26 January 2018 Written by 

26-01-2018 రాశిఫలాలు

rasi 26

1Ariesమేషం

రావలసిన బాకీలు కొంత లభించగలవు. ముఖ్య పనులను బాధ్యతలను ఇతరులకు అప్పగించవద్దు. విద్యార్థులు బాగా కష్టపడాలి. వర్కర్ల సమస్యలు యజమానులకు ఉంటాయి. ఉపాధి పథకాలు సంతృప్తి కరం. తండ్రివర్గ బంధువులకు కొద్ది అనారోగ్య బాధ లుంటాయి. డబ్బుకు ఇబ్బంది లేకుండా వృత్తి వ్యాపారాలు బలపడి ఆదాయం పెరుగుతుంది.

 

2Taurusవృషభం

విద్యా ప్రగతి బాగుంటుంది. ప్రముఖుల పరిచ యాలు, శుభకార్యాలు నిర్ణయం కావడం జరుగుతుంది. మీ సలహాలు సూచనలు ఇతరులకు ఉపయోగపడ తాయి. అనుకున్న పనులు సవ్యంగా జరగడానికి ఇతరుల సహాయం లభించగలదు. గౌరవ మర్యాదలు బాగుండి, సభలు సమావేశాల నిర్వహణలో ప్రయత్నాలు చేస్తారు. వృత్తి పరంగా రాబడి సంతృప్తికరం.

 

3Geminiమిధునం

వాణిజ్య ఒప్పందాలకు అవకాశాలు వస్తాయి. బంధు వుల నుండి అనారోగ్య వార్తలు వింటారు. ఉద్యోగులు అధికారులతో పబ్లిక్‌తో జాగ్రత్తగా మెలగండి. విద్యా ప్రగతి బాగుంటుంది. ఆదాయ వ్యయాలు సరిపోతుం టాయి. వృత్తి వ్యాపారవృద్ధికి మీ ప్రయత్నాలు అనుకూ లమై ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తుల లావాదేవీలు వాయిదా పడతాయి. ఆరోగ్యం బాగుండును.

 

4Cancerకర్కాటకం

ఆర్ధిక ఒప్పందాలు కుదరడం, ఋణాలు లభిం చడం జరుగుతుంది. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యు లతో రాజీపడవలసి వస్తుంది. ఉద్యోగులు విధి నిర్వహణ ప్రశాంతంగా జరుపుకొంటారు. అధికారుల దాడులు, వత్తిడులుండవచ్చును. విద్యా ప్రగతి బాగుంటుంది. ఆర్ధిక స్థితి క్రమంగా మెరుగు కాగలదు. వ్యాపారాలు, వృత్తి జీవనాలు సామాన్యంగా జరిగి ఆదాయం ఉంటుంది.

 

5Leoసింహం

కళా క్రీడా సాంకేతిక రంగాలవారికి అవకాశాలు బాగుంటాయి. దూరప్రయాణాలుంటాయి. టెన్షన్‌ ఎక్కు వగా ఉంటుంది. ఆరోగ్యం లోపం కలుగకుండా జాగ్రత్త పడాలి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. వస్తువులు, కాగి తాలు జాగ్రత్త పరచుకొనండి. ప్రముఖులను కలుసు కొంటారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి విస్తరణ జరు పుతారు. నూతన వస్తువులు సమకూరుతాయి.

 

6Virgoకన్య

కొత్త కాంట్రాక్టులు లీజులు లభించగలవు. శుభ కార్య ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతాయి. దూర ప్రయాణాలుంటాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. విద్యా ప్రగతి బాగుంటుంది. మీ సమర్ధతకు గుర్తింపు గౌరవాలు బాగుంటాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ బాగుం టుంది. ఆదాయం పెరుగుతుంది.

 

7Libraతుల

సభలు, సమావేశాలందు ప్రముఖంగా పాల్గొంటారు. అధికారులకు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయ త్నాలలో అనుకూలత ఉంటుంది. మీవి కాని విషయా లలో జోక్యం వద్దు. ఆరోగ్యం ఫరవాలేదు. సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించగలరు. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది.

 

8Scorpioవృశ్చికం

శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగు లకు గుర్తింపు గౌరవాలు, అధికారుల ఆదరణ బాగుం టుంది. కోర్టు వ్యవహారాల విషయంలో పన్నుల చెల్లింపు వ్యవహారాలలో సంప్రదింపులు చేస్తారు. దూర ప్రయా ణాలు నిర్ణయం కాగలవు.ఆరోగ్యం ఫరవాలేదు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. కొత్త పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు అనుకూలత బాగుంది.

 

9Sagittariusధనుస్సు

బంధుమిత్రులను కలుసుకొంటారు. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. నూతన వస్తు, వస్త్రాలు సమ కూరుతాయి. యజమానులకు వర్కర్లతో సమస్యలుండ వచ్చును. విద్యార్థులకు మంచి అభివృద్ధి కలదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అనుకున్న పనులు నిదా నంగా సానుకూలం కాగలవు. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విభేదాలుండవచ్చును. రాబడి పెరుగుదల ఉంటుంది.

 

10Capricornమకరం

అనుకున్న పనులను ఉపాయం తెలివితేటలు చూపి జరుపుకొనవలసి ఉంటుంది. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. దూర ప్రయాణాలుంటాయి. ఉద్యోగులకు శ్రమ అధికం. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. ఆడిటర్లు, కళాక్రీడా సాంకేతిక రంగాల వారికి బాగుంటుంది. ఈ వారం ఖర్చులు అధికంగా ఉండ గలవు. అయినా డబ్బుకు ఇబ్బంది కలగదు.

 

11Aquariusకుంభం

ఎటువంటి వత్తిడులకు మొగమాటాలకు లొంగ వద్దు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. మిమ్మల్ని అభిమానించే వారు పెరుగుతారు. విలువైన వస్తువులను సమకూర్చుకొం టారు. దూర ప్రయాణాలుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చేయదలచిన పనులకు సొంత పర్యవేక్షణ అవసరం. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి.

 

12Piscesమీనం

వృత్తి వ్యాపారవృద్ధి ప్రయత్నాలు అనుకూలించి ఆదాయం పెరుగుతుంది. గృహ వస్తు వాహన రిపేర్లుం టాయి. ప్రయాణాలు వాయిదా పడగలవు. ముఖ్య పత్రాలు, నోటీసులు అందుకొంటారు. కోర్టు కేసులందు అనుకూలత కలదు. సోదరులతో కొద్ది విభేదాలు రావ చ్చును. ఆరోగ్యం బాగుంటుంది. బాకీలు నిలబడిపో తాయి. కాని ఆర్ధిక ఇబ్బందులుండవు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • అమ్మో... దొంగల ముఠా
  కరుడుగట్టిన కిరాతకులు వాళ్ళు... మంచితనం, మానవత్వం ఉండదు... దయ, కరుణ మచ్చుకైనా కానరావు... పిల్లా, పెద్ద అనే తేడా లేదు... ఇంట్లో దూరితే అందర్నీ చంపేయడం, అందినకాడికి దోచుకునిపోవడం... దోచుకున్న ఇంట్లోనే భోం చేయడం, అక్కడే మలమూత్రాలు విసర్జించడం... ఈ ముఠా…

Newsletter