Friday, 26 January 2018 10:15

సిరివెన్నెలకి డా|| నాగభైరవ అవార్డు

Written by 
Rate this item
(0 votes)

sirivennelaసుప్రసిద్ధ కవి స్వర్గీయ డా|| నాగభైరవ కోటేశ్వరరావు 9వ అవార్డు 2017 సంవత్సరానికి గాను ప్రఖ్యాత సినీ కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంపికయ్యారని డా|| నాగభైరవ అవార్డు కమిటి ప్రధానకార్యదర్శి చిన్ని నారాయణరావు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం నెల్లూరు టౌన్‌హాల్లో జరిగే నాగభైరవ అవార్డు పండుగసభలో సిరివెన్నెలకు ప్రదానం చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ అవార్డు క్రింద రూ.25వేలు నగదు పారితోషికంతో పాటు ఘన సత్కారం జరుగుతుందన్నారు. అలాగే ప్రతియేటా ఇచ్చే నాగభైరవ స్ఫూర్తి అవార్డులకు వంజివాక సతీష్‌రెడ్డి(నెల్లూరు), డా|| ఈదూరు సుధాకర్‌ (నెల్లూరు), కొండెపోగు బి.డేవిడ్‌ లివింగ్‌స్టన్‌(మార్కాపురం), పి.లక్ష్మణరావు(విజయనగరం), కాట్రగడ్డ లక్ష్మీనరసింహరావు(ఏలూరు), శ్రీమతి ఆవాల శారద(విజయవాడ)లను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. డా|| నాగభైరవ అధ్యాపక సత్కారానికి ప్రముఖ సాహితీవేత్త, విశ్రాంత అధ్యాపకులు కాళిదాసు పురుషోత్తం ఎంపికైనట్లు తెలిపారు. 2009లో ప్రారంభించబడిన ఈ అవార్డులను ప్రముఖ సాహితీవేత్తలు మల్లెమాల సుందరరామిరెడ్డి, దర్బశయనం శ్రీనివాసాచార్య, రసరాజు, తనికెళ్ళ భరణి, అద్దేపల్లి రామ్మోహనరావు, సుద్దాల అశోక్‌తేజ, గొల్లపూడి మారుతీరావు, రావి రంగారావులకు ప్రదానం చేయడం జరిగిందన్నారు.

ఈ అవార్డు పండుగలో ముఖ్యఅతిథులుగా రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రముఖ దాత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాజధాని కమిటి సలహాసంఘ సభ్యులు బీద మస్తాన్‌రావు, మాజీమంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి, 'లాయర్‌' వారపత్రిక సంపాదకులు తుంగా శివప్రభాత్‌రెడ్డి, డా|| నాగభైరవ అవార్డు కమిటి అధ్యక్షులు, ప్రముఖ సినీ కవి వెన్నెలకంటి పాల్గొంటారని తెలిపారు. నాగభైరవ కుటుంబసభ్యులైన శ్రీమతి కూకట్ల రాజ్యలక్ష్మి, శ్రీమతి ధూళిపాళ్ళ రవీంద్రకుమారి, శ్రీమతి మన్నం మనోరమలు ఆత్మీయ ఆహ్వానితులుగా పాల్గొంటారని వెల్లడించారు. కళాంజలి అనంత్‌ ఆధ్వర్యంలో సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.

Read 417 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
  నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…
 • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
  ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…

Newsletter