05 January 2018 Written by 

రోబో రాజకీయ షో

rajaniసూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎప్పుడూ ఒక సంచలనమే. ఆయన సినిమాలు ప్రజలను ఉర్రూతలూగిస్తూ ఎంతో సంచలనం కలిగించడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తమిళనాట రాజకీయాల్లోనూ రజనీ ఒక సంచలనమే. ఆయన చేసిన రాజకీయ ఆరంగేట్రం ప్రకటన కూడా ఒక పెద్ద కలకలమే. దాదాపు రెండు దశాబ్దాలుగా 'ఇదిగో వస్తున్నా.. అదిగో వచ్చేస్తున్నా'నంటూ అందరినీ ఊరిస్తున్న రజనీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేశానంటూ తాజాగా ప్రకటించడంతో తమిళనాడులో కొత్తసంవత్సరం కొంగ్రొత్త రాజకీయపరిణామాలతో ఉత్కంఠభరితంగా ఉంది. తమిళ రాజకీయాలను ఊగించి శాసించే సత్తా రజనీకాంత్‌కు ఉందన్నది అందరికీ తెలిసిందే. అత్యంత ప్రజాదరణ, అశేష అభిమానగణం ఉన్న విఖ్యాత నటుడు రజనీ. గతంలో, సినీ హీరోగా ఉంటూ 1977లో తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఎం.జి రామచంద్రన్‌ తమిళప్రజలకు ఆరాధ్యదైవంగా నిలిచారు. అదేవిధంగా, 1991లో ప్రఖ్యాత సినీనటి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉంటూ తమిళ రాజకీయాల్లో రాణించి ప్రజాహృదయాల్లో 'అమ్మ'గా తమదైన ముద్ర వేసు కున్నారు. జయలలిత మృతితో తమిళ రాజకీయాలు సంక్షోభంలో పడిపోయాయి. రోజుకోరకం రాజకీ యాలు అక్కడ రాజ్యమేలాయి. ఇటీవల ప్రముఖ సినీహీరో కమల్‌హాసన్‌ కూడా తాను రాజకీయ రంగంలోకి వచ్చినట్లు ప్రకటించుకున్నారు. సినిమా రంగం ప్రజలను బాగా ప్రభావితం చేసే రంగం కనుక, ఆ రంగంలో పేరుప్రతిష్టలు సంపాదించు కున్నవారికి, రాజకీయరంగంలో రాణించడం పెద్ద కష్టమేమీ కాదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 1982లో నటరత్న నందమూరి తారకరామారావు పార్టీ స్థాపించి ఆ తర్వాత కేవలం 9నెలల్లోనే అధికార పీఠాన్ని అధిష్టించగలిగారు. ప్రపంచఖ్యాతి పొందిన నటుడు అమితాబ్‌బచ్చన్‌ ప్రత్యేకించి సొంతపార్టీ పెట్టక పోయినా రాజకీయాల్లో ఆయన ప్రత్యేకత ఆయనదే. ప్రత్యేకించి తమిళనాడులో రాజకీయరంగంలోకి వచ్చిన తమిళనటులు శివాజీగణేశన్‌, విజయ్‌కాంత్‌, శరత్‌కుమార్‌ తదితరులు వెనుకబడినా, పలువురు ప్రముఖులు అటు సినీరంగంలోనూ, ఇటు రాజకీయరంగంలోనూ అత్యద్భుతంగా రాణించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. తమిళనాడులో డిఎంకె పార్టీని పెట్టి, ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన అన్నాదురై, ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన కరుణానిధి కూడా సినీరంగానికి చెందినవారే కావడం విశేషం. ఈ నేపథ్యంలో, సూపర్‌స్టార్‌ రజనీ రాజకీయరంగంలోకి దిగడం తమిళనాట రాజకీయాలను బాగా ప్రభావితం చేస్తోంది. తమిళనాడులో ఇప్పుడు ఎక్కడ విన్నా రజనీ రాజకీయాలపై చర్చే జరుగుతోంది. ఎక్కడబట్టినా రజనీ మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. 'దేవుడు శాసిస్తే..రజనీ పాటిస్తాడు'..అంటూ తన రాజకీయరంగ ప్రవేశంపై ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూవచ్చిన రజనీ, ఇప్పుడు తమిళనాడులో సొంత పార్టీ స్థాపించి, వచ్చే శాసనసభ ఎన్నికల్లో 234 స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు ప్రకటించడంతో తమిళ నాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక, రజనీ అభిమానులు ఎంతో ఉత్సాహంతో తమిళనాడంతా సందడి చేస్తున్నారు. 'బాషా..ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లు' అన్నట్లుగానే, రజనీ ఒక్క మాట చెప్తే చాలు ఆచరించేందుకు ఆయన అభిమానులు లక్షల్లోనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందులోనూ ప్రజలకు మంచి చెయ్యడానికి, సమాజంలో మంచి మార్పు తేవడానికి తాను రాజకీయ రంగంలోకి వస్తున్నట్లు రజనీ ప్రకటించడం ప్రజలందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. నీతి, నిజాయితీ, మతసామరస్యంతో కూడిన ఆధ్యాత్మిక రాజకీయాలను ప్రజల వద్దకు తీసుకువెళ్ళే లక్ష్యంతో రజనీ రాజకీయరంగంలో ప్రవేశించడం ఎంతైనా సంచలనమే. రజనీ రాజకీయ రంగప్రవేశం కంటే ఆయన ప్రసంగంలో పేర్కొన్న 'ఆధ్యాత్మిక రాజకీయం' ఇప్పుడు మరింత కలకలం సృష్టిస్తోంది. అందులోనూ 'కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన' అంటూ భగవద్గీతలోని శ్లోకాలను ఉదహరిస్తూ రజనీ ప్రసంగించడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆధ్యాత్మిక భావనలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే రజనీ అంటే తమిళనాట ప్రజలకు ఎంతో అభిమానం కూడా. అష్టైశ్వర్యాలు ఉన్నప్పటికీ, నటనలో హిమాలయ శిఖరాలను అందుకుంటున్న రజనీ..వాస్తవ జీవితంలో మాత్రం ఒక యోగిగానే జీవిస్తూ, హిమాలయాలకు తరచుగా వెళ్తుండడం అందరికీ తెలిసిందే. కుల మతాల ఛాయలు ఏ మాత్రం లేని పారదర్శక ఆధ్యా త్మిక రాజకీయాలు రావాల్సిన అవసరం ఎంతైనా

ఉందని రజనీ అభిలషిస్తున్నారు. తన ప్రసంగంలోనూ ఆ మాటలే చెప్పారు కూడా. ప్రజాస్వామిక పంధాలో ప్రజలకు మంచి చేయడానికి తానిప్పుడు ముందుకు రాకపోతే ఆ అపరాధ భావన తనను జీవితాంతం వెంటాడుతుందని ఆయన ఆవేదన. ఏదేమైనా, మంచి వ్యక్తిత్వం, ఆధ్యాత్మికతత్వం ఉండే రజనీ మాటంటే ఆయన అభిమానులకు వేదవాక్కు. ఐహిక భోగాలకు దూరంగా ఉంటూ, ఆధ్యాత్మిక చింతనతో జీవించే రజనీ వంటి సూపర్‌స్టార్‌ రాజకీయాల్లోకి వస్తే, అన్ని వర్గాల ప్రజలు తప్పకుండా ఆదరిస్తారన్నది రాజకీయవర్గాలు ఘంటాపథంగా చెప్తున్నాయి. రజనీ వంటి ఆధ్యాత్మికవేత్త రాజకీయాల్లో ఉంటే తమిళనాట రాజకీయాలు మంచి దిశలో సాగుతాయన్నది విశ్లేషకుల భావన. మంచి రాజకీయవేత్తలను ప్రజలు ఎల్లవేళలా ఆదరిస్తారనడంలో ఎలాంటి సందేహం ఉండనక్కర లేదు. అందువల్ల అశేషప్రజానీకంలో తనకున్న అభిమానాన్ని ఎల్లవేళలా దృష్టిలో పెట్టుకుని, రాజకీయ రంగంలోనూ తనదైన శైలితో, నీతికి నిజాయితీకి ప్రధమ ప్రాధాన్యతనిస్తూ, మంచి లక్ష్యాలతో ముందడుగు వేస్తే రజనీకి రాజకీయరంగంలోనూ తిరుగుండదు.

తాను చెప్తున్న మాటలను ఆచరించే చూపే ధీరత్వం పెంపొందించుకుని, ప్రజల సంక్షేమమే ధ్యాసగా, శ్వాసగా నిరంతరం కృషి చేస్తే తమిళనాట రజనీ పార్టీయే కాదు, రజనీ చెప్పే ప్రతిమాటా సూపర్‌హిట్‌ అవుతుందని వేరే చెప్పనక్కరలేదు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter