ఆత్మకూరు - వింజమూరు మార్గంలో దాదాపు 12కిలోమీటర్ల రోడ్డు అధ్వా న్నంగా తయారై వాహనదారులకు నరకం చూపిస్తోంది. ఈ రోడ్‌లోని గుంతల్లో పడి వాహనాలు డ్యాన్సులు చేస్తున్నాయి. ఆత్మ కూరు నుండి వింజమూరు వెళ్ళే మార్గంలో నెల్లూరుపాలెం నుండి రాజవోలు వరకు గతంలో సింగిల్‌లైన్‌గా వున్న రోడ్డును డబుల్‌లైన్‌గా మార్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనం రామనారాయణరెడ్డి మంత్రిగా ఉండబట్టి నిధులు తెచ్చి ఈ రోడ్డును డబుల్‌లైన్ చేయించారు. రాజ వోలు దాటిన దగ్గర నుండి వింజమూరు దాకా ఉదయగిరి అసెంబ్లీ పరిధి వస్తుంది. అప్పుడే మంత్రి రామనారాయణరెడ్డి తలచుకుని వుండుంటే వింజమూరు దాకా డబుల్‌రోడ్డు చేసివుండొచ్చు. కాని, అప్పుడు ఉదయగిరి ఎమ్మెల్యేగా మేకపాటి చంద్ర శేఖర్‌రెడ్డి ఉండడం, ఆయన వైసిపిలో చేరడం మూలంగా రాజకీయ కారణాలతో ఈ బాలెన్స్ రోడ్డును నిర్లక్ష్యం చేశారు. సరే, తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కదా, ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామా రావన్నా దీనిని పట్టించుకుని బ్యాలెన్స్ సింగిల్‌రోడ్డును డబుల్‌లైన్ చేసేదానికి చొరవ చూపాడా అంటే అదీలేదు. ఆయన నియోజకవర్గంలోనే పెద్దగా ఉండేది లేదు. ఇక ఈ రోడ్డునేం పట్టించుకుంటాడు. రాజ వోలు నుండి వింజమూరు దాకా రోడ్డు గుంతలమయమై అధ్వాన్నంగా మారింది. ప్రతిరోజూ వందల సంఖ్యలో బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తుంటాయి. కావలి, ఆత్మకూరుల మధ్య ఆర్టీసీ బస్సులు తిరుగు తుంటాయి. ఇటీవల ముంబై రోడ్డును మూడులైన్లు సిమెంట్ రోడ్డుగా మార్చాక వింజమూరు వైపు వెళ్ళే ప్రైవేట్ వాహనాల వాళ్ళు సంగం, కలిగిరి మీదుగా కాకుండా నెల్లూరుపాలెం మీదుగా వింజమూరు కెళుతున్నారు. కాకపోతే ఈ 12కిలోమీటర్ల సింగిల్‌రోడ్డును కూడా డబుల్ లైన్ చేస్తే ప్రయాణం చాలాసులభంగా వుంటుంది. దీనిపై ఉదయగిరి ఎమ్మెల్యే శ్రద్ధ చూపాల్సి వుంది.
Published in
గ్రామసమాచారం
