19 January 2018 Written by 

వికటించనున్న కులం కార్డు

kulamగత ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి పలు కారణాలున్నాయి. ప్రతి కారణం కూడా చంద్రబాబుకు ఎన్నో కొన్ని ఓట్లు తెచ్చిపెట్టింది. అలాంటి కారణాలలో ఒకటే కులం కార్డు.

మనకు తెలిసిన చరిత్రలో ఎప్పుడు కూడా ఏపిలో కుల రాజకీయాలు ఉండేవి కావు. కులం, మతం కన్నా కూడా సిద్ధాంతాల పట్ల నమ్మకం, పార్టీ అధినాయకుల పట్ల అభిమానంతోనే రాజకీయాలు నడిచేవి. ఇన్నేళ్ళ చరిత్రలో కులపరంగా ప్రజలు చీలిన సందర్భాలు లేవు. నాయకుడిని లేదా ప్రభుత్వాన్ని అభిమానించినా వ్యతిరేకిం చినా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫలితాల సరళి ఒకే విధంగా వుండేది. ఒక జిల్లాలో ఒక పార్టీకి, ఇంకో జిల్లాలో ఇంకో పార్టీకి అధికంగా సీట్లు రావడంమంటూ ఉండేది కాదు. 2009 ఎలక్షన్‌ల దాకా కూడా రాష్ట్రంలో ఇదే వాతావరణం కొనసాగింది.

రాష్ట్ర విభజన జరిగిన వేళా విశేషమో లేక వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి సొంతంగా పార్టీ పెట్టడం వల్లనో రాష్ట్రంలో కుల రాజకీయాలకు బీజం పడింది. తెలుగుదేశంకు ఒక కులం, వైకాపాకు ఒక కులం ముద్ర వేశారు. అంతకుముందు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి కూడా కులం ముద్ర వుండడం చూసాం.

అయితే 2014 ఎన్నికల్లో ఈ కులం రాజకీయాలను అందరికంటే బాగా వాడుకుంది మాత్రం చంద్రబాబే! ఈయన రాజకీయ చాణక్యం, తెలివి తేటల ముందు జగన్‌ చాలలేదు. పవన్‌ కళ్యాణ్‌ను రంగంలోకి దించడం ద్వారానేమీ, కాపు రిజర్వేషన్‌ల హామీతోనైతేనేమీ కాపుల ఓట్లను రాబట్టాడు. వై.యస్‌ కుటుంబంపై విషప్రచారం చేయించి క్షత్రియులను వారికి వ్యతిరేకం చేసాడు. వై.యస్‌. కుటుంబంపై ఎల్లో మీడియా ద్వారా మత ముద్ర వేయించి వైశ్యులు, బ్రాహ్మణులను పూర్తిగా తన వైపుకు లాక్కున్నాడు. ఎస్సీ వర్గీకరణ హామీ, రజకులను ఎస్టీల్లో చేర్చడం, మత్స్యకారులను ఎస్సీలలో చేర్చడం వంటి హామీలతో వారి ఓట్లను రాబట్టారు. ఆ ఎన్నికల వరకు చంద్రబాబుకు కులం కార్డు బాగానే ఉపయోగపడింది.

ఇదే కులం కార్డు రేపటి ఎన్నికల్లో ఆయనకు రివర్స్‌ అవుతుందా? కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయించి కేంద్రప్రభుత్వానికి పంపారు బాగానే వుంది... కేంద్రం దీనిని ఆమోదించే పరిస్థితి లేదు. ఎందుకంటే గుజరాత్‌ ఎన్నికలను పెట్టుకుని రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా మోడీ పటేళ్ళ రిజర్వేషన్‌కు అంగీకరించలేదు. కాబట్టి కాపు రిజర్వేషన్‌ల తీర్మానాన్ని కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. కేంద్రం అంగీకరించకపోతే తప్పును బీజేపీ మీదకు తోసేయొచ్చని చంద్రబాబు భావిస్తుండొచ్చు. కాపులు అమాయకులైతే ఆ విధంగా జరగొచ్చు. కాని ఎన్నికలలోపు వాళ్ళకు అధికారికంగా రిజర్వేషన్‌లు రాకపోతే ప్రభుత్వంపై తిరగబడే అవకాశముంది.

కాపులకు రిజర్వేషన్‌లు వస్తాయో లేదో గాని ఈ అంశం మూలంగా ఇప్పటివరకు తెలుగుదేశంకు గట్టి ఓటు బ్యాంకుగా వున్న బీసీలలో మాత్రం చీలిక వచ్చింది. కాపు రిజర్వేషన్‌లను వ్యతిరేకిస్తూ ఇటీవల వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించడం చూసాం. ప్రతి ఎన్నికల్లోనూ తెలుగుదేశంకు నికరంగా పడే ప్రతి వంద బి.సి ఓట్లలో 10ఓట్లు చీలినా, అది పార్టీకి ఎంతో నష్టం చేయగలదు. కాపు రిజర్వేషన్‌ల మూలంగా కొద్ది శాతంలో అయినా తెలుగుదేశం బీసీల ఓట్లను కోల్పోతుందన్నది వాస్తవం.

ఇక మత్స్యకారులలోనూ ఇప్పటివరకు తెలుగుదేశంకు గట్టి పట్టుంది. తమను ఎస్సీలలో చేర్చాలంటూ వాళ్ళు ఆందోళన బాట పట్టారు. అది ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. ఇక రజకులను ఎస్టీల్లో చేర్చడం కూడా సాధ్యం కాని పనే!

గత ఎన్నికల్లో టీడీపీకి సంపూర్ణ మద్దతు పలికిన వైశ్యులు, బ్రాహ్మణులు కూడా ఈసారి ఆ పార్టీ వైపు పూర్తిగా నిలిచే అవకాశాలు లేవు. వ్యాపారులపై కొనసాగుతున్న వేధింపులతో వైశ్యులు కొంత దూరమయ్యారు. రాష్ట్రంలో పలు చోట్ల దేవాలయాలు కూల్చడం, హిందూ వ్యతిరేక ధోరణుల వంటివాటి మూలంగా ప్రభుత్వంపై బ్రాహ్మణుల లోనూ అసంతృప్తి వుంది. ఈ కులాలన్నింటిలో వచ్చిన అసమ్మతి ఓట్ల రూపంలోకి మళ్ళితే చంద్రబాబుకు తీరని నష్టమే!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter