11 January 2018 Written by 

సినిమానూ వదలని సెగ

pawanనేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని స్థాపించిన వ్యక్తి. పార్టీని పెట్టి కూడా ఎన్నికల్లో పోటీ చేయని నాయకుడు పవన్‌ కళ్యాణ్‌. ఆయన ఎందుకు పార్టీ పెట్టాడన్నది ఆయనకు తెలియకపోయినా, ఈ నాలుగేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మాత్రం తెలిసి పోయింది. కేవలం చంద్రబాబు కోసమే ఆయన రాజకీయాలలోకి వచ్చాడు. రాజ కీయ పార్టీ పెట్టాడు. తనకొక సొంత లక్ష్యం అన్నది లేకుండా, కేవలం చంద్రబాబును కాపాడడం కోసం ఆయన అప్పుడప్పుడూ ప్రజల మధ్యకు రావడం, ప్రభుత్వాన్ని వదిలేసి ప్రతిపక్షంపై విమర్శలు చేయడం వంటివి ఆయన మీద జుగుప్సా కలిగేలా చేసాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ వాళ్ళు మొన్నటివరకు పవన్‌ను శత్రువుగా భావించ లేదు. ఆయనపై విమర్శలకు పాల్పడలేదు. కాని పవనే అనవసరంగా వైసిపి కేడర్‌ను రెచ్చగొట్టాడు. దీంతో పవన్‌ - వైసిపిల మధ్య రాజకీయ వైరం సినిమాకు కూడా పాకింది. పవర్‌స్టార్‌ నటించిన 'అజ్ఞాత వాసి' సినిమా ఈనెల 10న విడుదల కావడం తెలిసిందే! పవన్‌ కోసం కృత జ్ఞతగా చంద్రబాబు ప్రభుత్వం ఈ సిని మాను రోజుకు ఏడు షోలు ప్రదర్శించ డానికి అనుమతినిచ్చింది. పవన్‌కు చంద్ర బాబు ఈ విధంగా సహకరించాడు. అదే సమయంలో వైసిపి శ్రేణులు, వై.యస్‌. అభిమానులు అధికారికంగా కాకపోయినా అనధికారికంగా ఈ సినిమాను చూడకూడదని ఎవరిపాటికి వాళ్ళు బహిష్కరించారు. ఈ సినిమాను చూడకూడదనే సంకేతాలు ఒకరి నుండి ఒకరికి బాగానే పాకాయి. చాలామంది పవన్‌ వైఖరికి నిరసనగా ఈ సినిమాకు స్వీయనిషేధం విధించుకున్నారు. వై.యస్‌. అభిమానులైతే ఈ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ కావాలని, హిట్‌ అయితే పవన్‌కు కొమ్ములొస్తాయని భావించారు. ఆశించి నట్లే ఈ సినిమా అట్టర్‌ఫ్లాప్‌ కావడం వైకాపా అభిమానులకు ఎనలేని ఆనందా నిచ్చింది. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని పెట్టాడు. ప్రభుత్వాన్ని ఏలాడు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏరోజూ ప్రజలు గాని, ఆయన రాజకీయ ప్రత్యర్థులు గాని ఆయన కుటుంబసభ్యుల సినిమాలను చూడకుండా వుండాలనుకోలేదు. రాజకీయాలను, కళ లను వేరుగా చూసారు. ఎన్టీఆర్‌కు ఒక క్లారిటీ వుంది. ఆయన లక్ష్యం క్లియర్‌గా వుంది. ఇక్కడ పవన్‌కు అది లేదు. ఎవరి కోసమో పని చేస్తున్నట్లుగా ఆయన వ్యవ హారశైలి ఉంటుండడం వల్లే రాజకీయాల లోనే కాదు, సినిమాలలో కూడా అటూ ఇటూ కాకుండా పోతున్నాడు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter