26 January 2018 Written by 

కటకటాలకు వాకాటి

vakatiఆయన పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌ రాహుల్‌గాంధీతోనూ, లంచ్‌ అహ్మద్‌పటేల్‌తోనూ, డిన్నర్‌ గులాంనబీ ఆజాద్‌తోనూ చేస్తుంటాడు. ఆయన నోటికి జాతీయ స్థాయి నాయకులు తప్పితే రాష్ట్రస్థాయి నాయకులు అసలు ఆనరు. ఆయనను కలిసి మాట్లాడుతుంటే... ఇప్పుడే సోనియాగాంధీ ఫోన్‌ చేసింది, అర్జంట్‌గా ఢిల్లీకి రమ్మంది... ఈమధ్య నేను ఢిల్లీలో కనిపించడం లేదని దిగ్విజయ్‌ సింగ్‌ అలిగివున్నాడు... నెల్లూరు జిల్లాలో ఈ తరహా కోతల రాయుడు... సారీ కోతల నాయకుడు ఎవరయ్యా అంటే ఎవరికైనా టక్కున గుర్తొచ్చే పేరు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి. ఆయన చేతలేమోగాని మాటలు మాత్రం ఎప్పుడూ కోటలు దాటు తుంటాయి.

నిన్నమొన్నటి దాకా కూడా ఆయన చిన్నగా వెలగలేదు. లగ్జరీ కార్లు, సెవన్‌స్టార్‌ హోటళ్ళలో బస... ఇక అక్కడ ఏమేం చేసే వారన్నది వేరే సంగతి. విమానాల్నే లీజుకు తీసుకుని తిరగడం... ఇవన్నీ సొంత డబ్బులతో చేసుకుని వుంటే ఎవరికీ వచ్చిన నష్టం ఏమీ లేదు. కాని, వీళ్ళు సొంత డబ్బులతో జల్సాలు చేయలేదు. వందల కోట్లు తమ తాతల ఆస్తులు అన్నట్లుగా బ్యాంకుల నుండి అప్పులు తీసుకున్నారు. ఆ డబ్బులతో జల్సాలు చేశారు. పార్టీ టిక్కెట్లు, పదవులు కొన్నారు. ఇప్పుడు బ్యాంకుల బకాయిలు తీర్చకుండా ఎగవేస్తున్నారు.

బ్యాంకులను మోసం చేసి వందలు, వేల కోట్లు ఎగనామం పెట్టిన నాయకులను తెలుగుదేశం పార్టీ కాపాడుతుందనే ప్రచారం విస్తృతంగా వుంది. బ్యాంకుకు బకాయిలు ఉన్నోళ్ళు తెలుగుదేశంలో చేరితే చాలు... బకాయిలు కట్టాల్సిన అవసరం లేదన్నంత భరోసా వుంది. ఈ భరోసాతోనే కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీగా వుండిన వాకాటి నారాయణరెడ్డి తెలుగుదేశంలో చేరడం జరిగింది.

విఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రాతో పాటు పలు కంపెనీలకు అధిపతి అయిన వాకాటి నారాయణరెడ్డి పలు బ్యాంకుల నుండి 443.27 కోట్లు అప్పులు తీసుకుని వున్నాడు. తన ఆస్తుల విలువను ఎక్కువుగా చూపించి బ్యాంకులకు తనఖాపెట్టాడు. ఎకరా భూమి మార్కెట్‌లో పది లక్షలుంటే ఆయన దానిని కోటిగా చూపించేవాడు. ఇలా ఆయన బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులకు తాకట్టు పెట్టిన ఆస్తులకు పొంతన లేకుండా పోయింది. బ్యాంకులనే ఆ స్థాయిలో బురిడీ కొట్టించాడు వాకాటి. ఆయన సకాలంలో బ్యాంకులకు తిరిగి ఋణాలు చెల్లించకపోవ డంతో ఆయనను డిఫాల్టర్‌గా ప్రక టించి ఆస్తుల జప్తుకు బ్యాంకులు గతంలోనే నోటీసులు జారీ చేసాయి. కాగా, ఇదే క్రమంలో వాకాటి నారాయణరెడ్డి తమ నుండి 190 కోట్లు ఋణం తీసుకుని మోసం చేసాడని తప్పుడు డాక్యుమెంట్లు కారణంగా తమ సంస్థకు 205కోట్లు నష్టం వాటిల్లిం దని ఐఎఫ్‌సిఐ(భారతీయ పారిశ్రామిక ఆర్ధిక సంస్థ) సిబిఐకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన సిబిఐ ఈ కేసులో వాకాటితో పాటు ఐఎఫ్‌సిఐ డిజిఎం వి.సి రామ్మోహన్‌ను మరో నలుగురిని నిందితులుగా చేర్చి వీరిపై 120బి, 420 ఐపిసి సెక్షన్‌ల క్రింద కేసులు నమోదు చేసింది. విచారణ నిమిత్తం సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేయడంతో వాకాటి నారా యణరెడ్డి 21వ తేదీ బెంగుళూరు వెళ్ళాడు. అక్కడ ఆయనను విచారించిన అధికారులు ఈ కేసులో ఆయనను అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించారు. వాకాటి వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశంపార్టీలో కలకలం రేపుతోంది. కాంగ్రెస్‌ నుండి వచ్చిన వాకాటిని గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టి మళ్ళీ ఎమ్మెల్సీని చేశారు. అప్పటికే ఆయన మీద తీవ్ర ఆర్ధిక నేరారోపణలుండినాయి. జిల్లా పార్టీలోనే పలువురు నాయకులు ఆయనకు సీటివ్వడాన్ని వ్యతిరేకించారు. అయినా లోకేష్‌బాబును ప్రసన్నం చేసుకుని ఉండడంతో వాకాటికి సీటొచ్చింది. ఆ వెంటనే వాకాటికి సంబంధించి ఆస్తుల జప్తుకు బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. మీడియాలో ఈ వార్త ప్రధానంగా చర్చకు రావడంతో చంద్రబాబు ఆయనను పార్టీ నుండి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పేరుకు వాకాటిని పార్టీ నుండి సస్పెండ్‌ చేసారనేగాని పార్టీ కార్యక్రమాలకు ఆయనేం దూరం కాలేదు. ఈమధ్య చంద్రబాబు జన్మభూమి సభలో కూడా పాల్గొన్నాడు. ఆయనపై వున్న సస్పెండ్‌ను త్వరలోనే ఎత్తేస్తారనుకున్న నేపథ్యంలో ఆయన మెడకు సిబిఐ ఉచ్చు బిగుసుకుంది. మరి చంద్రబాబు ఆయనను కాపాడుతాడో లేక పార్టీ నుండి దూరంగా గెంటేస్తాడో చూడాలి.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
  నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter