02 February 2018 Written by 

02-02-2018 రాశిఫలాలు

rasi 02

1Ariesమేషం

నిలబడిపోయిన సమస్యలు కొన్ని పరిష్కారమై, చేస్తున్న పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మీ వల్ల కొన్ని ఇబ్బందులు కుటుంబసభ్యులకు కలుగవచ్చును. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండి ఆశించిన ఆదాయము తగ్గుతుంది. శుభకార్య ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలలో అను కూలత ఉంది. కుటుంబసౌఖ్యం బాగున్నది.

 

2Taurusవృషభం

రావలసిన బాకీలు నిలబడిపోతాయి. ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. వ్యవహారాలలో తొందర పాటు, కటువుగా మాటలు లేకుండా చూచు కొనాలి. ఉదరకోశ సంబంధ రుగ్మతులుంటాయి. దూర ప్రయా ణాలు నిర్ణయం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల వృద్ధి, ఆదాయవృద్ధి ఉంటుంది. పనులు సానుకూలంగా సాగు తాయి. బంధు సఖ్యత బాగుంటుంది.

 

3Geminiమిధునం

డబ్బుకు ఇబ్బందులు లేకపోయినా, ఖర్చులు పెరిగి పోతాయి. రావలసిన బాకీలు, కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. గృహ వస్తు వాహన రిపేర్ల ఖర్చు లుంటాయి. స్థిరాస్తుల లావాదేవీలను వాయిదా వేసు కొనడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు దృష్టి పెట్టండి ప్రయత్నాల మీద. సాంస్కృతిక సేవా కార్యక్ర మాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.

 

4Cancerకర్కాటకం

వృత్తి జీవనం కలవారికి ఆదాయవృద్ధి, వ్యాపార వర్గాలకు కొత్త ఆర్ధికావకాశాలు లభిస్తాయి. పెండింగ్‌లోని సమస్యలు పరిష్కారానికి రాగలవు. స్థిరాస్తుల లావాదేవీలు జరుపుతారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, పనిభార ముంటుంది. బిడ్డలకు ఉద్యోగావకాశాలు దొరకడం, శుభకార్యాలు నిర్ణయం కావడం జరుగుతుంది. నిత్య కృత్యాలైన పనులు టెన్షన్‌ పెడతాయి.

 

5Leoసింహం

వృత్తి వ్యాపార రంగాలు సామాన్యంగా జరుగు తాయి. పెద్ద అభివృద్ధి ఉండదు. అయితే డబ్బుకు ఇబ్బందులుండవు. బంధువర్గంతోను, మిత్రులతోను మనస్ఫర్ధలు రాకుండా చూచుకొనాలి. వ్యవహారాలలో మీ సమర్ధతకు గుర్తింపు ఆలస్యం కాగలదు. కొన్ని అదనపు ఖర్చులుంటాయి. ప్రభుత్వ అనుమతులు ఆలస్యం కాగలవు. విద్యావృద్ధి బాగున్నది.

 

6Virgoకన్య

ఆలోచనలు కార్యరూపం దాల్చి బంధుమిత్రుల సహకారం బాగుంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడి మీకు మేలు జరుగుతుంది. ఆర్ధికంగా బాగుండి పెట్టు బడికి అవకాశాలు, కొత్త వ్యాపారావకాశాలుండగలవు. వృత్తులలో గుర్తింపు గౌరవాలు బాగుంటాయి. రావలసిన బాకీలు లభించగలవు. నిలబడిపోయిన సమస్యలు, ఇబ్బందులు సర్దుబాటు కాగలవు.

 

7Libraతుల

ఆర్ధికంగా స్థిమితపడగలరు. వ్యాపార రంగంలో గాని, వృత్తిపరంగాగాని ముందంజ వేస్తారు. రావలసిన బాకీలు కొంతవరకు అందుతాయి. ముఖ్యఅవసరాలు జరిగిపోతూ మానసిక ఆనందం పొందుతారు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఉద్యోగులు బాధ్యతల నిర్వ హణలో సంతృప్తి చెందుతారు. అనుకున్న పనులు కొద్ది టెన్షన్‌ పెట్టినా అనుకూలంగా జరుగుతాయి.

 

8Scorpioవృశ్చికం

తొందరపాటు నిర్ణయాలు, చర్యలు తగ్గించు కొనండి. బంధుమిత్రులకు సహాయ పడతారు. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇవ్వగలదు. అదనంగా ఖర్చులు పైనబడినా ఇబ్బందులుండవు. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక ప్రగతి బాగుండి ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో కొద్దిపాటి అభిప్రాయభేదాలుండి సర్దుబాటు కాగలవు. విద్యార్థులు మరింత కృషి చేయాలి.

 

9Sagittariusధనుస్సు

వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఇంట బయట వ్యవహారాలలోను, ఆర్ధిక వ్యవహారాల లోను విశ్రాంతి లేక బిజీగా ఉంటారు. బిడ్డలకు అనా రోగ్య బాధలుంటాయి. శుభకార్య ప్రయత్నాలలో ముమ్మ రంగా ఉంటారు. పనులు నెరవేరడానికి బాగా శ్రమ పడవలెను. అనవసర విషయాలను వదలివేయండి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది.

 

10Capricornమకరం

చేపట్టిన పనుల వల్ల బాగా టెన్షన్‌ పడతారు. పనులు నిదానంగా జరుగుతాయి. ఆర్ధికంగా బాగుండి, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. కుటుంబసభ్యులకు అనారోగ్య బాధలుంటాయి. అత్యవసర ప్రయాణాలుం టాయి. ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో సంతృప్తి ఉం టుంది. సహచరులతో, క్రింది ఉద్యోగులతో జాగ్రత్తగా మెలగాలి. ఆత్మీయులను కలుసుకొంటారు.

 

11Aquariusకుంభం

వృత్తి వ్యాపార రంగములందు సామాన్య ప్రగతి ఆదాయము ఉంటుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. బంధువర్గం నుండి అనారోగ్య వార్తలు విం టారు. పెండింగ్‌లోనున్న వ్యవహారాలలో మార్పుండదు. అవసరాలకు డబ్బు, రావలసిన బాకీలు కొంత అందు తాయి. ఉద్యోగులు తమ అధికారులతో, జనంతో జాగ్ర త్తగా మెలగండి. ఖర్చులు కొంత అదనం కాగలవు.

 

12Piscesమీనం

ఏ పనులనైనా ముందుచూపుతో, ప్రణాళికాబద్ధంగా జరుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత బాగుంటుంది. ఆర్ధికస్థితి బాగుండి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఆదాయం బాగుంటుంది. ఉద్యోగులకు బాధ్య తలు ఎక్కువై, గృహ వస్తువాహన రిపేర్లుంటాయి. శుభ కార్య ప్రయత్నాలు ఫలించగలవు. కొత్త పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు అనుకూలమైన కాలం.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
  నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…
 • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
  ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…

Newsletter