19 January 2018 Written by 

సీట్ల కోసం పాట్లు

modi cmదేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడిగితే విశాల దృక్పథం వున్న ఏ మనిషైనా ఏం కోరుకుంటాడు. ఈ సమాజం బాగుండాలని, సుఖసంతోషాలతో జీవించా లని కోరుకుంటాడు. సమాజం బాగుంటే అందులో ఆ వరం కోరుకున్న వ్యక్తి కూడా సంతోషంగా వుంటాడు కాబట్టి! అదే స్వార్ధపరుడైతే ఏం కోరుకుంటాడు. ఆ పూటకు మటన్‌ బిర్యానీనో, మద్యాన్నో లేక ఇంట్లోకి ఐశ్వర్యాన్నో కోరుకుంటాడు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చాలాకాలం తర్వాత ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ దొరి కింది. అమరావతి రాజధాని శంకుస్థాప నకు మోడీ వచ్చి పోవడం తెలిసిందే! అప్పుడు ఆయన ఇక్కడేదో మనకు దొరక దన్నట్లు మట్టి, చెంబుడు నీళ్ళు తెచ్చి చంద్రబాబు ముఖాన కొట్టి వెళ్ళాడు. ఏపికి ఎటువంటి ప్రయోజనాలను ఆయన చేకూర్చలేదు. ఆ తర్వాత ప్రధానిని కలవ డానికి చంద్రబాబు ఎన్నోసార్లు ప్రయత్నిం చాడు. కాని ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. ఈలోపు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రెండుసార్లు ప్రధానిని కలిసారు. ఒక్క విజయసాయిరెడ్డే కాదు, ఏ రాష్ట్ర సీఎంకైనా, చిన్నా చితకా నాయకులకైనా పీఎం అపాయింట్‌మెంట్‌ దొరికింది. కాని చంద్రబాబుకు మోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడమే చిన్నతనంగా భావించారు. దీంతో చంద్ర బాబు అంటే మోడీకి పడదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళసాగాయి.

ఈ దశలో తెలుగుదేశం ఎంపీలు జోక్యం చేసుకుని పిఎంఓపై ఒత్తిడి తేవ డంతో ఇటీవల ఎట్టకేలకు ప్రధాని మోడీని చంద్రబాబు కలవగలిగాడు.

దొరక్కదొరక్క ప్రధాని అపాయింట్‌ మెంట్‌ దొరికింది. దీనిని రాష్ట్ర ప్రయోజ నాలకు అనుగుణంగా మలచుకోవాలి. విభజన చట్టంలో ప్రత్యేకహోదా వుంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ప్రత్యేకహోదాపై చేతులెత్తేసి ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టారు. ఆ ప్యాకేజీ అన్నా సరిగా ఇస్తున్నారా అంటే అదీ లేదు. కేంద్రం బాధ్యతగా వున్న పోలవరం డ్యాంకు ఎన్నో అవాంతరా లొస్తున్నాయి. రెవెన్యూ లోటును భర్తీ చేస్తామన్నారు. అదీ చేయడం లేదు. వచ్చే నెలలో బడ్జెట్‌ వుంటుంది. విశాఖ రైల్వే జోన్‌పై ఇంతవరకు ఎలాంటి ప్రక్రియ మొదలు కాలేదు. పారిశ్రామిక అభివృద్ధి పరంగా ఏపికి కేంద్రం నుండి ఎలాంటి చేయూతలేదు. విశాఖ-చెన్నై, బెంగుళూరు వయా కృష్ణపట్నంపోర్టు చెన్నై కారిడార్‌లు కేంద్రం బాధ్యత. వీటిపై ఇంతవరకు ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దుగరాజ పట్నం పోర్టు హామీ అలాగే వుంది. ఇలా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఎన్నో అంశాలను కేంద్రం నుండి సాధించు కోవాల్సిన అవసరముంది. చంద్రబాబు వాటన్నింటిని పక్కనపెట్టి రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను పెంచమనే ప్రధానిని ప్రధానంగా కోరినట్లు తెలుస్తోంది. అంటే ఇక్కడ చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు.

రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరిగినంత మాత్రాన అనవసరపు అదనపు ఖర్చు పెర గడం తప్పితే ప్రజలకు దీని మూలంగా ఎలాంటి ఉపయోగం లేదు. అసెంబ్లీ సీట్లు పెంచాలని ప్రజలు కోరుకోవడం లేదు. కేవలం చంద్రబాబు మాత్రమే కోరుకుంటు న్నాడు. ప్రస్తుతం 175 సీట్లుండగా వాటిని 225కు పెంచాలంటున్నారు. సీట్లు పెంచితే వైసిపి నుండి తీసుకున్న 23మంది ఎమ్మెల్యేలకు సీట్లు అడ్జస్ట్‌ చేయడమే కాకుండా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇంకా కొంత మంది వైసిపి నాయకులను పార్టీలోకి లాగాలనేది ఆయన ప్లాన్‌. బలమైన నాయకులందరినీ టీడీపీలో చేర్చుకుని సీట్లు ఇచ్చేయవచ్చు. అప్పుడు సీట్లు పెరిగితే వైకాపాకు చాలా చోట్ల గట్టి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అభ్యర్థుల బలం మీద ఎక్కువ సీట్లు గెలవ వచ్చని చంద్రబాబు నమ్మకం.

సీట్లు పెరిగితే ఇక తనకు తిరుగుండ దని చంద్రబాబు భావిస్తున్నారు. అందు కోసమే బలంగా ప్రయత్నిస్తున్నాడు. మరి ప్రధాని మోడీ ఎంతవరకు ఆయనకు సహకరిస్తాడన్నది చూడాలి!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter