02 February 2018 Written by 

మెరుపులు కాదు... సరికొత్త మార్పుల బడ్జెట్‌ - చిన్ని శ్రావణ్‌కుమార్‌, చార్టెర్డ్‌ అకౌంటెంట్‌

sravanఎలాంటి పైపై మెరుగులు లేని, ప్రజల అభ్యన్నతిని కాంక్షించిన బడ్జెట్‌ అరుణ్‌జైట్లీ రూపొందించిన 2018-19 బడ్జెట్‌ అంటే అతిశయోక్తి కాబోదు. తళుకుబెళుకులు దిద్దటం గత ప్రభుత్వాలకు అలవాటు. స్థిరంగా ధృడంగా నిర్ణయాలు తీసుకోవడం బీజేపీ ప్రభుత్వం తీసుకొన్న గొప్పనిర్ణయం.

ఇది వ్యవసాయబడ్జెట్‌గా మోదీ అభి వర్ణించారు. దానికి తగ్గట్టుగానే ఆక్వా పరిశ్రమ, చేపల పెంపకాలను వ్యవ సాయం కిందనే ప్రతిపాదిస్తూ ఆయా రంగాల వాళ్ళకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇచ్చి ప్రోత్సహించారు. వెదురుచెట్లను గ్రీన్‌గోల్డ్‌గా భావించి వాటి పెంపకాలకు 1290 కోట్లను కేటాయించడం జరిగింది. కౌలు రైతులకు పెద్దపీట వేస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణ సదుపాయాలు కల్పించే గొప్ప ప్రతిపాదన చేసింది. భారతదేశం 1000 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు చేయగల్గిన సామర్ధ్యం కలిగివుండి కూడా కేవలం 30 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల్ని మాత్రమే చేయడం విచారకరం. అలాంటి విషాదాన్ని స్వీక రించి ఆనందమయ, ఆహ్లాదకర వాతా వరణాల్ని సృష్టించే కొత్తదనం బిజెపి వారిది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 2 వేల కోట్ల రూపాయల నిధితో 'అగ్రికల్చర్‌ మార్కెట్‌ ఇన్‌ఫ్రా ఫండ్‌'ను సృష్టించి ప్రజామోదయోగ్యంగా నిలబడే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మోదీ ప్రభుత్వ ప్రత్యేకతగా భావించవచ్చు.

ప్రపంచంలో భారతదేశం ఏడవ అతి పెద్ద ఆర్ధికవ్యవస్థ అయినప్పటికీ నాణ్యమైన ఆహారపదార్ధాల కొరత ఉండనే ఉం టుంది. దీన్ని అధిగమించడం కోసం ఆర్గానిక్‌ పంటల మీద ప్రత్యేక దృష్టి సారించింది. 2022 సంవత్సరంలో రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసే ఆలో చనతో బడ్జెట్‌ను రూపొందించారు జైట్లీ. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కనీసం మంచి ఆహారం తీసుకోలేని దుస్థితి

ఉంచి ఒక్కో అడుగు ముందుకేసి పరుగును లంకించుకోవాల్సిన అవసరాన్ని ప్రభు త్వాలు గుర్తించడం శుభసూచకం.

'ఆపరేషన్‌ గ్రీన్‌' ద్వారా మౌలిక సదుపాయాల్ని కల్పించి సంవత్సరం మొత్తానికి ఉపయోగపడే రీతిలో టమోటో, ఉల్లిపాయలు, నిమ్మకాయలు తదితర కూరగాయల నిల్వ కోసం 500 కోట్లు కేటాయించడం మరో శుభపరిణామం.

నెల్లూర్లో ప్రాముఖ్యత పొందిన చేపలు మరియు రొయ్యలు, పశుసంపదను కాపా డడం కోసం పదివేల కోట్ల నిధిని ఏర్పాటు చేయడం ఒక వరంగా భావించవచ్చు.

కాలుష్యం కోరల్లో చిక్కుకున్న మన రాజధాని ఢిల్లీ మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్ని కాపాడే యంత్రాలకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించడం పర్యావరణానికి పెద్ద పీట వేసినట్లే అవుతుంది.

రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ను సడలిస్తూ 13 లక్షల మందికి శిక్షణ ఇచ్చి విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేయడం జరిగింది. భారతదేశంలో వెయ్యి మంది బిటెక్‌ విద్యార్థులను గుర్తించి వాళ్ళను పిహెచ్‌డిలతో తీర్చిదిద్దేవిధంగా ముందుకు రావడం హర్షణీయం.

ఈ బడ్జెట్‌లో హర్షించదగిన మరో గొప్ప అంశం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం కంకణం కట్టుకోవడమే. కుటుం బానికి సుమారు 5లక్షల రూపాయల వైద్యం అందేట్టు నేషనల్‌ హెల్త్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌ను రూపొందించడం జరిగింది. ప్రభుత్వం మరో 24 మెడికల్‌ కళాశా లలను తీసుకునిరావడం అభినందనీయం. ప్రతి మూడు పార్లమెంటరీ నియోజకవర్గా లకు ఒక ప్రభుత్వ వైద్యకళాశాల, హాస్పిటల్‌ రూపొందించే గొప్ప ప్రతిపాదన బిజెపి అందిస్తున్న వరంగా పేర్కొనవచ్చు.

బ్యాంకు లోన్లు, జిఎస్టీలో తమ టర్నో వర్‌ను నమోదు చేసినవాళ్ళకి మాత్రమే ఇచ్చే ప్రతిపాదన చేయడం చక్కని ఆలోచన. దీనితో బ్యాంకుల్లో ఇబ్బడిముబ్బడిగా రుణసదుపాయం పొందడాన్ని అరికట్టే వ్యక్తుల దారుణానికి అడ్డుకట్ట వేయడం సరైన ఆలోచనా విధానం.

అయితే, ఎంపీలకు, ద్రవ్యోల్బణాన్ని అనుసరించి జీతభత్యాలని పెంచే ప్రతి పాదన చేసిన ప్రభుత్వం వేతన జీవుల్ని విస్మరించడం నిరాశాజనకం. ఎన్నో ఆశలతో బడ్జెట్‌ కోసం ఎదురుచూసిన సామాన్యుడికి మొండిచెయ్యి చూపించడం విశేషం.

భారత ఆర్ధిక రంగానికి వేతన జీవుడే ఆధారం అని చెప్తూనే వారికి ఎలాంటి ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటించక పోవడం ఎంతో శోచనీయం.

వేతన జీవులకు 40వేల స్టాండర్డ్‌ డిడక్షన్‌ అనే కొత్త పదప్రయోగం చేస్తూ వారికి ప్రస్తుతం ఉండే ట్రాన్స్‌పోర్ట్‌ అల వెన్స్‌, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ను తీసేయడం కుడిచేత్తో ఇచ్చినట్టే ఇచ్చి ఎడంచేత్తో లాగేసుకోవడంలాగుందే తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూరబోదు.

వృద్ధులకు మాత్రం ఊరట లభిం చింది. వృద్ధులను గౌరవిస్తూ 50వేల వడ్డీ వరకూ రాయితీ కల్పించింది.

ఇలా మోదీ ప్రభుత్వం ఎలాంటి ఆకర్షణలకు తావివ్వకుండా ఎలక్షన్ల కదనరంగంలోకి దూసుకెళ్ళబోతున్నది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter