29 December 2017 Written by 

అడ్డం మాట్లాడితే కొట్టడమే!

kotadameఇటీవల ఆత్మకూరు పట్టణంలో అక్రమ నిర్మాణం విషయంలో ఆర్‌.ఐ జహీర్‌పై తెలుగుదేశం నాయ కులు, మాజీ సొసైటీ అధ్యక్షుడు ఇందూరు వెంకటరమణారెడ్డి చేయి చేసుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల మీద అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు మితిమీరాయి. నెల్లూరుజిల్లాలో ఇటువంటివి పెద్దగా వుండవు. చాలావరకు అధికారులు అధికారపార్టీ నాయకులు సమన్వయంతోనే పనిచేసుకుం టుంటారు. ఈ ప్రశాంతతకు భగ్నం కలిగిస్తూ టీడీపీ నేత రమణారెడ్డి అక్రమనిర్మాణాన్ని అడ్డుకున్నందుకు జహీర్‌ను కొట్టాడు. దీనిపై రెవెన్యూ ఉద్యోగులు భగ్గుమన్నారు. ఆర్‌ఐ జహీర్‌ ఆత్మకూరు పోలీసు స్టేషన్‌లో రమణారెడ్డిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు పెట్టారు. 24వ తేదీ రమణారెడ్డిని అరెస్ట్‌ చేసి జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు హాజరు పరచగా ఆయన రిమాండ్‌కు ఆదేశించారు. వెంటనే రమణారెడ్డిని ఆత్మకూరు సబ్‌జైలుకు తరలించారు. తన అనుచరుడు రమణారెడ్డిపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న ఆత్మకూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ఆనం రామనారాయణరెడ్డి ఆఘమేఘాల మీద ఆత్మకూరు పోలీసుస్టేషన్‌కు చేరుకున్నాడు. ఆర్‌.ఐపై తమ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుల ప్రకారం కూడా కేసులు నమోదు చేయాలని ఒత్తిడి తెచ్చాడు. పోలీసులు ఒత్తిడికి తలొగ్గి రామాపురం నరసింహులు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్‌.ఐ జహీర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆర్‌.ఐపై తప్పుడు కేసు ఎలా పెడతారంటూ రెవెన్యూ ఉద్యోగులు మండిపడుతున్నారు. ముఖ్యంగా అధికారులపై దాడి చేసిన తన అనుచరుడిని మందలించకపోగా, అతనికి వత్తాసుపలుకుతూ ఆర్‌.ఐ మీద తప్పుడు కేసు ఎలా పెట్టిస్తారంటూ మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని రెవెన్యూ ఉద్యోగుల సంఘం సీరియస్‌గానే తీసు కుంది. కొడితే కొట్టించుకుని కామ్‌గా పోకుండా పోలీసుస్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేయడం ఆర్‌.ఐ చేసిన తప్పుగా తెలుగుదేశం నాయకులు భావించినట్లున్నారు. అధికార పార్టీ నాయకులు కొడితే అధికారులు కొట్టించుకోవాలి... అదీ రూల్‌ అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితులున్నాయి. ఏ అధికారి అయినా అడ్డం తిరిగితే ఇలా ఎస్సీఎస్టీ కేసులు పెట్టి సతాయిస్తామని చెప్పకనే చెప్పారు. కాబట్టి అధికారులూ... జర జాగ్రత్త!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • సినిమానూ వదలని సెగ
    నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter