Friday, 22 December 2017 11:01

అసెంబ్లీకి నెల్లూరు ఇంజనీర్‌ డిజైన్‌

Written by 
Rate this item
(0 votes)

galpikaలండన్‌లోని నార్మన్‌ పోస్టర్‌ ఇంజనీరింగ్‌ సంస్థ అధిపతి జాన్‌ జఫర్‌సన్‌ నివాసం. సోఫాలో ఆయన దిగులుగా కూర్చుని వున్నాడు. అప్పుడే వాళ్ళావిడ జేమ్స్‌ జోలి అక్క డకు వచ్చింది. విచారంగా ఉన్న తన భర్తను ఎందుకలా వున్నారని అడి గింది. అందుకు జాన్‌జఫర్‌సన్‌... ఆ ఏపి సీఎం చంద్రబాబు మా సంస్థ మీద అతి నమ్మకంతో తమ స్టేట్‌ అసెంబ్లీ డిజైన్‌ గీసిచ్చే పని నాకు అప్ప గించాడు. ఆయన హైటెక్‌ ఆలో చనలకు తగ్గట్లుగా డిజైన్‌ గీయడం కష్టంగా వుంది అని చెప్పాడు. అప్పుడామె అతనిని వంటింట్లోకి తీసుకెళ్ళింది. అక్కడున్న డైనింగ్‌ టేబుల్‌ మీద కాఫీ ఫ్లాస్క్‌, మిక్సీ, గ్రైండర్‌, కడాయ్‌, పాన్‌, బకెట్‌, ఓవెన్‌, స్టౌ, ఇడ్లీ పాత్ర వంటి వస్తు వులను పెట్టింది. వీటిని చూడండి... అసెంబ్లీ డిజైన్‌ను ఈజీగా గీసేస్తారు అని చెప్పింది. జాన్‌జఫర్‌ ఎంతో ఆనందంతో తన భార్యను హగ్‌ చేసు కుని డిజైన్‌ గీసే పనిలోపడ్డాడు.

----

అది ప్రపంచంలోనే అందమైన నగరాలన్నింటిని మిక్సీలో వేసి మిక్స్‌ చేసి తీసిన అమరావతి నగరం. ఉండవల్లిలోని హైటెక్‌రత్న, సీఎం చంద్రబాబు కార్యాలయం. జాన్‌ జఫర్‌సన్‌ తాను రూపొందించిన రెండు రకాల అసెంబ్లీ డిజైన్‌లను చంద్రబాబు ముందుంచాడు. అన్ని డిజైన్‌లలోకి ఆయన ఈజిప్టు పిర మిడ్‌, ఇడ్లీ పాత్ర డిజైన్‌ల వైపు మొగ్గు చూపాడు. వెంటనే ఆ డిజైన్‌లను రెండింటిని ఫోటో తీసి వాట్సాప్‌లో షేర్‌ చేసి మీకు ఏ డిజైన్‌ నచ్చిందో చెప్పండంటూ మెసేజ్‌ పెట్టాడు. నిముషాలలో కొన్ని వేల మెసేజ్‌లు... ఈ తొక్కలో డిజైన్‌ల కోసం ఇన్నేళ్ళు ఆగావా? ఇన్ని కోట్లు ఖర్చు చేయాలా? ఈ ఇడ్లీ పాత్రల డిజైన్‌ మనవాళ్ళు చేయలేరా? అంటూ

ఉతికి ఆరేసారు. ఆ మెసేజ్‌లు చది విన చంద్రబాబు... మా వాళ్ళకు మీరిచ్చిన డిజైన్‌లు నచ్చలేదు. ప్రపం చంలోనే పేరుమోసిన ఇంజనీరింగ్‌ సంస్థ మీది, ఆఫ్ట్రాల్‌ ఒక అసెంబ్లీ భవనం డిజైన్‌ను సరిగ్గా ఇవ్వలేక పోతున్నారే అని చంద్రబాబు కసిరి నట్లు అడిగాడు. ఆయన మాటలతో జఫర్‌సన్‌ తల పట్టుకుని బయటకు వచ్చాడు. అప్పుడే అక్కడ ఆయనకు స్టైల్‌ ఆఫ్‌ సింహపురి, మాజీఎమ్మెల్యే ఆనం వివేకా(66) తారసపడ్డాడు. చికాకుగా వున్న జఫర్‌సన్‌ను చూసి ఆయన... ఏం సార్‌, చిరాకుగా వున్నారు, మీకేమన్నా సమస్య వుంటే చెప్పండి, తీరుస్తా, విదేశీయులను గౌరవించడం మా బాధ్యత అని అడి గాడు. వివేకా మాటలతో జఫర్‌సన్‌కు తెలియని ధైర్యం వచ్చింది. తాము ఏ డిజైన్‌లు గీసినా చంద్రబాబుకు నచ్చడం లేదని, ఆయనను ఎలా మెప్పించాలో తమకు అర్ధం కావడం లేదని జఫర్‌సన్‌ చెప్పాడు. అప్పుడు వివేకా... ఈ విషయం నాకు వది లేయండి, నేను చెప్పినట్లు చేయండి అని ఆయన చెవిలో ఏదో చెప్పి పంపించాడు.

వారం తర్వాత...

చంద్రబాబు తన ఛాంబర్‌లో కూర్చుని వుండగా జఫర్‌సన్‌ వచ్చాడు. తాను తెచ్చిన అసెంబ్లీ డిజైన్‌ను ఆయన ముందుంచాడు. అక్కడే మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, పత్తిపాటి, దేవినేని ఉమ, పరిటాల సునీత, నారా లోకేష్‌లు కూడా వున్నారు. ఆయన ఇచ్చిన డిజైన్‌ చూడగానే చంద్రబాబు కళ్ళు ఆనందంతో మెరిసాయి. ఇదికదా డిజైన్‌ అంటే... అద్భుతంగా వుంది. మా ఇంజనీర్లకు ఇస్తే మురికివాడలు కడతారని మీకు డిజైన్‌ బాధ్యత అప్పగించాను, ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకున్నారు. ఎంతైనా ఫారిన్‌ ఇంజనీర్లు ఫారిన్‌ ఇంజనీర్లే. మీకు డిజైన్‌ గీసిస్తే వందకోట్లు ఇస్తా నన్నాను, బోనస్‌గా ఇంకో పాతిక కోట్లు కూడా తీసుకోండని చప్పట్లు కొట్టాడు. మంత్రులు కూడా చప్పట్లు కొట్టి జఫర్‌సన్‌ను అభినందించారు.

----

లండన్‌లోని నార్మన్‌పోస్టర్‌ కార్యా లయం. జఫర్‌సన్‌ తన సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసాడు. తన సిబ్బందినుద్దేశించి జఫర్‌సన్‌ మాట్లా డుతూ... ఏపి అసెంబ్లీకి మన సంస్థ నుండి ఇచ్చిన డిజైన్‌ ఓకే అయ్యింది అని చెప్పగానే సిబ్బంది చప్పట్లు కొట్టారు. అక్కడే జఫర్‌సన్‌ కలుగ జేసుకుని... అయితే ఈ ఘనత మనదికాదు, నెల్లూరుకు చెందిన మాజీఎమ్మెల్యే, మాస్‌మసాలా నాయ కుడు, 24I7 కళ్ళకు నల్లద్దాలు పెట్టుకునే సోగ్గాడు ఆనం వివేకానంద రెడ్డిది. చంద్రబాబును మెప్పించే గండం నుండి నన్ను ఆయనే గట్టెక్కిం చాడు. ఈసారి ఆయనను లండన్‌కు పిలిపించి సన్మానించాలని చెప్పాడు. రాబర్డ్‌ముగాబే అనే ఇంజనీర్‌ లేచి... ఆయనేం చేసాడు వివరంగా చెప్పం డని అడిగాడు. అప్పుడు జఫర్‌సన్‌... ఏపి అసెంబ్లీ డిజైన్‌ ఎలా గీయాలో తెలియక నేను తికమకపడుతున్న సమయంలో వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు అమరావతిలో నాకు ఈ వివేకా తగిలాడు. నా సమస్య చెప్పాను. ఆయన నాకు రెండు మోటు సామె తలు చెప్పాడు. అవి నాకు అర్ధం కాలేదు. అందులో ఒకదాని ఉద్దేశ్యం మాత్రం పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదనే మాట అర్ధమైంది. ఆయన నన్ను వెంటబెట్టు కుని నెల్లూరులోని భారత్‌ బిల్డర్స్‌ అనే కన్‌స్ట్రక్షన్స్‌ ఆఫీసుకు తీసుకెళ్లాడు. అక్కడ సంస్థ అధిపతి చలపతికి నన్ను పరిచయంచేసి... ఇంగ్లాండ్‌లో వీళ్ళు పార్లమెంటు భవనం కట్టాలనుకుం టున్నారు, దానికి సంబంధించిన డిజైన్‌ గీసి ఇవ్వమని వివేకా చెప్పాడు. వాళ్ళు నన్ను అక్కడే కూర్చో బెట్టి ఒకటిన్నర గంటలో డిజైన్‌ గీసి నా చేతిలో పెట్టారు. డిజైన్‌ గీసినందుకు నేను డబ్బులు ఇవ్వబో యాను... మీ పార్లమెంట్‌ భవనం డిజైన్‌ గీసే అవ కాశం రావడమే మా అదృష్టమంటూ డబ్బులు తీసుకోలేదు. భారత్‌ బిల్డర్స్‌ చలపతి ఇచ్చిన డిజైన్‌నే తీసుకుని నేను చంద్రబాబు ముందు పెట్టాను. అది చూసి వాళ్ళు ఆనందచకితుల య్యారు. అద్భుతమైన డిజైన్‌ గీసా రంటూ అనుకున్న దానికంటే ఫీజు ఎక్కువే ఇచ్చారు. ఇక్కడ నాకో విషయం అర్ధమైంది. ప్రపంచంలో ఇంకే దేశస్థులు మనల్ని డిజైన్‌ అడి గినా తలలు బద్దులు కొట్టుకుని డిజైన్‌లు గీయాల్సిన పనిలేదు. నెల్లూరులో భారత్‌ బిల్డర్స్‌ సంస్థకు ఇచ్చేద్దాం. వాళ్ళు మంచి డిజైన్‌లు ఇస్తారు. వాటిని మనం గీసినట్లే అన్ని దేశాల ముందు బిల్డప్‌ ఇద్దాం. కష్టం వారిది... అదృష్టం మనది... ఆం ధ్రాలో అసెంబ్లీ భవనానికి ఆంధ్రుడి చేత డిజైన్‌ చేయించాను. కాకపోతే దాని ఛార్జీలు మనకొచ్చాయి. ఇండి యాను వదిలి బ్రిటీష్‌ వాళ్లం మను షులం మాత్రమే వచ్చాం... మన ఆత్మలు ఇంకా అక్కడే తిరుగుతు న్నాయి, దానికి ఈ సంఘటనే ఉదా హరణ అని చెప్పి ముగించాడు.

Read 75 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • రెండు నెలల్లో... ట్రెండ్‌ మారింది
  రాజకీయాలలో పరిస్థితులు తారుమారు కావడానికి ఎంతో కాలం పట్టదు. నాలుగేళ్ళ పదినెలలు సమర్ధవం తంగా పని చేసిన ఒక ప్రభుత్వం ఒక చిన్న తప్పు చేస్తే ఒక్క నెలలోనే గబ్బు పట్టొచ్చు. దాని మూలంగానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. నాలుగేళ్ళ పది నెలల…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…

Newsletter