19 January 2018 Written by 

ఆదుకునే మిత్రుడు

netanyahuప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ రంగ నైపుణ్యం ఉన్న ఇజ్రాయెల్‌తో భారత్‌ సంబంధాలు మునుపటి కన్నా మరింతగా బలోపేతం అవుతుండడం ఎంతైనా సంతోషకరం. ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు భారత్‌ పర్యటన ఇరుదేశాల స్నేహాన్ని సుదృఢం చేస్తూ ముందుకు సాగుతుండడం ఎంతో ఆనందదాయకం. మన ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్‌ను సైతం పక్కనపెట్టి నేరుగా స్వయంగా విమానాశ్రయానికి వెళ్ళి నెతన్యాహును ఆలింగనం చేసుకుని స్వాగతం పలికి ఇజ్రాయిల్‌ పట్ల భారత్‌కు ఉన్న మైత్రీభావాన్ని, ప్రేమాభిమానాలను చాటుకున్నారు. అయితే, ఈ అంశం పట్ల కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించినా ప్రధాని మోడీ పట్టించుకోలేదు. అయినా, ఒక మంచి మిత్రుడు, అందులోనూ కష్టకాలంలో ఆదుకునే మిత్రుడు మనదేశానికి వచ్చినప్పుడు ఎల్లలెరుగని స్నేహాభిమానం ప్రకటించుకోవడంలో తప్పేమిటి?.. ఇజ్రాయెల్‌తో గత కొంతకాలంగా భారత్‌కు మంచి అనుబంధం

ఉంది. అదింకా సుదృఢమవుతోంది. ఇప్పుడు రక్షణ రంగానికి సంబంధించి భారత్‌తో పలు కీలకమైన ఒప్పందాలు చేసుకోవడం, తద్వారా రక్షణ విష యంలో భారత్‌ మరింత పటిష్టమై ఏ దేశానికి తీసిపోని విధంగా ధీటుగా నిలిచేందుకు ఇజ్రాయెల్‌ దేశాధినేత నెతన్యాహు సహకరిస్తుండడం భారత్‌కు ఎంతైనా

శుభపరిణామం. అంతేకాదు, గతంలో భారత్‌ కష్ట కాలంలో ఉన్నప్పుడు కూడా ఇజ్రాయెల్‌ ఎంతగానో సహకరించింది.

1999లో కార్గిల్‌ యుద్ధసమయంలో భారత్‌కు ఇజ్రాయెల్‌ అడగకుండానే తన సహాయ సహకారాలు అందించడమంటే చిన్నవిషయమేమీ కాదు. పాక్‌ హిమాలయ పర్వతాల్లో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో భారత్‌పైకి దాడికి దిగింది. ఆ ప్రాంతా నికి అప్పటికప్పుడు అత్యంత వేగంగా ఆయుధాలు చేరవేయాలంటే ఎంతో కష్టం కూడా. అలాంటి కష్ట సమయంలో ఇజ్రాయెల్‌ తనంత తానుగా భారత్‌కు సాయం అందించేందుకు ముందుకు రావడం ఎంతో విశేషం. కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే అసలైన మిత్రుడని పెద్దలంటారు. అంతటి కష్టంలో ఆదుకున్న మిత్రదేశం ఇజ్రాయెల్‌. అంతేకాదు, అంతకుముందు 1977లో ఇండో-పాక్‌ యుద్ధంలో కూడా ఇజ్రాయిల్‌ భారత్‌కు మద్దతుగా నిలబడింది. అంతటి స్నేహశీలి అయిన ఇజ్రాయెల్‌ దేశాధినేతను మైత్రీభావంతో ప్రధాని మోడీ ఎంతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఘనంగా స్వాగతించి ఇజ్రాయెల్‌ పట్ల భారత్‌కు ఉన్న ప్రేమాభిమానాలను చాటుకోవడం ఎంతైనా అభినందనీయం.

ఆరబ్‌ దేశాలకు ఎదురొడ్డి తన కాళ్ళమీద తాను నిలబడుతూ, అత్యద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో, విశేషమైన ప్రజ్ఞాపాటవాలతో అంచలంచలుగా ఎదుగుతోంది ఇజ్రాయెల్‌. అయితే, ఇజ్రాయెల్‌తో స్నేహం చేస్తే అరబ్బు దేశాలు మనకు వ్యతిరేకమవుతాయేమోననే సందేహంతోనే దాదాపు నాలుగున్నర దశాబ్దాలపాటు భారత్‌ ఇజ్రాయెల్‌కు దూరంగానే ఉండేది. అయితే ఆ తర్వాత కాలంలో 1992 ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌-భారత్‌ సంబంధాల్లో మార్పులు వచ్చాయి. 2003లో ఇజ్రాయెల్‌ ప్రధాని ఏరియల్‌ షారోన్‌ తొలిసారిగా భారత్‌కు వచ్చినప్పుడు అప్పటి ప్రధాని వాజ్‌పేయి కూడా ఆ పర్యటనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు.

ఆ తర్వాత, గత ఏడాది ప్రధాని మోడీ తొలిసారిగా ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్ళినప్పుడు మన ప్రధానికి ఘనమైన స్వాగతం లభించింది. ఇదే విధంగా నెతన్యాహు కూడా ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మన ప్రధానిని స్వాగతించి, ఇద్దరూ కలసి ఒకే కారులో పయనించారు. ఇప్పుడు దాదాపు 15 ఏళ్ళ తర్వాత భారత్‌కు విచ్చేసిన ఇజ్రాయెల్‌ ప్రధానిగా నెతన్యాహు భారత్‌ నుంచి ఎంతో గౌరవం అందుకుంటున్నారు.

మొత్తం ఆరురోజుల పర్యటన కోసం 130 మంది ప్రతినిధుల బృందంతో భారత్‌కు విచ్చేసిన నెతన్యాహు, భారత్‌తో కలసి పలురంగాల్లో అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఇరుదేశాలకు ఇవి మేలుబాటలే. ముఖ్యంగా చమురు, సహజవాయు రంగం, వైమానిక రవాణా, వ్యవ సాయం, సాంకేతిక రంగం, భద్రతా రంగం, సైబర్‌ భద్రత తదితర రంగాల్లో అభివృద్ధికి ఇరుదేశాలు కలసి తొమ్మిది అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసు కోవడం ఎంతైనా శుభపరిణామం.

అదేవిధంగా ఇజ్రాయెల్‌ రక్షణ సంస్థలు భారత్‌తో కలసి ఉత్పత్తులు ప్రారంభించాలన్న ప్రధాని మోడీ ఆకాంక్ష ఇరుదేశాలకు ఆనందకరమైనదే. ఇలా భారత్‌-ఇజ్రాయెల్‌ల స్నేహానుబంధం మరింతగా పటిష్టం అవుతుండడం, ఇరుదేశాల అభ్యున్నతికి ఎంతైనా ఉపయోగకరమే.

అయితే, అంతర్జాతీయ స్థాయి రాజకీయాల్లో పరిస్థితులను బట్టి ఏ ఒక్కదేశానికో పూర్తిగా అను కూలంగా వ్యవహరించడం భారత్‌ వంటి దేశాలకు సాధ్యం కాదు కనుక, జెరూసలేమ్‌ను రాజధానిగా గుర్తించడాన్ని వ్యతిరేకించే ఐరాస తీర్మానంపై భారత్‌ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. అయినా, ఆ విషయాన్ని నెతన్యాహు తప్పు పట్టలేదు. సరికదా దాని వల్ల భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య సంబంధాలకు ఎలాంటి చేటు జరగదని నెతన్యాహు ప్రకటించారు కూడా. ఇదీ స్నేహమంటే.

అంతర్జాతీయ స్థాయిలో చుట్టూ ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుని మసలు కుంటూ, స్నేహబంధాన్ని పటిష్టం చేసుకుంటూ ముందుకు సాగడమే మంచి స్నేహితుల లక్షణం. ఇప్పుడు భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న మైత్రీ ప్రస్థానం సరిగ్గా ఇలాంటిదే. ఈ స్నేహం ఇరుదేశాల మధ్య ఇలాగే కలకాలం కళకళలాడుతుండాలని కోరుకుందాం.

భారత్‌ - ఇజ్రాయిల్‌ మైత్రీవనం మరింత ప్రగతి పుష్పాలతో పరిమళ భరితం కావాలని, ఇరు దేశాలు సమన్వయంతో కలసిమెలసి అభివృద్ధిపథంలో ముందుకు సాగాలని మనసారా ఆశిద్దాం!...Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
  నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter