12 January 2018 Written by 

నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?

nelloreమొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తామన్నారు. బకింగ్‌హోమ్‌ కెనాల్‌ను పునరుద్ధరించి జలరవాణాను అభివృద్ధి పరుస్తామన్నారు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా జిల్లాలో ఇంకో మూడు ఎయిర్‌పోర్టులను కూడా తీసుకొస్తామన్నారు.

చంద్రబాబు జిల్లాకు ఇంకా వీటిని తీసుకొచ్చే పనిలోనే వున్నాడు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక 2014లో ఇవే డైలాగ్‌లు, 2015లోనూ ఇవే డైలాగ్‌లు... ఇప్పుడూ అవే వాగ్ధానాలు... ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావ స్తోంది. ఇక ఈ సంవత్సరం ఎన్నికల వాతా వరణం వుంటుంది. పెద్దగా పనులేమీ జరగవు. ఈ పనులన్నీ చేయడానికి చంద్ర బాబుకు ఈ నాలుగేళ్ళు సరిపోలేదా?

ఇప్పటికీ నెల్లూరుజిల్లా ప్రగతిపై వై.యస్‌. మార్క్‌ వుందే తప్ప తన బ్రాండ్‌ పడే విధంగా చంద్రబాబు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ జిల్లాను పారిశ్రా మికంగా ముందుకు నడిపించడానికి ఒక కృష్ణపట్నం పోర్టు అయితేనేమీ, పవర్‌ ప్రాజెక్ట్‌లైతేనేమీ, శ్రీసిటీ, మాంబట్టు, మేనకూరు, చింతవరం సెజ్‌లైతేనేమీ... ఇవన్నీ కూడా వై.యస్‌. కృషి ఫలితమే! ఆయన ముఖ్యమంత్రిగా పని చేసింది గట్టిగా అయిదేళ్ళు. తన పాలనలో కేవలం రెండు మూడేళ్ళ కాలంలోనే నెల్లూరు జిల్లాలో ఇంతటి పారిశ్రామిక ప్రగతిని చూపించాడాయన!

మరి చంద్రబాబు సీఎంగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టి నాలు గేళ్ళు కావస్తుంది. జిల్లాకు కొత్తగా వచ్చిన పరిశ్రమ ఒక్కటీ లేదు. చంద్రబాబు ఇది సాధించి తెచ్చాడని చెప్పడానికి ఏదీ లేదు. కనీసం దగదర్తి ఎయిర్‌పోర్టుకు కూడా ఇంతవరకు శంకుస్థాపన జరగలేదు. కృష్ణ పట్నంలో గాని మిగిలిన సెజ్‌లలో గాని కొత్తగా ఒక్క పరిశ్రమా రాలేదు. విభజన చట్టంలో చెప్పిన దుగరాజపట్నం పోర్టుకు కూడా దిక్కులేదు. నెల్లూరుజిల్లాలో పారి శ్రామికంగా వై.యస్‌. ఉన్నప్పుడు ఏదైతే జరిగిందో... ఇప్పటికీ అదే వుంది. ఈ నాలుగేళ్లుగా చంద్రబాబు జిల్లా ప్రజలకు మాటలు చెప్పడం తప్పించి చేతుల ద్వారా చూపించిందేమీ లేదు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నారాయణను వదలని అనిల్‌
    మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
  • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
    వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • వైసిపి వైపు నేతల చూపు
    నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter