22 December 2017 Written by 

అర్బన్‌ మండలానికి ఆమోదం

mroఆరు లక్షలకు పైగా నగర జనాభా... 75వేల రూరల్‌ గ్రామాల జనాభా... రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు... 54 కార్పొరేషన్‌ డివిజన్‌లు... 17 గ్రామ పంచాయితీలు... రెండు పోలీస్‌ సబ్‌డివి జన్‌లు... 7 సర్కిల్‌ కార్యాలయాలు... 7 పోలీస్‌స్టేషన్‌లు... ఇదీ నెల్లూరు మం డలం పరిస్థితి.

ఈ మండలానికి ఒక్కడే తహశీల్దార్‌. ఇంత పరిధిలో రెవెన్యూ రికార్డులకైనా, సర్వేలకైనా ఈ ఒక్క తహశీల్దార్‌ మీదే ఆధారపడాలి. ఇంతవరకు రాష్ట్రంలోనే రెండో పెద్ద మండలంగా నెల్లూరు మం డలం పేరుగాంచింది. ఎట్టకేలకు నెల్లూరు అర్బన్‌ మండలం ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. దీంతో రెవెన్యూ అధికారులపై చాలా భారం తగ్గబోతోంది.

నెల్లూరులో రెండో మండలం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుండో వుంది. జనాభా ఎక్కువుగా ఉండడం, సమస్యలు ఎక్కువుగా ఉండడం, జనా భాకు, పనులకు, సమస్యలకు తగ్గట్లుగా అధికారులు లేకపోవడంతో ఎక్కడి

ఫైళ్ళు అక్కడే ఆగిపోతున్నాయి. ప్రజలకు, రైతులకు ఒక పని కావాలంటే నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. నెల్లూరు తహ శీల్దార్‌కు ఆఫీసులో పని భారం అనుకుంటే ప్రోటోకాల్‌ భారం ఇంకా అదనం. జిల్లా కేంద్రంలో వుంటున్న తహశీల్దార్‌ కావ డంతో మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు వచ్చిపోతున్నప్పుడు విధిగా వాళ్ళను అనుసరించాల్సి వస్తోంది. అలాంటప్పుడు ఆఫీసులో కుదురుగా కూర్చుని పనిచేసే అవకాశం తక్కువ. కనీసం రెండో మండల కార్యాలయం ప్రారంభమైతే అధికారులపై పని ఒత్తిడి తగ్గి ప్రజలకు తొందరగానన్నా పనులవుతాయేమో చూడాలి!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • సినిమానూ వదలని సెగ
    నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • అజీజ్‌ బ్రదర్స్‌పై కేసు
    నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. ఆయన పైన ఆయన తమ్ముడు, కార్పొరేటర్‌ జలీల్‌ మీద చెన్నైలో చీటింగ్‌ కేసు నమోదైంది. మేయర్‌ అజీజ్‌కు చెందిన స్టార్‌ ఆగ్రో కంపెనీలో వాటా కోసం తాము ఇచ్చిన 42కోట్ల…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter