12 January 2018 Written by 

12-01-2018 రాశిఫలాలు

rasi 05

1Ariesమేషం

ఉద్యోగులకు పనిభారం, అధికారుల ఒత్తిడి ఉంటుంది. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. సభలు సమావేశాలలో పాల్గొంటారు. సత్కారాలు పొందే అవకాశమున్నది. విద్యా ప్రగతి బాగుంటుంది. చిన్న చిన్న కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. ఆరోగ్యం నెమ్మదిగా కుదుట పడుతుంది. వ్యాపార విస్తరణ ఆలోచనలు తాత్కాలికంగా వదలండి.

 

2Taurusవృషభం

దూరప్రయాణాల శ్రమ, సభలు సమావేశాలలో ప్రముఖంగా వ్యవహరించడం ఉంటుంది. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. ఆరోగ్యం సరిగా ఉండదు. ఆర్ధికంగా కుదుటపడతారు. విద్యాప్రగతి కలదు. ప్రభుత్వ అనుమ తులు పొందుతారు. కొత్త కాంట్రాక్టులు లభించగలవు. పనులు హడావిడిగా సాగుతాయి. కోర్టు కేసులు వాయిదా పడగలవు. అధికారులకు స్థాన చలనం ఉంటుంది.

 

3Geminiమిధునం

దూర ప్రయాణాలు నిర్ణయం కాగలవు. సోదర వర్గంతో చిన్న సమస్యలుండవచ్చును. ఉద్యోగావకాశాలు లభించగలవు. కళాక్రీడా సాంకేతిక రంగాల వారికి గుర్తింపు గౌరవాలుంటాయి. అనుకున్న పనులకు ఇతరుల సహకారం లభిస్తుంది. ఆర్ధిక స్థితి బాగుం టుంది. వ్యాపార విస్తరణ, కొత్త ఆదాయ అవకాశాలు దొరుకుతాయి. శుభకార్యాలు నిర్ణయం కాగలవు.

 

4Cancerకర్కాటకం

ఉద్యోగులకు విధి నిర్వహణ బాగుంటుంది. కోర్టు కేసులు వాయిదా పడతాయి. బిడ్డల విద్య, ఉద్యోగ విష యాలపై, పెండ్లి విషయాలపై ఆందోళన ఉంటుంది. బంధువులతోను, కుటుంబసభ్యులతోను వ్యవహారాలలో రాజీపడతారు. వృత్తి జీవనం కలవారికి ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. చేయదలచిన ఆలోచనలు కార్యరూపంలోనికి వస్తాయి.

 

5Leoసింహం

ఉద్యోగులు విధి నిర్వహణలో పబ్లిక్‌తోను, అధికారు లతోను జాగ్రత్తగా మెలగండి. విద్యార్థులకు శ్రమ, వత్తిడి అధికంగా ఉంటుంది. అనుకున్న పనులు సరిగా జరగక చికాకు, టెన్షన్‌ ఉంటుంది. స్థిరాస్తుల వ్యవహారాలు, కోర్టు కేసులు వాయిదా పడతాయి. ఆర్ధిక విషయాలలో జాగ్ర త్తగా వ్యవహరించండి. నిర్ణయాలు సొంతంగా తీసు కొంటే మంచిది. శుభకార్యాలు నిర్ణయం కాగలవు.

 

6Virgoకన్య

ఆరోగ్యం మీకు బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు, రావలసిన బాకీలు వాయిదా పడగలవు. శుభకార్యాల ప్రయత్నాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామికి స్వల్ప అనారోగ్య బాధలుండవచ్చును. విద్యా ప్రగతి బాగుం టుంది. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత బాగుం టుంది. ఆడిటర్లు, పరిశ్రమ యజమానులకు, న్యాయ వాదులకు, చిన్న పరిశ్రమలకు ఆదాయం బాగుంటుంది.

 

7Libraతుల

సభలు సమావేశాలలో పాల్గొంటారు. శుభకార్య నిర్ణయం కాగలవు. ఉద్యోగార్ధులు కొద్దికాలం వేచి ఉం డాలి. బంధుమిత్రులను, ప్రముఖులను కలుసుకొంటారు. ఆస్తి, ఋణ వ్యవహారాలు రాజీకి వస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు అదనంగా ఉంటాయి. విద్యార్థులు బాగా శ్రమించాలి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉం టాయి. ఆదాయానికి ధీటుగా ఖర్చులుంటాయి.

 

8Scorpioవృశ్చికం

ఉద్యోగార్ధులకు అనుకూలత బాగుంటుంది. విద్యా ప్రగతి, కుటుంబసౌఖ్యం బాగుంటుంది. గృహోపకర ణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకొంటారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండి ఆదాయం పెరుగు తుంది. పెట్టుబడులపై లాభాలుంటాయి. ఆరోగ్యం ఫరవా లేదు. కొత్త పరిచయాలు జరిగి ప్రయోజనం పొందు తారు. కోర్టు కేసులు కొంత సానుకూలం కాగలవు.

 

9Sagittariusధనుస్సు

అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. సభలు సమావేశాలలో పాల్గొనడం, దూర ప్రయాణాలుంటాయి. స్థిరాస్తుల వివాద పరిష్కారాలు జరుగగలవు. విలువైన పత్రాలు, వస్తువులు జాగ్రత్త. ఉద్యోగులు వత్తిళ్ళకు లొంగి ఇబ్బంది పడకండి. ఆరోగ్యం కూడా సరిగా ఉండదు. కుటుంబంలో కొద్దిపాటి భేదాభిప్రాయాలుండి సర్దుబాటు కాగలవు. ఆదాయం పెరుగుతుంది.

 

10Capricornమకరం

ఉద్యోగులకు అధికారవర్గంతో సత్సంబంధాలుం టాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసికొనవద్దు. దూర ప్రయాణాలు అవసరం ఉంటుంది. సభలు సన్మా నాలలో పాల్గొంటారు. విద్యా ప్రగతి బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. అవసరాలకు ఇతరులను బట్టి సర్దుకొని పోతూ పనులు జరుపకొనవలసి ఉంటుంది. చిరు వ్యాపా రులు, వృత్తి జీవనం కలవారికి ఆర్ధికస్థితి బాగుంటుంది.

 

11Aquariusకుంభం

అనుకున్న పనులు సరిగా జరగక టెన్షన్‌ పడుతుం టారు. మాటల తీవ్రత, తొందరపాటు ఎక్కువగా ఉం టుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. కొత్త వ్యాపారాలకు, పెట్టుబడులకు అవకాశాలు ఉండగలవు. కుటుంబంలో సమస్యలుంటే చర్చించి పరిష్కరించ గలరు. ఆర్ధిక ఇబ్బంది లేకున్నను సంతృప్తి ఉండదు.

 

12Piscesమీనం

ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఒత్తిడులుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలందు ఫలితం లభించగలదు. దూర ప్రయాణాలుండుట, సత్కారాలు పొందడం, సభలు సమావేశాలలో పాల్గొనడం, విద్యార్థులకు విద్యా ప్రగతి బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. అనుకున్న పనులు సక్రమంగా జరుపకొనగలిగిన సమర్ధత ఉంటుంది. ఆర్ధిక స్థితి బాగుంటుంది. రావలసిన బాకీలు కొంత లభిస్తాయి.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…

Newsletter