02 February 2018 Written by 

ఏకకాల ఎన్నికలు

evmదేశంలో తరచూ ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతున్నందువల్ల దేశాభివృద్ధికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీనివల్ల ఆర్ధికవ్యవస్థపై, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఖజానాపై భారాన్ని తగ్గించేందుకు, ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు జమిలి ఎన్నికల నిర్వహణపై చర్చ జరగాలి. అందుకు రాజకీయపార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావాలి. కనుక ఈ విషయమై అన్ని పార్టీలు కలసి సమగ్రంగా చర్చించాల్సి ఉంది. - భారత రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌

ఏకకాల ఎన్నికలకు అనుకూల వాతావరణాన్ని కలిగించేందుకు అందరూ కృషి చేయాలి. జమిలి ఎన్నికల విషయమై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. - ప్రధాని మోడీ

దేశంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా?..అవి కూడా ఏకకాలంలో (జమిలిగా) వస్తున్నాయా?.. అనే విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా అటు రాజకీయవర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోను, సర్వేసర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. మొన్నటికి మొన్న అటు రాష్ట్రపతి రామ్‌నాధ్‌కోవింద్‌, ప్రధాని మోడీ చేసిన ప్రసంగాల్లో ఏకకాల ఎన్నికల ప్రస్తావన రావడంతో దేశ రాజకీయాలు తాజాగా రసకందాయంలో పడి నట్లయింది. దేశంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఇవే మాటలు వినిపిస్తున్నాయి. దేశంలోనూ, రాష్ట్రా ల్లోనూ ఎక్కడో ఒకచోట తరచూ ఎన్నికలు జరుగు తుండడం వల్ల ఎంతో ప్రజాధనం వృధా కావడమే కాక, మానవ వనరులు కూడా వృధా అవుతున్నాయని, అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు కూడా ఏర్పడు తున్నాయనే వాదనలు జోరందుకుంటున్నాయి. ఎన్నికల్లో నానాటికీ పెరిగిపోతున్న భారీ వ్యయాన్ని అరికట్టేందుకు ఏకకాల ఎన్నికలు ఎంతో ఉపయోగ పడతాయని, అందువల్ల ఏకకాల ఎన్నికలే మేలు అనే భావన ప్రజల్లో కలుగుతోంది. రాజకీయనేతలు ఎప్పుడూ రాజకీ యాలపైనే కాకుండా, దేశాభివృద్ధిపై దృష్టిపెట్టేందుకు కూడా ఈ విధానం ఎంతో బావుంటుందనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. అయితే, ఈ ప్రతిపాదన బిజెపికి ఇప్పుడే కాదు.. చాలాకాలం నుంచే ఉంది. దేశంలో ఏకకాలంలో ఎన్నికలు అవసరమంటూ 2012 లోనే బిజెపి సీనియర్‌ నేత అద్వానీ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి లేఖ రాశారు కూడా. ప్రధాని మోదీ కూడా ఈ అంశాన్ని రెండేళ్ళ క్రితమే మరోసారి అజెండాలోకి తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

దేశంలో తరచూ ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతున్నందువల్ల దేశాభివృద్ధికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని, ఖజానాపై భారాన్ని తగ్గించేందుకు, ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు జమిలి ఎన్నికల నిర్వహణపై చర్చ జరగాల్సి ఉందని తాజాగా భారత రాష్ట్రపతి రామ్‌నాధ్‌కోవింద్‌ సూచించడం అందరినీ ఆలోచింపజేసేదే. ఇటీవల ఉభయసభలను ఉద్దేశించి తొలిసారిగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ, 'ఒకే దేశం- ఒకే ఎన్నిక' అనే ఆలోచన దేశంలో ఎంతోకాలం నుంచి ఉందన్నారు. 1999లో లా కమిషన్‌ ఈ విషయాన్ని సూచించిందని, పార్లమెంట్‌ స్థాయీ సంఘం కూడా 2015లో దీనిపై ఒక నివేదిక ఇచ్చిందని, ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల ప్రజాధనం ఆదా చేసినట్లవుతుందని పేర్కొన్నారు. తరచూ ఎన్నికలు జరుగుతుండడం వల్ల దేశ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఆర్ధికవ్యవస్థపై, దేశాభివృద్ధిపై దీని ప్రభావం ప్రతికూలంగా ఉంటోందని, అందువల్ల జమిలి ఎన్నికల నిర్వహణపై సమగ్రమైన చర్చ జరగాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. దీనిపై రాజకీయపక్షాలన్నీ ఏకాభిప్రాయానికి రావాలని, నవభారత నిర్మాణానికి అందరూ చిత్తశుద్ధితో కలసి పనిచేయాలని సూచించారు. అదేవిధంగా ప్రధాని మోడీ కూడా ఏకకాల ఎన్నికల అంశానికి తన మద్దతునిస్తూ ప్రసంగించారు. ఏకకాల ఎన్నికలకు అనుకూల వాతావరణాన్ని కలిగించేందుకు అంద రూ కృషి చేయాలని, దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరగాలని ప్రధాని సూచించారు. దీంతో, దేశవ్యాప్తంగా ప్రజల్లోను, రాజకీయ వర్గాల్లోను ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఏకకాల ఎన్నికలను ప్రధాని ముందస్తుగానే నిర్వహించాలని అనుకుంటున్నట్లుందని. ముందస్తు ఏకకాల ఎన్నికలకు ఇదొక సూచనేమోనని రాజకీయవర్గాల విశ్లేషణ. ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ద్వారా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడకుండా జాగ్రత్త పడాలని, ఈ విషయంలో విపక్షపార్టీలకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే వ్యూహంతో ప్రధాని మోదీ ఏకకాల ఎన్నికలకు సమాయత్తమవుతున్నారేమోనని మరికొందరు రాజకీయ నిపుణుల భావన. మరోవైపు, మరో మూడు నాలుగునెలల్లోనే ఎన్నికలు నిర్వహిం చేందుకు కూడా మోదీ ఆలోచిస్తున్నారనే ప్రచారం రాజ కీయ వర్గాల్లో కలవరం కలిగిస్తోంది. ఇదిలావుంటే, ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల నష్టాలు కూడా

ఉన్నాయనే అభిప్రాయాలూ జోరుగానే ఉన్నాయి. వేర్వేరు ఎన్నికల వల్ల పాలకుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని, త్వరలో మళ్లీ ఎన్నికలు వస్తాయనే ఆలోచన ఉంటే పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం తక్కువగా ఉంటుందని, అందువల్ల వేర్వేరు ఎన్నికలు మంచిదేనని భావించేవారు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ ముందస్తు ఏకకాల ఎన్నికలు వస్తే ఏమిచేయాలనే ఆలోచనలు విపక్ష నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఏదేమైనా, దేశాభ్యున్నతి కోసం జరిగే ఏ విధానానికైనా, ఎలాంటి సంస్కరణకైనా ప్రజల ఆమోదం ఎలాగూ ఉంటుందని వేరే చెప్పనక్కర లేదు. అందువల్ల వ్యయభరితం కాని ఏకకాల ఎన్నికలు మేలనే భావనే ప్రజల్లో అధికంగా ఉంది. ఏదెలావున్నా.. ప్రజాపాలన పారదర్శకంగా, సకల జనరంజకంగా జరగడమే అందరికీ కావాల్సింది. ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నప్పుడే ఏ విధానానికైనా సార్ధకత. దేశాభ్యున్నతి, ప్రజల అభ్యున్నతితోనే ముడివడివుంటుంది కనుక, దేశసమగ్రాభివృద్ధే లక్ష్యంగా అందరూ కలసి ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా మంచి విధానాలను పాటిస్తూ ముందుకు సాగాలి. అప్పుడే దేశం ప్రగతి పథంలో రాణిస్తుంది!... నవభారత్‌ స్వప్నం సాకారమవుతుంది!....Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter