రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నెల్లూరోడు... నెల్లూరు నగ రాన్ని అన్నింటా ముందు నిలపాలను కుంటున్నాడు. నగరంలో ఏ పని చేయా లన్నా సమర్ధుడైన అధికారులుండాలి. వారిచేత పనిచేయించుకోవాలి. అవినీతి అధికారులను ఆరు నెలలకు కాదు, ఆరురోజులకే బదిలీ చేసినా ఇబ్బంది లేదు. కాని నిజాయితీగా, నిఖార్సుగా పనిచేసు కుంటున్న వారిని చీటికి మాటికి బదిలీ చేసుకుంటూ పోతేనే చేసే పనుల్లో గందర గోళం నెలకొంటుంది.
నెల్లూరు నగరం అసలే గందరగో ళంగా వుంది. ఎక్కడ చూసినా ఆక్రమ ణలు... ఇరుకు రోడ్లు... విపరీతమైన ట్రాఫిక్... పందులు, దోమలతో నరక యాతన. భూగర్భ డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ల పనులతో ధ్వంసమైన రోడ్లతో ఇక్కట్లు. అధ్వాన్నపు పారిశుద్ధ్యం... కొండలా పేరుకుపోయిన పన్ను బకా యిలు... ఒక ఆఫీసర్‌కు వీటి మీద అవ గాహన రావాలన్నా, వీటిని పరిష్కరించే మార్గాలు దొరకాలన్నా కొంత సమయం పడుతుంది. వచ్చిన ఆఫీసర్లు కరెక్ట్‌గా రూటు తెలుసుకుని పని మొదలుపెట్టీ పెట్టగానే బదిలీ చేసి పడేస్తున్నారు. కొత్తగా వచ్చిన కమిషనర్ మళ్ళీ వీటన్నింటిని కనుక్కుని పని మొదలుపెట్టేసరికి ఇంకొంత సమయం పడుతుంది.
అసలు మూడున్నరేళ్ల కాలంలో ఆరు మంది కమిషనర్లను మార్చడం ఏమిటి? ఎక్కడ లోపం వుంది? మున్సిపల్ మం త్రిగా నారాయణకే ఇది సవాల్. తన సొంత కార్పొరేషన్లో గట్టి కమిషనర్‌ను వేసుకుని నిలబెట్టుకోలేని మంత్రి ఇతర మున్సిపాల్టీలను ఎలా అభివృద్ధి చేయగల డన్న ప్రశ్న వస్తుంది. అసలు కమిషనర్లను ఎందుకు బదిలీ చేస్తున్నారో కూడా అర్ధం కావడం లేదు. కమిషనర్‌గా ఢిల్లీరావు బాగానే పనిచేస్తున్నాడు. క్లీన్ అండ్ గ్రీన్‌పై శ్రద్ధ పెట్టాడు. పార్కులు అభివృద్ధితో పాటు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనిచ్చి పని చేస్తు న్నాడు. మున్సిపల్ మొండి బకాయిలను ముక్కు పిండి వసూలు చేయిస్తున్నాడు. కార్పొరేషన్లో ఎంతో కాలం నుండి జరుగుతున్న అక్రమాలకు కళ్ళెం వేసాడు. నెల్లూరు నగరాన్ని అందంగా కనిపించేలా చేయాలనే ఉద్దేశ్యంతో పలు ప్రాంతాలలో గోడలపై ఆకర్షణీయమైన పెయింటింగ్‌లు వేయించారు. కమిషనర్‌గా ఆయన పనిలో వేగం పెంచే సమయంలో బదిలీ వేటు వేసారు. మున్సిపల్ మంత్రి ఇలాకాలోనే ఇలా ఉత్తి పుణ్యానికి కమిషనర్లను మార్చుకుంటూ పోతే మున్సిపల్ మంత్రికే చెడ్డపేరొస్తుంది. అధికార వర్గాలలో కూడా నెల్లూరు కార్పొరేషన్‌పై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది.