుతతో ముందుకు వచ్చి వాహనాలను అడ్డంగా పెట్టడం, ప్రయాణీ కుల కోసం నడిరోడ్ల మీదే ఆటోలను ఆపుతుండడం, జంక్షన్‌ల వద్ద సిటీబస్సులు నిలిపి వుంచడం వంటి ఎన్నో అంశాలు ట్రాఫిక్‌ సమస్యను జఠిలం చేస్తున్నాయి.

ట్రాఫిక్‌ దారికి రావాలంటే పోలీసులు కఠినంగా పని చేయక తప్పదు. ముఖ్యంగా ఒక ట్రాఫిక్‌ మొబైల్‌ వ్యాన్‌ను నగరంలోని ప్రధాన రోడ్లపై రద్దీ సమయంలో తిరిగేలా చేయాలి. ఈ రోడ్ల మీద రాంగ్‌ పార్కింగ్‌ చేసిన వాహనాలను సీజ్‌ చేయడం, నడిరోడ్ల మీద నిలిపి ప్రయాణీకులను ఎక్కించుకునే ఆటోలు, బస్సులను ఆపేయడం వంటి చర్యలు చేపట్టాలి. నగరంలో ట్రాఫిక్‌ మొబైల్‌ జీపు తిరుగుతుందంటే కొద్దిరోజులకైనా వాహనదారులలో భయం వస్తుంది. క్రమక్రమంగా మార్పువస్తుంది. నగరంలో ట్రాఫిక్‌ కంట్రోల్‌ కోసం, ట్రాఫిక్‌ జాం అయిన ప్రాంతాలలో వెంటనే ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయడం కోసంగా ఒక మొబైల్‌ పార్టీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కెవిఆర్‌ పెట్రోల్‌ బంకు సెంటర్‌లో నిత్యం ఏదో ఒక సమయంలో ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడుతుంది. ఇక్కడ 'ఫ్రీ లెఫ్ట్‌' విధానాన్ని ఎవరూ అనుసరించడం లేదు. కెవిఆర్‌ పెట్రోల్‌ బంకు, విఆర్‌సి, రామలింగాపురం జోన్‌ల వద్ద 'ఫ్రీ లెఫ్ట్‌'లను పద్ధతిగా అమలు చేయాల్సి వుంది. ఇటీవల నగరంలో తరచూ ట్రాఫిక్‌జామ్‌ అవుతున్న రోడ్డు మాగుంట లేఅవుట్‌ మెయిన్‌రోడ్డు. కెవిఆర్‌ పెట్రోల్‌ బంకు నుండి మినీబైపాస్‌ దాకా ఒక్కోసారి గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతుంది. మాగుంట లే అవుట్‌ అండర్‌ బ్రిడ్జి, సెలబ్రేషన్‌ హోటల్‌ జంక్షన్‌ల వద్ద వాహనాలు అడ్డదిడ్డంగా దూరుతుండడం వల్లే ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడు తుంది. మాగుంట లే అవుట్‌ మెయిన్‌రోడ్డులో వన్‌వేను అమలు చేస్తే ఇక్కడ ట్రాఫిక్‌ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. కెవిఆర్‌ పెట్రోల్‌బంకు వైపు నుండి మినీబైపాస్‌లోకి వెళ్ళే వాహనాలను కింగ్స్‌ కోర్టు మీదుగా, అలాగే మినీబైపాస్‌లో నుండి కెవిఆర్‌ పెట్రోల్‌బంకు వైపు వచ్చే వాహనాలను బెజవాడ గోపాలరెడ్డి విగ్రహం మీదుగా పోయేలా చేయాలి. మినీబైపాస్‌పై అనిల్‌ గార్డెన్స్‌ వద్ద డివైడర్లను క్లోజ్‌ చేయాలి. అప్పుడు మాగుంట లే అవుట్‌ లోకి వచ్చే వాహనాలు బెజవాడ గోపాలరెడ్డి బొమ్మ వద్ద మలుపు తిరిగి వస్తాయి. విఆర్‌సి నుండి గాంధీ బొమ్మ దాకా రోడ్డు పక్కనే నిలిపి వుంచుతున్న వాహ నాలు, ఆయా షాపుల వద్ద ఆగుతున్న ఆటోల మూలంగా ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక్కడ రోడ్డు చాలా ఇరుకు. వాహనాలు ఒక నిముషం ఆగినా ట్రాఫిక్‌ చాలా దూరం నిలిచిపోతుంది.

ముఖ్యంగా ఆటోలు, సిటీ బస్సులు ఎక్కడంటే అక్కడ ఆగకుండా పరిమిత స్టాపింగ్‌లు నిర్ణయించాలి. ఆటోలు, బస్సులు ఎక్కాలంటే ప్రయాణీకులు అక్కడికే వెళ్లాలి. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపే ఆటోడ్రైవర్లు, బస్సుల సిబ్బంది మీదే కాదు, తాము నిలబడి వున్న చోటే ఆటోలు, సిటీ బస్సులు ఆగాలనుకునే ప్రయాణీకు లకు కూడా పనిష్మెంట్లు వుండాలి. పోలీసులు కొంత కఠినంగా వుంటేనే నెల్లూరు ట్రాఫిక్‌ ఒక దారికి వస్తుంది.

Read 1550 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter