11 January 2018 Written by 

సమన్వయ లోపం... వైకాపాకు శాపం!

jagan2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు గెలిచాడు... జగన్‌ ఓడిపోయాడు. ఎక్కడుంది వ్యత్యాసం? ఎక్కడ వచ్చింది ఈ లోపం?

ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి చాలా కారణాలున్నాయి. మోడీ ఇమేజ్‌, పవన్‌కళ్యాణ్‌ మద్దతు, ఋణమాఫీ వాగ్ధానం, కాంగ్రెస్‌ నేతలు రావడం, డబ్బు పంపిణీ, జగన్‌పైన మతపరమైన ముద్ర... తెలుగుదేశం గెలుపులో ఇవన్నీ ఒకెత్తయితే, పార్టీ తరపున ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ ఇంకో ఎత్తు. 2014 ఎన్నికల తర్వాత తనలోని చాలా లోపాలను జగన్‌ సరిదిద్దుకుంటూ వస్తున్నాడు. ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రజలను ఆకట్టుకునే దిశగా హామీలు గుప్పిస్తున్నాడు. తనపై వున్న మతముద్రను చెరిపేసుకోవడానికి, దాని మూలంగా దూరమైన కొన్ని వర్గాలను దగ్గర చేసుకోవడానికి హిందూ సంస్కృతి, సంప్రదాయాలను ఆచరిస్తూ గౌరవిస్తున్నాడు. గతంలో తన తండ్రి వైయస్‌నకు వెన్నంటి నడిచిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులను సంప్రదించి పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనలో వున్నాడు.

రేపు ఎలక్షన్‌ను ఎదుర్కోవడానికి జగన్‌ అన్నీ సిద్ధం చేసుకున్నాడు. అయితే ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ సిద్ధం కావాల్సి వుంది. 2014 ఎన్నికల్లో వైకాపాకు పెద్ద లోటు ఇదే! తెలుగుదేశం తరఫున చంద్రబాబు ఒక్కడే ఎలక్షన్‌ నడిపించలేదు. ఆయన తరఫున పి.నారాయణ, సుజనాచౌదరి, సీఎం రమేష్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు... ఇలా ఎందరో సీనియర్‌లు జిల్లాలవారీగా ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు నిర్వహిస్తూ ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో పార్టీ బలహీనంగా ఉందో తెలుసుకుంటూ, ప్రతిరోజూ, ప్రతి గంట అభ్యర్థులతో మాట్లాడుతూ వాళ్ళ అవసరాలు తెలుసుకుంటూ వారికి కావాల్సిందానిని వెంటనే సమకూరుస్తూ ఎలక్షన్‌ నడిపించారు. కాని, ఇక్కడ వైకాపాలో చూస్తే పోటీ చేసిన అభ్యర్థులను పట్టించుకున్న నాథుడు లేడు. అభ్యర్థులతో మాట్లాడితే జగనే మాట్లాడాలి. పులివెందుల అసెంబ్లీ నుండి ఆయనా పోటీ చేసుండే... ఇక రాష్ట్రమంతటా ప్రచారం చేయాల్సివుండే... ఇక అభ్యర్థుల మంచి చెడ్డలు చూసుకునే తీరిక ఆయనకెక్కడిది. పార్టీలో వున్నోళ్లలో సీనియర్‌లు, జగన్‌కు ముఖ్యమనుకున్న వై.వి.సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి లాంటోళ్ళు ఎలక్షన్‌లలో పోటీకి దిగారు. దీంతో పార్టీ ఆఫీసులో అభ్యర్థులకు సమాధానం చెప్పే వాళ్ళు గాని, వాళ్ళ సమస్యలు వినేవాళ్ళు గాని లేకుండాపోయారు. రేపు ఎన్నికల్లో ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి. సీనియర్‌లను పోటీలో దించకుండా ఎలక్షన్‌ నిర్వహించే బాధ్యతను వాళ్ళకు అప్పగించాలి. ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం కీలకం కానుంది. ప్రతిచోటా గట్టిపోటీ వుంటుంది. కాబట్టి అందరు అభ్యర్థులతో సమన్వయం చేసుకోగల ఎలక్షన్‌ టీమ్‌ను ఏర్పాటు చేసుకోవడంపై జగన్‌ దృష్టి సారించాల్సివుంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter