19 January 2018 Written by 

అంతరిక్షయానంలో... అద్భుత సెంచరీ

isroఅంతరిక్ష రంగంలో అగ్రదేశాలకు ధీటుగా దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఉపగ్రహాల ప్రయోగంలో సెంచరీ కొట్టింది. గ'ఘన' విజయాల పరంపరలో మరో మైలురాయిని దాటింది. 2018 నూతన సంవత్సరంలో తొలి ప్రయోగంగా ఈ నెల 12వ తేదీ ఉదయం 9.29గంటలకు శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-సి40 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా 1323 కిలోల బరువుగల మూడు స్వదేశీ ఉపగ్రహాలను, 28 విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. మొత్తం 31 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్ట డానికి 2గంటల 21 నిముషాల సమయం పట్టింది. ఇస్రో చరిత్రలో ఇంతవరకు 62 రాకెట్ల ప్రయోగాలు జరుగగా, వంద స్వదేశీ ఉపగ్రహాలను వాటి ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టారు. అలాగే దాదాపు 220 వరకు విదేశీ ఉపగ్రహాలను కక్ష్యకు చేర్చడం జరిగింది. పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల సక్సెస్‌తో ఇతర దేశాలు తమ ఉపగ్రహాల ప్రయోగానికి ఇస్రోను ఎంచుకుంటు న్నాయి. దీంతో వాణిజ్యపరంగానూ ఇస్రో ముందుకు దూసుకుపోతోంది.

పిఎస్‌ఎల్‌వి-సి40 విజయం అటు ఇస్రో ఛైర్మెన్‌గా కిరణ్‌కుమార్‌కు చివరి ప్రయోగం, కొత్త ఛైర్మెన్‌గా బాధ్యతలు చేపడుతున్న శివన్‌కు తొలి ప్రయోగం. ఈ విజయం ఇద్దరికీ చిరస్మరణీయమే!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నారాయణను వదలని అనిల్‌
    మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
  • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
    వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • వైసిపి వైపు నేతల చూపు
    నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter