29 December 2017 Written by 

ముందస్తు యుద్ధానికి సిద్ధం

mundastuరాష్ట్రంలో రాజకీయ వాతావరణం మనకు అనుకూలంగా వుంది. మన పరిపాలన అద్భుతంగా ఉంది. మన అభివృద్ధి పథకాలకు ప్రజలు జేజేలు కొడుతున్నారు. మనం చేసిన రెండు పుష్కరాలు ప్రజలను మెప్పించాయి. మనం కడుతున్న అమరావతి రాజధానికి ప్రపంచ దేశాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పోలవరం, పట్టిసీమ, పురు షోత్తమ పట్నం ప్రాజెక్ట్‌లైతేనేమీ, ఋణమాఫీ అయితేనేమీ.... ఇవి చంద్రబాబే చేయగలడు అనిపిం చేలా చేసాం. కాపు రిజర్వేషన్లతో ఆ వర్గం వారినీ దూరం కాకుండా చేసుకున్నాం, బి.సిలు మనల్ని వదిలి ఎక్కడికీ పోరు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని రెడ్ల మధ్య ఏ మేరకు చిచ్చు పెట్టాలో, చీల్చాలో ఆమేరకు చేసాం. ముగ్గురు వైసిపి ఎంపీలను, 23మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాం, చాలా చోట్ల వైసిపికి అభ్యర్థులనే లేకుండా చేసాం, ఎన్నికలకు ఇంతకంటే మంచి వాతావరణం ఇంకేముంటుంది. కొలిమి బాగా వేడిమీదున్నప్పుడే ఇనుమును వంగదీయాలి. రాజకీయ వాతావరణం అనుకూలంగా వున్నప్పుడే ఎన్నికలకు పోయి లబ్ది పొందాలి. ఈ ఆలోచనతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందస్తు ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

2014లో అధికారం దక్కడమే చంద్రబాబుకు రాజకీయ పునర్జన్మలాంటిది. ఆ ఎన్నికల్లో ఓడిపోయుంటే ఆయన పరిస్థితి వేరేగా వుండేది. అధికారం దక్కింది మొదలు ఆయన రాష్ట్రాభివృద్ధి కోసం కంటే రాష్ట్రంలో ప్రతి పక్షాన్ని నిర్వీర్యం చేయడం కోసమే ఎక్కువుగా కృషి చేసాడు. బలమైన ప్రతిపక్షం లేకుంటే వచ్చే ఎన్నికల్లో తిరిగి సులభంగా అధికారం దక్కించుకోవచ్చన్నది ఆయన ఆశ. అందుకే ప్రతిపక్షాన్ని అసెంబ్లీలోనూ, బయటా బలహీనపరచడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. దీని కోసం విలువలను, రాజ్యాంగ నిబంధన లను తుంగలో తొక్కారు కూడా!

ఇక నంద్యాల, కాకినాడ ఉపఎన్నికల్లో విజయాలు చంద్రబాబులో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఎన్ని కోట్లు ఖర్చుపెడితే, ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడితే అక్కడ గెలిచామన్నది ఆయన ఆలోచించడం లేదు. ప్రతిపక్షం బలహీనంగా వుంది, ప్రజలు మనల్ని బలంగా నమ్ముతున్నారనే నమ్మకంతోనే వున్నాడు. అలాగే జగన్‌ కేసుల విషయంలో ఏదో ఒకటి తేలకముందే ఎలక్షన్‌కు పోవాలి. 2జీ స్పెక్ట్రం కేసు చూసాక జగన్‌ కేసు విషయంలో కూడా సందేహాలు నెలకొన్నాయి. జగన్‌ మీద ఇప్పుడెలాగూ లక్షకోట్ల అవినీతి ముద్ర వేసారు. కేసులు, కోర్టులు చూపించే ఇంతకాలం అసెంబ్లీలో, బయటా జగన్‌పై ఎదురుదాడి చేస్తూ వచ్చారు. జగన్‌పై కేసులు ప్రజల్ని కొంతవరకు ప్రభావితం చేస్తూనే వున్నాయి. అంతపెద్ద 2జీ స్పెక్ట్రం స్కామ్‌ గాల్లో తేలిపోయింది. అలాంటిది జగన్‌పై కేసులు కక్ష పూరితంగా పెట్టినవి. సోనియాగాంధీకి ఎదురుతిరిగాడు కాబట్టే ఆయనపై కేసులు నమోదయ్యాయన్నది జగమెరిగిన సత్యం. ఇటీవల రాజకీయ నాయకులపై నమోదైన కేసులన్నీ కూడా త్వరిత గతిన విచారణ జరిపి తీర్పులొస్తున్నాయి. ఆ కోణంలో జగన్‌ కేసు కూడా తుదివిచారణ కొచ్చి నిర్దోషిగా తేలితే... తెలుగుదేశం చేతిలో వున్న ఆ ఒక్క ఆయుధం పోతుంది. జగన్‌ను వీళ్ళు వేలెత్తి చూపడానికి ఏమీ ఉండదు. ప్రజల్లో కూడా జగన్‌ పట్ల సానుభూతి పెరుగుతుంది. ఒకవేళ దోషిగా తేలినా ఇప్పటికీ అప్పటికీ పెద్ద మార్పుండదు. అంతేకాదు, పార్లమెంటు ఎన్నికలకు ముందే అసెంబ్లీ ఎన్నికలను జరిపించి అందులో గెలిస్తే జాతీయ రాజకీయాలలో చంద్రబాబు ప్రాధాన్యత పెరుగుతుంది. లోకేష్‌ను రాష్ట్రంలో వుంచి చంద్రబాబు ఢిల్లీ వైపు చూడొచ్చు. ఇప్పటివరకు తనను చిన్నచూపు చూసిన బీజేపీని దూరంగా పెట్టి, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక కూటమిగా ఏర్పాటు చేయొచ్చు. ఆ కూటమికి తానే నేతృత్వం వహించవచ్చు. 2019 ఎన్నికల్లో హంగ్‌ ఫలితాలు వస్తే ప్రత్యామ్నాయ కూటమిదే కీలకపాత్ర అవుతుంది. అప్పుడు తృతీయ కూటమి నుండి ప్రధాని పదవికి చంద్రబాబు పేరును కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలు తమ రాష్ట్రాలను వదిలొచ్చే పరిస్థితుల్లో లేరు. సీనియర్‌గా ములాయంసింగ్‌ యాదవ్‌ వున్నా యూపీలో బలహీనపడ్డాడు. కొడుకును రాష్ట్ర రాజకీయాలలో వుంచి ఢిల్లీలో ఉండగల అవకాశం చంద్రబాబుకే వుంది. కాబట్టే 2018లోనే ఆయన 'ముందస్తు'కు రెడీ అవుతున్నాడు. ముక్కోటి దేవతలు ఆయన ఆలోచనలను పసిగట్టి తధాస్తు అంటే మనకు ముందస్తే...!Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter