26 January 2018 Written by 

జనం... జనం... జగన్‌ జనం!

janamజనం... జనం... ఎటు చూసినా జనం... ఏ సందు చూసినా జనం... చెట్ల క్రింద... పుట్లపైన... పొలాల గట్ల మీద జనమే జనం... జాతరకి తరలి వచ్చా రన్నట్లుగా జనం... మొలగొలుకులకు, రాజకీయ మొనగాళ్ళకు పేరెన్నికగన్న సింహపురిసీమలో, ఉద్యమాలకు, రాజ కీయ చైతన్యానికి వేదికైన నెల్లూరుజిల్లాలో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి తొలి అడుగే అదిరింది.

రాయలసీమ నాలుగు జిల్లాలలో ప్రజా సంకల్పయాత్ర ముగించు కొని ఈ నెల 23వ తేదీ ఉదయం పెళ్లకూరు మండలంలోని పెనబాక వద్ద జిల్లాలో అడుగు పెట్టిన జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తమ కష్టాలు తెలుసుకోవడానికి, కన్నీళ్ళు తుడవడానికి, మీకు నేనున్నాననే భరోసా కల్పించడానికి వందల కిలోమీటర్ల దూరం నడిచొచ్చిన జగన్‌ను జనం అక్కున చేర్చుకున్నారు.

జగన్‌ను చూసేందుకు పాదయాత్ర జరుగుతున్న రోడ్లపైకి జనం తండోప తండాలుగా వస్తున్నారు. పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు జగన్‌ కోసం ఆగుతున్నారు. ఆయన్ను చూసాకే కదులు తున్నారు. పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు జగన్‌ వస్తున్నా డని తెలియగానే పనులు పక్కనపెట్టి పరుగుపరుగున వస్తున్నారు. ఆయనతో కలసి అడుగులు వేస్తున్నారు. వృద్ధులు మా మనుమ డొచ్చాడంటూ, మహిళలు మా తమ్ముడొచ్చాడంటూ ఆయనను మంగళహారతులతో ఆత్మీయంగా స్వాగతిస్తున్నారు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని అసోసియేషన్‌ల నాయకులు పాదయాత్రలో జగన్‌ దృష్టికి తమ సమస్యలను తీసుకెళుతున్నారు. మనందరికీ త్వరలో మంచిరోజులు రానున్నాయంటూ ఆయన అందరికీ భరోసా ఇస్తూ ముందుకు కదులుతున్నాడు. ఆయా గ్రామాల ప్రజలు తమ గ్రామాలలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన చాలాశ్రద్ధగా విని నోట్‌ చేసుకుంటు న్నాడు. జగన్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి ఉత్సాహం చూపే ఏ ఒక్కరినీ ఆయన నిరాశపరచడం లేదు. చాలా ఓపిగ్గా వారితో సెల్ఫీలు దిగాకే ముందుకు కదులుతున్నాడు.

24వ తేదీ నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభకైతే జనం పోటెత్తినట్లు వచ్చారు. జిల్లాలోని వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు జగన్‌ అడుగుల్లో అడుగులు వేస్తూ ఆసాంతం పాదయాత్రలో వెన్నంటి ఉంటుండం విశేషం.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter