16 February 2018 Written by 

చంద్రుడి డైరక్షన్ లో పవన్ యాక్షన్ థ్రిల్లర్ జె.ఏ.సి

pkరాష్ట్ర రాజకీయాలలో చంద్ర బాబుకు అవసరమైనప్పుడు మాత్రమే తెరమీదకొస్తాడని పేరున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ స్క్రీన్‌ప్లేతో తెరమీద కొచ్చాడు. దీనిపేరు జాయింట్‌ యాక్షన్‌ కమిటి! తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీల పాత్రేమిటో చూసాం. తెలం గాణ జేఏసీ నాయకుడు కోదండరామ్‌ రాష్ట్రసాధన లక్ష్యంగా పోరాడితే సమై క్యాంధ్ర జేఏసీ నాయకుడు అశోక్‌బాబు ఉద్యమాన్నే తాకట్టుపెట్టడం చూసాం.

ప్రత్యేకహోదా కోసం, విభజన హామీల అమలు కోసం జేఏసీని ఏర్పాటు చేసినట్లు పవన్‌ కళ్యాణ్‌ చెబుతున్నారు. జేఏసీ కోసం పార్టీనిపెట్టి ఇక రాజకీయా లలో పోరాడలేనని చేతులెత్తేసిన జయ ప్రకాశ్‌ నారాయణను, మాజీఎంపీ, రాష్ట్రంలోని అన్ని సమస్యలపై మంచి అవగాహన వున్న నాయకుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌లను సంప్రదించాడు. ఇద్దరూ మేధావులే! ప్రజాసమస్యల పట్ల అవగాహన, వాటిని పరిష్కరించాలన్న తపన ఉన్నవాళ్లే! అయితే రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడడానికంటూ పవన్‌కళ్యాణ్‌ ఏర్పాటు చేసిన జేఏసీలో వీరు భాగస్వాములు కావడమే ఆశ్చర్యం కలిగించే విషయం.

పవన్‌కళ్యాణ్‌కు సినిమాలలో వేర్వేరు డైరక్టర్లు వుంటారు. కాని, రాజకీయాల వద్దకొచ్చేసరికి ఆయనకున్న ఏకైక డైరక్టర్‌ చంద్రబాబే! 2014 ఎన్నికల నుండి ఇప్పటిదాకా కూడా చంద్రబాబు చెప్పినట్లే ఆయన వింటూ వచ్చాడు. చంద్రబాబు రమ్మన్నప్పుడల్లా పవన్‌ బయటకొచ్చాడు. ఆయన చెప్పిన చోటల్లా సభలు, రాజకీయ యాత్రలు చేశాడు.

పవన్‌ జేఏసీని పెట్టి ఇప్పుడు చించేస్తాను, ఆరేస్తాను అంటున్నాడు. నాలుగేళ్ళుగా రాష్ట్ర ప్రజలకు అటు కేంద్రం, ఇటు తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయాల మీద అన్యాయాలు చేస్తుంటే ఈ పవన్‌ ఏం పీకాడు. రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కుంటుంటే, దళితులపై దాడులు జరుగుతుంటే, ప్రభుత్వ ఉద్యోగులనే అధికార పార్టీ నాయకులు జుట్టుపట్టి ఊడ్చి కొడుతుంటే ఈ పవన్‌కళ్యాణ్‌ ఎక్కడికి పోయాడు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒక్కసారైనా ప్రశ్నించాడా? పోనీ ప్రత్యేకహోదా కోసం కేంద్రంతో నైనా గట్టిగా పోరాడాడా?

ఇతను చంద్రబాబు స్క్రిప్ట్‌ తయారుచేస్తే స్క్రీన్‌ మీదకొస్తాడు. ఆయన డైరక్షన్‌లోనే యాక్షన్‌ చేస్తాడు. ఇక నీ యాక్షన్‌ చాలు అనగానే వెళ్ళిపోతాడు. ఇంతవరకు కామన్‌మెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అని పెట్టి ఏం పీకాడు... ఆ తర్వాత జనసేనను స్థాపించి ఏం వెలగబెట్టాడు. రేపు జేఏసీ కూడా అంతే! జేఏసీ అతని బుర్రలో నుండి వచ్చిన ఆలోచనకాదు. ప్రత్యేకహోదా విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే వారందరినీ పవన్‌ వైపు డైవర్ట్‌ చేయడం కోసం చంద్రబాబు వ్రాసిన నాటకమే జేఏసీ. పవన్‌ను నమ్ముకుని జేఏసీ పేరుతో రోడ్ల మీదకు రావడమంటే దేనినో పట్టుకుని గోదారిని ఈదడమే. మేధావులు కూడా ఆలోచించుకోవాలి.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter