26 January 2018 Written by 

విశ్వవేదికపై భారత్‌ దార్శనికత

modiఅందరి సహకారం ఉంటేనే ఎక్కడైనా సరే అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది. కుటుంబంలోనైనా, సమాజంలోనైనా, చివరికి ప్రపంచంలోనైనా సరే..అందరికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. అవినీతి, అక్రమాలతో ఎవరికి వారు సొంత ఆర్జనకే జీవితాలను వ్యర్ధం చేసుకోక, సమాజంలో శాంతి సామరస్యాలకి.. అందరి అభివృద్ధికీ అవసరమైన మార్గాలు వేయగలిగినప్నుడే ప్రగతి మన కళ్ళ ముందు కళకళలాడుతుంది. చుట్టూతా చుట్టుముడుతున్న అనేకానేక సవాళ్ళను ధీటుగా ఎదుర్కొంటూ, అందరి తోడ్పాటుతో అభివృద్ధి పథం వైపు నడిచినప్పుడే ప్రగతి ఫలాలు అందరికీ అందుతాయి. శాంతి సహనంతో..సుఖ సంతోషాలతో ప్రపంచం నడవాలంటే ఇరుకుదారుల్లో ఉన్న మనసును విశాలహృదయంగా మార్చుకోవాలి. అందుకు అన్ని దేశాలు కలసిట్టుగా ముందుకు సాగాలి. అప్పుడే విశ్వమంతా స్వేచ్ఛా స్వర్గంగా మారుతుంది. ఆరోజు రావాలి. ప్రపంచమంతా ఒక్కటై.. మనది వసుధైక కుటుంబం అని అందరూ గర్వంగా, సగర్వంగా చెప్పుకునే రోజు రావాలి. ఆ రోజును ఎల్లప్పుడూ కాంక్షించేది, విశ్వమానవాళి శాంతిని ఆకాంక్షించేది మన భారత్‌. అందుకే, ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్ళకు భారతీయ తత్వమే పరిష్కారం అని ప్రధాని మోదీ ప్రపంచస్థాయి వేదికపై స్పష్టం చేసి భారతీయ దార్శనికతను దశదిశలా చాటారు.

దావోస్‌లో జరుగుతున్న 'వరల్డ్‌ ఎకనమిక్‌ పోరం' వార్షిక సదస్సులో భారత్‌ వాణిని అద్భుతంగా, అమోఘంగా వినిపించి అందరి కరతాళ ధ్వనులం దుకున్నారు. 'సబ్‌ కా సాథ్‌..సబ్‌ కా వికాస్‌' (అందరి సహకారంతోనే అద్భుత ప్రగతి) అంటూ.. ప్రస్తుత ప్రపంచానికి భారతీయ తత్వమైన 'వసుధైక కుటుంబం' ఉత్తమమన్నారు. ఇలా భారత్‌ దార్శని కతను ప్రపంచానికి చాటిచెప్పడంతో విశ్వవేదికపై భార తీయ ఔన్నత్య పతాకను మరోసారి రెపరెపలాడించి నట్లయింది. ఈ సదస్సు సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్య్రూడ్యూతో, నెదర్లాండ్స్‌ రాణి మాక్సిమాతోను, వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం ఛైర్మన్‌ క్లాస్‌ స్వ్యాబ్‌తోను, స్విస్‌ సమాఖ్య అధ్యక్షుడు అలేన్‌లతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. అంతేకాదు, ఈ అంతర్జాతీయ వార్షిక సదస్సులో ప్రారంభప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ తన ప్రత్యేకతను చాటుకున్నారు. దావోస్‌లో 18 దేశాలకు చెందిన 40 దిగ్గజ సంస్థల సారధులతో సమావేశం సందర్భంగా భారత ప్రధాని మోడీ ఎంతో దార్శనికతతో ప్రసంగించడం ప్రపంచదేశాలను బాగా ఆకట్టుకుంది. భిన్నత్వంలో ఏకత్వమే బలమని ప్రకటించడం, అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో సంపదను సృష్టించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు భారత్‌కు తరలిరావాలని ఆహ్వానించడం అందరినీ బాగా ఆకట్టుకుంది. అపారమైన మానవ వనరులను వినియోగించుకుని, నైపుణ్యాన్ని జోడించి, అవరోధాలను అధిగమించి అద్భుతమైన అవకాశాలను మనకు మనమే సృష్టించుకోవాలని ప్రధాని మోదీ అందరికీ అభివృద్ధి మంత్రం ఉద్బోధించారు.

శతాబ్దాల తరబడిగా ఘనమైన సంస్కృతీ సంప్రదాయాలకు, శాంతి సుహృద్భావాలకు నెలవైన భారతావని ఆర్ధిక వాణిజ్యవిధానాల పరంగా రూపాంతరం చెందుతున్న దశలో, ఇలా బయటినుంచి కూడా పెట్టుబడుల్ని స్వాగతించడం అందరికీ సంతోషాన్ని కలిగించేదే. సంపదతో కూడిన శ్రేయస్సు కావాలంటే భారత్‌కు రండి, ఆరోగ్యంతో కూడిన పూర్ణత్వం కావాలంటే భారత్‌కు రండి!, సౌభాగ్యంతో కూడిన శాంతి కావాలంటే భారత్‌కు రండి!.. సహకారమే కానీ విభజనలు, చీలికలు లేని స్వేచ్ఛాపూరిత స్వర్గాన్ని సృష్టిద్దాం రండి!..అంటూ ప్రధాని మోడీ భారత్‌లో పెట్టుబడులకు ఆహ్వానించిన తీరు అమోఘం. భారతీయ తాత్విక చింతనను, దార్శనికతలను ఎంతో వివరంగా పేర్కొంటూ ఈ ప్రపంచస్థాయి సదస్సులో భారత్‌ ప్రత్యేకతను చాటారు. ప్రపంచం ఎదుర్కొంటున్న మూడు పెనుసవాళ్ళను ఈ సందర్భంగా ప్రధాని మోడీ అందరి దృష్టికి తీసుకువచ్చారు. పర్యావరణ సమతూకాన్ని పాటించకుంటే మానవాళి మనుగడకు పెనుముప్పు వాటిల్లుతుందన్నారు. తీవ్రమైన వాతావరణ మార్పులతో మంచుఖండాలు కరిగిపోతున్నాయని, ప్రతికూల వాతావరణం వల్ల కొన్ని ద్వీపాలు మునిగిపోతున్నా యన్నారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఏంచేయాలో ప్రపంచం ఆలోచించాలన్నారు. వాతా వరణ మార్పులపై సంపన్నదేశాల ద్వంద్వ విధానానికి చురకలంటిస్తూనే, ఈ విషయంలో అగ్రరాజ్యాలు చిన్నదేశాలకు వెన్నుదన్నుగా నిలవాలని పిలుపు నివ్వడం ద్వారా ఆయా దేశాలకు కర్తవ్యబోధ చేసినట్లయింది. రక్షణాత్మక వాణిజ్య ధోరణులు మంచిది కాదన్నారు. ఉగ్రవాదుల్లో మంచి ఉగ్రవా దులు- చెడు ఉగ్రవాదులు అంటూ ఉండరని అంటూ ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు తప్పనిసరి అని, ఉగ్ర వాదంపై పోరాడేవారికి భారత్‌ బాసటగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచ పురోగతికి, వేగవంతమైన అభివృద్ధికి అన్ని దేశాలు సహకరించాలన్నారు. ప్రపంచానికి వాటిల్లుతున్న ముప్పులను ఎదుర్కొనేందుకు కాలయాపన చేయకుండా అన్ని దేశాలకూ తక్షణ స్పందన అవసరమన్నారు. మానవాళి ఉజ్వల భవిష్యత్తు కోసం అవరోధాలన్నిటినీ అధిగమించాల్సి ఉందన్నారు. ప్రజాస్వామ్యమనేది ఒక వ్యవస్థ కాదని.. అది భారతీయ జీవన విధానమని స్పష్టం చేశారు. ప్రజలను ఏకం చేయాలే కానీ, విభజించడం కాదనీ, ప్రపంచమంతా ఒక్కటే అనే భారతీయ తత్వం..'వసుధైక కుటుంబ విధానం' ఉత్తమమని సగర్వంగా ప్రకటించి అందరి కరతాళధ్వనులందుకున్నారు. అంతేకాదు, ప్రపంచ శాంతికి భారత్‌ ఎప్పుడూ పాటుపడుతూనే ఉంటుందని, ఐరాస శాంతి పరిరక్షక దళంలో భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించే సైనికులే ఎక్కువగా ఉన్నారని ఉదహరించారు. ప్రపంచ ఆర్థిక పురోగతికి భారత్‌ ఎల్లవేళలా సహకరిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. విశ్వవేదికపై భారత్‌ వాణిని అత్యద్భుతంగా వినిపించి, భారత్‌ దార్శనికతను ప్రపంచానికి చాటడంలో ప్రధాని మోడీ తనకు తానే సాటి అన్పించుకున్నారు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
  నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter