29 December 2017 Written by 

జీహుజూర్‌ అనకుంటే... బదిలీ వేటే!

gనెల్లూరు నగరపాలక సంస్థకు ఒక సంప్రదాయం వుంది. ఏ కమిషనర్‌ కూడా ఇక్కడ ఆరు నెలలు మించి పనిచేయకూడదు. మహా అంటే తొమ్మిది నెలలు. అదిగో ఆ సాంప్రదాయమే మారలేదు. వచ్చి 9 నెలలు కూడా తిరక్కుం డానే నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ ఢిల్లీరావును బదిలీ చేసారు.

ప్రస్తుతం నెల్లూరు అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ(నుడా)కు ఇన్‌ఛార్జ్‌ వైస్‌ ఛైర్మెన్‌గా వ్యవహరిస్తున్న ఢిల్లీరావును అదే పోస్ట్‌లో పూర్తిస్థాయి వైస్‌ఛైర్మెన్‌గా నియ మిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఢిల్లీరావు త్వరలోనే కంఫర్ట్‌ ఐఏఎస్‌ శిక్షణకు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ రావు స్థానంలో కొత్త కమిషనర్‌గా ఆలీమ్‌ బాషాను నియమించారు. ప్రస్తుతం ఆయన మున్సిపల్‌ పరిపాలనా విభాగంలో మున్సి పల్‌ పాఠశాలల డైరెక్టర్‌గా వుంటూ ఇక్క డకు బదిలీ అయ్యారు.

2014లో కౌన్సిల్‌ ఏర్పడింది మొదలు ఆరు నెలలు మించి ఇక్కడ ఏ కమిషనర్‌ ఉండడం లేదు. కొందరు తమంతటతామే బదిలీ చేయించుకుని వెళితే ఇంకొందరిని తమ మాట వినడం లేదని అధికారపార్టీ వాళ్ళే బదిలీ చేయించారు. ఈ కౌన్సిల్‌ ఏర్పడేనాటికి కమిషనర్‌గా వున్న శ్యాం సన్‌ను 2014 అక్టోబర్‌లో బదిలీ చేశారు. నెల్లూరు కార్పొరేషన్‌కు ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయితే బాగుంటుందని చెప్పి ఐఏఎస్‌ కమ్‌ ఐపిఎస్‌ అయిన చక్రధర్‌బాబును కమిష నర్‌గా తెచ్చారు. అయితే ఆయనను కుదురుగా పనిచేసుకోనీయలేదు. ఆయన పనులకు అడ్డంపడ్డారు. కొంతకాలానికే ఆయన పై కత్తి కట్టారు. చివరకు రాజకీయ కారణాలతో ఆయనను పాడేరు ఫారెస్ట్‌కు బదిలీ చేశారు. ఆ తర్వాత కమిషనర్‌గా వచ్చిన పివివిఆర్‌ మూర్తిని కూడా 9నెల లకే రాజకీయ కారణాలతో తరిమేశారు. ఆ తర్వాత వచ్చిన వెంకటేశ్వర్లు పదినెలల పాటు బాగానే పాకులాడాడు. ఇక్కడ నాయకులతో ఊరేగలేక తనపాటికి తానే బదిలీ చేయించుకున్నాడు. ఈయన వెళ్లిన తర్వాత ఇంతియాజ్‌, బి.రామిరెడ్డి, రవి కృష్ణంరాజులు మూడు నెలల పాటు ఇన్‌ఛార్జ్‌ కమిషనర్‌లుగా పనిచేశారు. ఈ ఏడాది మార్చి 31న ఢిల్లీరావు కార్పొరేషన్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. నిజా యితీగా, సమర్ధవంతంగా పని చేస్తున్నాడని పేరు తెచ్చుకున్నాడు. ఆక్రమణల తొల గింపు విషయంలో ఎవ్వరి మాట విన లేదు. ఎవరితో రాజీ పడలేదు. దీంతో అధికారపార్టీ నేతలతో విభేదాలొచ్చాయి. ఆ విభేదాలతోనే ఇప్పుడు బదిలీ జరిగి నట్లుగా తెలుస్తోంది. కౌన్సిల్‌ ఏర్పడిన ఈ మూడూ ముప్పావు సంవత్సరాల కాలంలో ఇన్‌ఛార్జ్‌లతో కలిపి 9మంది కమిషనర్లు మారారు. ఆలీమ్‌ బాషా పదో కమిషనర్‌. ఈయన కూడా సాంప్రదాయాన్ని పాటి స్తాడో, సాంప్రదాయాన్ని బద్ధలు కొడతాడో చూడాలి. ఏదేమైనా కమిషనర్ల బదిలీకి ఒక రికార్డన్నది ఏర్పాటు చేస్తే తొలిగా ఆ రికార్డు నెల్లూరు కార్పొరేషన్‌కే దక్కుతుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…

Newsletter