05 January 2018 Written by 

అధ్వాన్నంగా ఆత్మకూరు - వింజమూరు రోడ్డు

roadఆత్మకూరు - వింజమూరు మార్గంలో దాదాపు 12కిలోమీటర్ల రోడ్డు అధ్వా న్నంగా తయారై వాహనదారులకు నరకం చూపిస్తోంది. ఈ రోడ్లోని గుంతల్లో పడి వాహనాలు డ్యాన్సులు చేస్తున్నాయి. ఆత్మ కూరు నుండి వింజమూరు వెళ్ళే మార్గంలో నెల్లూరుపాలెం నుండి రాజవోలు వరకు గతంలో సింగిల్‌లైన్‌గా వున్న రోడ్డును డబుల్‌లైన్‌గా మార్చారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆనం రామనారాయణరెడ్డి మంత్రిగా ఉండబట్టి నిధులు తెచ్చి ఈ రోడ్డును డబుల్‌లైన్‌ చేయించారు. రాజ వోలు దాటిన దగ్గర నుండి వింజమూరు దాకా ఉదయగిరి అసెంబ్లీ పరిధి వస్తుంది. అప్పుడే మంత్రి రామనారాయణరెడ్డి తలచుకుని వుండుంటే వింజమూరు దాకా డబుల్‌రోడ్డు చేసివుండొచ్చు. కాని, అప్పుడు ఉదయగిరి ఎమ్మెల్యేగా మేకపాటి చంద్ర శేఖర్‌రెడ్డి ఉండడం, ఆయన వైసిపిలో చేరడం మూలంగా రాజకీయ కారణాలతో ఈ బాలెన్స్‌ రోడ్డును నిర్లక్ష్యం చేశారు. సరే, తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కదా, ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామా రావన్నా దీనిని పట్టించుకుని బ్యాలెన్స్‌ సింగిల్‌రోడ్డును డబుల్‌లైన్‌ చేసేదానికి చొరవ చూపాడా అంటే అదీలేదు. ఆయన నియోజకవర్గంలోనే పెద్దగా ఉండేది లేదు. ఇక ఈ రోడ్డునేం పట్టించుకుంటాడు. రాజ వోలు నుండి వింజమూరు దాకా రోడ్డు గుంతలమయమై అధ్వాన్నంగా మారింది. ప్రతిరోజూ వందల సంఖ్యలో బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తుంటాయి. కావలి, ఆత్మకూరుల మధ్య ఆర్టీసీ బస్సులు తిరుగు తుంటాయి. ఇటీవల ముంబై రోడ్డును మూడులైన్లు సిమెంట్‌ రోడ్డుగా మార్చాక వింజమూరు వైపు వెళ్ళే ప్రైవేట్‌ వాహనాల వాళ్ళు సంగం, కలిగిరి మీదుగా కాకుండా నెల్లూరుపాలెం మీదుగా వింజమూరు కెళుతున్నారు. కాకపోతే ఈ 12కిలోమీటర్ల సింగిల్‌రోడ్డును కూడా డబుల్‌ లైన్‌ చేస్తే ప్రయాణం చాలాసులభంగా వుంటుంది. దీనిపై ఉదయగిరి ఎమ్మెల్యే శ్రద్ధ చూపాల్సి వుంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • సినిమానూ వదలని సెగ
    నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter