09 February 2018 Written by 

ఎవరెవరెక్కడ?

nlr ycpరాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు లోక్‌సభ స్థానాలతో పాటు పది అసెంబ్లీలో ఏడింటిని వైకాపాకే కట్టబెట్టారు.

అప్పటికీ ఇప్పటికీ ట్రెండ్‌ మారలేదు. 2014ఎన్నికల తర్వాత పలువురు నాయకులు తెలుగుదేశంలో చేరారు. కాని, వారి వెంట కార్యకర్తలు, ప్రజలు పోలేదు. 2014తో పోలిస్తే జిల్లాలో వైకాపా ఇంకా బలం పుంజుకుందనే చెప్పవచ్చు. కాకపోతే నియో జకవర్గాల విషయంలో క్లారిటీ రావాల్సివుంది. ముఖ్యంగా నెల్లూరు లోక్‌సభ స్థానానికి ఈసారి అభ్యర్థిని మార్చాలి. ప్రస్తుత ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిపై వ్యతిరేకత వుంది. కొత్త అభ్యర్థిని రంగంలోకి దించడం అన్ని విధాలా బెటర్‌. ఈ దిశగా ఇప్పటినుండే కొత్త అభ్యర్థిపై దృష్టిని సారించాల్సివుంది. ఎంపీ అభ్యర్థివల్ల 7అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు ఓట్ల పరంగా ప్రయోజనం కలిగేలా ఉండాలి.

ఇక వెంకటగిరి నుండి గత ఎన్నికల్లో పోటీ చేసిన కొమ్మి లక్ష్మయ్యనాయుడు పార్టీకి దూరంగా వుంటున్నాడు. జడ్పీ ఛైర్మెన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డే ఇక్కడ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కూడా లైన్లో ఉన్నాడు. ఆయన పార్టీలోకి వస్తే మళ్ళీ ఇక్కడ సమీకరణలు మారే అవ కాశం ఉంది. అలాగే టీడీపీలో వున్న మరో ముఖ్యనేత పేరు కూడా వినిపిస్తుంది. అందువల్ల ప్రస్తుతానికి ఇక్కడ సీటు ఎవరిదన్న స్పష్టత రావాల్సివుంది. సర్వేల ద్వారా ఇక్కడ ఎవరు గట్టిఅభ్యర్థి అన్నది తేల్చు కోవాలి. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌ కుమార్‌ తెలుగుదేశంలో చేరడం తెలిసిందే! తర్వాత మేరిగ మురళీధర్‌ను గూడూరు ఇన్‌ఛార్జ్‌గా పెట్టారు. అయితే మురళీధర్‌ ఇక్కడ తట్టుకుని నిలవడం కష్టం. మేకపాటి వాళ్ళు మాత్రం మేరిగ మురళీకే సీటివ్వా లన్నట్లు మాట్లాడుతున్నారు. కాని అతను సరిపోడనిపిస్తోంది. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం కాంగ్రెస్‌లో వున్న ఓ నాయకుడి పేరు గట్టిగా వినిపిస్తోంది. అతనైతేనే గట్టిపోటీ ఇవ్వగలడని ప్రచారం ఉంది. కాబట్టి గూడూరు అభ్యర్థి ఎవరన్నది కూడా తేలాల్సివుంది. నెల్లూరు నగరం, రూరల్‌, సర్వేపల్లి నియోజకవర్గాలు మళ్ళీ సిటింగ్‌ ఎమ్మెల్యేలకే దక్కుతాయి. ఇందులో సందేహం లేదు. కావలి సీటు విషయంలో మాత్రం సిటింగ్‌ ఎమ్మెల్యే ప్రతాప్‌కు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డికి మధ్య కొట్లాట జరుగుతోంది. గతంలో కావలిలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో ఈసారి కూడా సీటు ప్రతాప్‌కే అని చెప్పి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వివాదాలకు ఆజ్యం పోశాడు. ఈసారి కావలి సీటు నాశిస్తున్న మాజీఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణు వర్ధన్‌రెడ్డి అప్పుడే ఎంపీపై మండిపడటం తెలిసిందే! కావలిలో ఎవరు కరెక్టో సర్వే నిర్వహించాకే అభ్యర్థిని తేల్చాలని విష్ణు పట్టుబట్టాడు కూడా! ఈ విషయం తేల్చ లేదని చెప్పే జిల్లాలో జగన్‌ పాదయాత్రకు కూడా విష్ణు దూరంగా ఉండిపోయాడు. అలాగే మరో మాజీఎమ్మెల్యే వంటేరు వేణుగోపాలరెడ్డి సీటు విషయమై గట్టిగా పట్టుబట్టనప్పటికీ అతని మద్దతు కూడా కీలకం కానుంది. కాబట్టి ఇక్కడ ముగ్గురి మధ్య సమన్వయం కుదరాల్సివుంది. అభ్యర్థి ఎవరైనా మిగతావాళ్ళు మద్దతుగా పనిచేస్తేనే ఇక్కడ పార్టీ విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. కోవూరు ప్రసన్నకే

ఉండొచ్చన్న ధీమా ఉన్నప్పటికీ, ఇక్కడ కూడా అభ్యర్థిని మార్చి ప్రసన్నకు 2019 తరువాత ఎం.ఎల్‌.సి ఇవ్వాలనే ఆలో చనలో పార్టీ వున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ నిలబడగలిగే అభ్యర్థి ఖచ్చితంగా తెలుగుదేశం నుండి రాబోయేవాడే కాబట్టి అది ఎవరన్నది తేలాల్సివుంది. ఆత్మకూరు, ఉదయగిరి సీట్లలో మేకపాటి కుటుంబ సభ్యులే పోటీ చేస్తారా లేక నేతల మార్పిడి ప్రక్రియలో ఒక సీటును ఉంచుకుని ఇంకొ కటి వేరేవాళ్ళకు కేటాయిస్తారా అన్నది చూడాలి. ఉదయగిరి నుండి వాళ్ళు పోటీ చేసి ఆత్మకూరుకు అప్పటికి గట్టి అభ్యర్థి దొరికితే పోటీకి దించే ఆలోచనలు కూడా వున్నాయి. అన్ని నియోజకవర్గాలలో అభ్యర్థుల విషయమై క్లారిటీ వస్తే ప్రజల్లోకి వెళ్ళడానికి, పరపతి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.

అంతిమ నిర్ణయం జగన్మోహన్‌రెడ్డిదే అయినా ప్రస్తుతం ఇన్‌ఛార్జ్‌గా వ్యవహ రిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కూడా ఇక్కడ కీలకమే. అయితే రామకృష్ణారెడ్డికి నెల్లూరుజిల్లాపై పెద్దగా అవగాహన లేదు. నేరుగా పైస్థాయి నాయకులతో ఆయన మాట్లాడుతున్నాడు తప్ప సామాన్యులతో ఆయన మాట్లాడే అవకాశమే లేదు. నేత లతో తప్ప జిల్లాలో ఎవరితోనూ ఆయ నకు పెద్దగా పరిచయాలు కూడా లేవు. వై.యస్‌.రాజశేఖరరెడ్డి హయాం నుండి జిల్లా గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా వై.వి.సుబ్బారెడ్డికి పేరుంది. అయితే ఆయనను తొలగించి జిల్లాతో పూర్తిగా పరిచయాలు, అవగాహన లేని వ్యక్తిని నెల్లూరుజిల్లా ఇన్‌ఛార్జ్‌గా పెట్టడం కూడా ప్రస్తుత నాయక గణానికి చాలామందికి ఇష్టం లేదు. తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల నుండి వలసవీరులు రెడీగా వున్నారు. సమన్వయ లోపం లేకుండా వాళ్ళందరినీ పార్టీలోకి ఆహ్వానించి ఎవరిని ఎక్కడ వాడుకోవాలో తెలిసిన ఇన్‌ఛార్జ్‌ ఇప్పుడు నెల్లూరుజిల్లాకి చాలా అవసరం.

ఏదేమైనా రాబోయే ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఒకటికి పదిసార్లు అవపాసన పట్టి, అవగాహన చేసుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
  ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…
 • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
  నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…

Newsletter