09 February 2018 Written by 

టీడీపీ నుండి... లోక్‌సభకెవరో?

nlr mp1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక అప్పటి నుండి ఇప్పటివరకు నెల్లూరు లోక్‌సభకు 10సార్లు ఎన్నికలు జరిగాయి, 2012లో జరిగిన ఉపఎన్నికను కూడా కలుపుకుంటే! ఈ పదిసార్లలో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండంటే రెండుసార్లే! ఏ లోక్‌సభ స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఇంత వరెస్ట్‌ రికార్డ్‌ ఉండదేమో! 1984లో తెలుగుదేశం అభ్యర్థిగా పుచ్చలపల్లి పెంచలయ్య గెలవగా, 1999లో వాజ్‌పేయి సానుభూతి గాలిలో ఉక్కాల రాజేశ్వరమ్మ గెలిచారు. నెల్లూరు లోక్‌సభ టీడీపీకి ఈ రెండే విజయాలు. 1989, 1992, 1996, 1998, 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ నుండి కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించగా 2012 ఉపఎన్నికల్లోనూ, 2014 ఎన్నికలలోనూ వైసిపి అభ్యర్థి గెలవడం తెలిసిందే!

నెల్లూరు లోక్‌సభను గెలవడం అనేది తెలుగుదేశంకు ఒక పెద్ద పజిల్‌గా మారింది. అప్పటికీ 2014 ఎన్నికల్లో గట్టి అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డినే రంగంలోకి దించారు. ఆయన బాగానే ఓట్లు చీల్చాడు. సిటింగ్‌ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీదున్న వ్యతిరేకత వల్ల ఆదాలకు ఓట్లు పెరిగాయి. అయితే ఈ జిల్లాలో వై.యస్‌. అనుకూల పవనాలు మేకపాటిని కొద్దిపాటి మెజార్టీతో గట్టెక్కించాయి.

రాబోయే ఎన్నికల్లో వైకాపా నుండి లోక్‌సభకు సిటింగ్‌ ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డే బరిలోకి దిగుతాడా? లేక కొత్తవాళ్లెవరైనా దిగనున్నారా? అన్నది ఇంకా తేల్లేదు. అదే సమయంలో తెలుగుదేశం అభ్యర్థి ఎవరన్న ప్రశ్న కూడా వుంది. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.

ఈసారి లోక్‌సభ పోటీ అంటే ఎన్ని కోట్లు ఖర్చో ఊహించవచ్చు. టీడీపీలో దీనికి సై అనే నాయకులెవరు? ఆదాల పోటీ చేయకుంటే బీద మస్తాన్‌రావు పేరు తెరపైకి రావచ్చు. చంద్రబాబు ఆదేశిస్తే నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు కూడా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. అయితే నెల్లూరు లోక్‌సభ అంటే డబ్బు ఖర్చే కాదు... గెలుపు కూడా గ్యారంటీ వుండదు. 2014 ఎన్నికల్లో కనీసం మేకపాటి మీద వ్యతిరేకతన్నా వుండింది. ఈసారి ఆ ప్రభావం కంటే కూడా ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావమే ఎక్కువుగా ఉండబోతోంది. కాబట్టి నెల్లూరు లోక్‌సభ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం అంటే పెద్ద సాహసం చెయ్యడమే!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నారాయణను వదలని అనిల్‌
    మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
  • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
    వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • వైసిపి వైపు నేతల చూపు
    నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter