Print this page
Friday, 09 February 2018 11:01

నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!

Written by 
Rate this item
(0 votes)

policeఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు, నక్సలిజం లేదు... రాజకీయ నాయకుల యాక్షన్‌ తప్పితే ఫ్యాక్షన్‌ లేదు. పోలీసు శాఖపై అంతపెద్ద రాజకీయ ఒత్తిళ్లు కూడా ఏమీ వుండవు. పద్ధతిగా వుంటే చాలా ప్రశాంతంగా పనిచేసుకునిపోవచ్చు.

అయితే ఇప్పుడు నెల్లూరుజిల్లాలో పోస్టింగ్‌ అంటే పోలీసు అధికారులు భయపడుతున్నారు. జిల్లా ఎస్పీ రామకృష్ణ పనిష్మెంట్ల దెబ్బకు డిఎస్పీలు, సి.ఐలు కూడా హడలిపోతున్నారు. డిపార్ట్‌మెంట్‌లో అవినీతి ఆరోపణలు, వివాదాలు వచ్చిన ఏ ఒక్క ఆఫీసర్‌ను కూడా ఆయన వదిలిపెట్టడం లేదు. జిల్లాకు వచ్చీరాగానే ఇద్దరు డిఎస్పీల మీద చర్యలు తీసుకున్నారు. ఇక సి.ఐలు, ఎస్‌.ఐలు, సిబ్బంది అయితే లెక్కేలేదు. ఏ సి.ఐ లేదా ఎస్‌.ఐ తప్పు చేసాడని తెలిసినా వెనువెంటనే చర్యలు చేపడుతున్నారు. పద్ధతిగా పనిచేసేవాళ్ళకు ఏ సమస్యా లేదు. కాని, పోలీసు శాఖలో నూటికి నూరుశాతం పద్ధతిగా పనిచేయడం కష్టమే! ఎస్పీ రామకృష్ణ ఆలోచనా తీరుకు తగ్గట్లుగా పనిచేయలేమని, వస్తే తమకూ పనిష్మెంట్‌ తప్పదనే ఉద్దేశ్యంతో చాలామంది అధికారులు నెల్లూరుకు రావడానికి జంకుతున్నారని తెలుస్తోంది.

Read 745 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

Latest from Lawyer

Related items