Friday, 05 January 2018 08:15

వరల్డ్‌ బిగ్గెస్ట్‌ బిజినెస్‌మెన్‌ సోమిరెడ్డి

Written by 
Rate this item
(0 votes)

galpikaభైరవుడో... భార్గవుడో... భాస్క రుడో... మరి రక్కసుడో... అత్తారింటికి దారేది సినిమాలోని పాట బ్యాక్‌ గ్రౌండ్‌లో వస్తుండగా అప్పుడే జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ ఎయిర్‌పోర్టులో స్పెషల్‌ ఫ్లైట్‌ ల్యాండ్‌ అయ్యింది. అందులో నుండి సూట్లు వేసుకున్న పదిమంది ముందుగా దిగారు. చివరగా సూటు, బూటు, కళ్ళకు నల్లద్దాలు పెట్టుకుని సింహపురి చాణక్య సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దిగాడు. విమానం వద్దకే పది నల్లటి రోల్స్‌రాయిస్‌ కార్లు వచ్చి ఆగాయి. సోమిరెడ్డి ముందు కారులో కూర్చోగా సిబ్బంది వెనుక కార్లు ఎక్కారు. బాషా సినిమాలో రజనీకాంత్‌ కాన్వాయ్‌ని తలపించే రీతిలో సోమిరెడ్డి కాన్వాయ్‌ పోసాగింది. ఆ కార్లన్నీ నేరుగా జర్మనీ ఛాన్స్‌లర్‌ కార్యాలయం వద్ద ఆగాయి. ఆ కార్యాలయం సెక్యూరిటీ వచ్చి డోర్‌ తీయగా సోమిరెడ్డి క్రిందకు దిగాడు. సిబ్బందితో కలిసి కార్యాలయం లోపలకు వెళ్లాడు. సోమిరెడ్డి వచ్చాడన్న విషయం తెలియగానే జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ బయటకొచ్చి పూలబొకే ఆయన చేతికిచ్చి తన ఛాంబర్‌కు ఆహ్వానించింది. అప్పటికే అక్కడ జర్మనీకి చెందిన ఉన్న తాధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు, జర్మనీ మంత్రులు వున్నారు. ఏంజెలా మెర్కెల్‌ సోమిరెడ్డితో... మీ లాంటి బిలియనీర్స్‌ మా దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం మా దేశ ప్రజలు చేసుకున్న అదృష్టం... మీరిక్కడ లక్ష మెగావాట్ల పవర్‌ ప్రాజెక్ట్‌లు పెడు తున్నారు. కనీసం పది లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ పుణ్యం వూరికే పోదు, ఆ ఏసు ప్రభువు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఇంతకీ మీరు గతంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిగా పనిచేసారట కదా... అని అడిగింది. అందుకు సోమి రెడ్డి... ఏదో బ్రతకలేని కాలంలో రాజ కీయాలలో వుండి మంత్రిగా పనిచేసి బ్రతుకు జట్కా బండిని నెట్టుకొచ్చాను. నేను మంత్రిగా వున్నప్పుడే నా రొట్టె విరిగి జామ్‌లో పడింది. విదేశాలలో నాకున్న వేలకోట్ల ఆస్తులు బయటపడ్డాయి. ఇం దుకు నా మిత్రుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. విదేశాలలో నా ఆస్తులు ఎక్కడెక్కడున్నాయో కనిపెట్టింది ఆయనే... ఆ ఆస్థులనే ఆయా దేశాలలో పెట్టుబడులుగా పెట్టి నా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాను. ఇప్పుడు నా ఆస్తులు ఎన్ని వేలకోట్లున్నాయో నాకే తెలియదు. కొన్ని లక్షల మంది నా కంపెనీలలో పనిచేస్తున్నారు. పది సొంత విమానాలు, పదిహేను సొంత హెలి కాఫ్టర్‌లు వున్నాయి. ఈమధ్యనే చైనాలో నాలుగు బుల్లెట్‌ రైళ్ళను కూడా కొన్నాను. ఇండియాలో బుల్లెట్‌ రైళ్ళు లేవు కాబట్టి రెండు గరీబ్‌రధ్‌ ఎక్స్‌ప్రెస్‌లను కొన్నాను. ఒకప్పుడు నేను ఆయన దగ్గర పనిచేసా నన్న కృతజ్ఞతతో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎక్కడికి పోవాలన్నా నా విమానం, హెలికాఫ్టర్‌లనే ఇస్తుంటాను. ఎలక్షన్‌ ఖర్చులు కూడా నేనే పెట్టుకుం టుంటాను. పాపం ఆయన నిప్పులాం టోడు కదా! రాజకీయాల్లో ఏమీ సంపా దించలేదు. తండ్రి ఇచ్చిన రెండెకరాలను కూడా రాజకీయాల్లోకి వచ్చి పోగొట్టు కున్నాడు. అందుకనే ఆ పార్టీకి చెందిన సగం మంది అభ్యర్థుల ఖర్చు కూడా నేనే ఇస్తుంటాను. ఎప్పుడూ పాతిక మంది ఎమ్మెల్యేలు, పది మంది ఎంపీలకు ఖర్చులు నేనే పెడుతుంటాను. ఈ ఏడాది వరల్డ్‌ బిగ్గెస్ట్‌ ఇండస్ట్రియలిస్ట్‌ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాను. వచ్చే ఏడాది కల్లా మొదటి స్థానంలో నిలవడమే నా లక్ష్యం అని చెప్పి ఎంఓయుల మీద సంత కాలు చేసి లేచాడు. అప్పుడు ఏంజెలా మెర్కెల్‌ ఆయనతో... రాక రాక మా దేశం వచ్చారు. మాతో లంచ్‌ చేసి వెళ్ళండి... మా జీవితంలో అదొక మరపు రాని జ్ఞాపకంగా వుంటుందని కోరింది. అందుకు సోమిరెడ్డి సారీ మేడమ్‌... లంచ్‌ డొనాల్డ్‌ట్రంప్‌తో, డిన్నర్‌ బిల్‌గేట్స్‌తో ఫిక్సయ్యింది. రేపు మార్నింగ్‌ మాస్కోలో పుతిన్‌ నా కోసం ఎదురుచూస్తుంటాడు... అపాయింట్‌మెంట్స్‌ మార్చలేను... ఈసారి ఎప్పుడన్నా మీకు అవకాశం ఇస్తానులే అని చెప్పి అక్కడ నుండి లేచాడు. సోమి రెడ్డి బయటకు రాగానే జర్మనీ ప్రభుత్వ లాంఛనాలతో సెక్యూరిటీ గన్‌ సెల్యూట్‌ చేసింది. సోమిరెడ్డి కారెక్కాడు. కాన్వాయ్‌ బయలుదేరి ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. సోమిరెడ్డి కారు దిగి విమానం ఎక్కుతుం డగా... చంద్రమోహనా... అనే కేక వినిపించింది. దూరంగా స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకా(66) అరుస్తూ పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. అతని పిలుపుకు సోమిరెడ్డి ఆగాడు. ఆయాస పడుతూ వివేకా వచ్చాడు. ఆయనను చూసి సోమిరెడ్డి... ఏం వివేకన్నా, ఇక్కడు న్నావ్‌ అని అడిగాడు. టూర్‌కు వచ్చాను... నేను బాత్‌రూంకు పోయొచ్చేలోపు విమానం ఎగిరిపోయింది. నన్ను నీ విమానం ఎక్కించుకోవా అని అడిగాడు. దానికి సోమిరెడ్డి... నేను వాషింగ్టన్‌ వెళుతున్నా... ట్రంప్‌తో బిజెనెస్‌ మీటింగ్‌ వుంది... ఇండియాకు వెళ్ళడం లేద న్నాడు. అందుకు వివేకా... ముందు నీ ఫ్లైట్‌లో ఎక్కుతాను, దారిలో ఏదన్నా ఇండియాకొచ్చే విమానం కనిపిస్తే ఆపి దానిని ఎక్కుతాలే అని అన్నాడు. ఇవే మన్నా ఎరబ్రస్సులనుకున్నావా... రోడ్ల మీద ఆపి ఎక్కడానికి... ఎయిర్‌బస్‌లు... ఏదైతే అదవుతుంది... ముందు నా ఫ్లైట్‌ ఎక్కు అని చెప్పాడు. ఇద్దరూ ఫ్లైట్‌ ఎక్కారు. విమానం గాల్లోకి లేచి వాషింగ్టన్‌ వైపు పోసాగింది. ఈలోపు సోమిరెడ్డి, వివేకా పిచ్చాపాటి మాట్లాడుతుండగా, దూరంగా ఎయిర్‌ ఇండియా విమానం కనిపించింది వివేకాకు. వెంటనే అతను డోర్‌ వద్దకు పరుగెత్తి... అదిగో ఇండియాకు పోయే విమానం దానిని ఆపండి... అంటూ కేకలు వేస్తూ డోర్‌ లాగాడు. ఆ దెబ్బకు గాలి దూరి విమానం ఊగసాగింది. ఈ హఠాత్‌ పరిణామంతో షాక్‌ తిన్న సోమి రెడ్డి... కెవ్‌ మంటూ నిముషం పాటు అరిచాడు. ఆ అరుపుకు ఆయన భార్య జ్యోతి, కొడుకు రాజగోపాలరెడ్డి ఉలిక్కి పడి లేచారు. ఆందోళనతో సోమిరెడ్డి ముఖం మీద నీళ్ళు చల్లారు. ఆ నీళ్ళ దెబ్బకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అప్పటిదాకా జరిగిందంతా కల అని తెలుసుకోవడానికి ఆయనకు అరగంట పట్టింది. తేరుకున్నాక తనకొచ్చిన కల గురించి తన భార్యకు చెప్పాడు. అది విన్న ఆమె... మీరు ప్రపంచ కోటీశ్వరులు కావడం మాటేమోగాని ముందు టీకి పాలు లేవు, పాలప్యాకెట్లకు డబ్బులివ్వండి అని అడిగింది. అప్పుడే పి.ఏ హజరత్‌ వచ్చి... సార్‌, మొన్న ప్రెస్‌వాళ్ళ భోజ నాలకుగాను క్యాటరింగ్‌ వాళ్ళు బిల్లు ఇచ్చారు అని బిల్లు చేతిలోపెట్టాడు. అది చూసిన సోమిరెడ్డి... మన చేతుల్లో డబ్బులు లేకపోవడానికి ఆ కాకాణి గోవర్ధన్‌రెడ్డే కారణం. విదేశాలలో నాకున్న ఆస్తుల డాక్యుమెంట్లు ఒరిజినల్స్‌ ఎక్కడో దాచిపెట్టి నకిలీవి మాత్రమే ప్రెస్‌కు చూపిస్తున్నాడు. అతని మీద ఇప్పుడే 5కోట్లకు పరువు నష్టం దావా వేస్తా... ఈ దెబ్బతో నా విదేశీ ఆస్తుల ఒరిజినల్‌ డాక్యుమెంట్లన్నా రావాలి... లేకుంటే కాకాణి నుండి 5కోట్ల డబ్బు లన్నా రావాలి అంటూ లాయర్‌ వద్దకు వెళ్లడానికి లేచాడు.

Read 21 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • అజీజ్‌ బ్రదర్స్‌పై కేసు
  నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. ఆయన పైన ఆయన తమ్ముడు, కార్పొరేటర్‌ జలీల్‌ మీద చెన్నైలో చీటింగ్‌ కేసు నమోదైంది. మేయర్‌ అజీజ్‌కు చెందిన స్టార్‌ ఆగ్రో కంపెనీలో వాటా కోసం తాము ఇచ్చిన 42కోట్ల…
 • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
  మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter