02 February 2018 Written by 

వైసిపిలోకి... వేనాటి!

venatiఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులలో మొదటి వాడు వేనాటి రామ చంద్రారెడ్డి. 1983లో పార్టీ పెట్టినప్పటి నుండి ఆయన పార్టీలోనే వున్నాడు. ఆయనకు స్వర్గీయ వై.యస్‌.రాజశేఖరరెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డిలతోనే కాకుండా ఈ జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబమైన ఆనం కుటుంబంతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. వీళ్ళ కోసం కూడా ఆయన ఎప్పుడూ పార్టీ మారలేదు. కాని, గత నాలుగేళ్ళుగా పార్టీలో ఆయన ఎదుర్కొంటున్న అవమానాలు, పరాభవాలు చూసి ఆయన కుటుంబసభ్యులే విసుగెత్తిపోయారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక సూళ్ళూరుపేటలో వీరి పెత్తనాన్ని తగ్గించే ప్రయత్నాలు జరిగాయి. ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళకు పెద్దపీట వేస్తూ వచ్చారు. వేనాటి రామచంద్రారెడ్డికి కనీసం ఒక చిన్న నామినేటెడ్‌ పదవి కూడా రాలేదు.. అయినా కూడా ఆయన అవసమానాలను భరిస్తూ పార్టీలోనే వున్నాడు.

కాని, ఆయన కొడుకు, సూళ్ళూరుపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌ వేనాటి సుమంత్‌రెడ్డి మాత్రం ఇటీవల జగన్‌ పాదయాత్రలో పాల్గొన్నాడు. వైసిపిలో చేరనున్నట్లు ప్రకటిం చాడు. తమ కుటుంబానికి టీడీపీ చేసిన అన్యాయాన్ని వివరించారు. వేనాటి సుమంత్‌ ఎప్పుడైతే తిరుగుబాటు జెండా ఎగురవేసాడో అప్పుడే జిల్లా తెలుగుదేశం నాయకులు మేలుకున్నారు. ఆఘమేఘాల మీద వేనాటి కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు. తాము తెలుగుదేశం వదిలి పోవడం లేదని వారిచేత స్టేట్‌మెంట్లిప్పించారు.

ఏదేమైనా సుమంత్‌ తిరుగుబాటుతో వేనాటి వర్గంలో కదలిక వచ్చింది. వేనాటి వర్గీయులు ఎక్కువమంది వైకాపావైపే చూస్తున్నారు. ఈరోజు సుమంత్‌రెడ్డి... రేపు ఆయన బాటలో కుటుంబం మొత్తం నడిచినా ఆశ్చర్యం లేదు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
    ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…
  • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
    నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…

Newsletter