16 February 2018 Written by 

తెరపైకి.. మళ్ళీ రామాయపట్నం!

ramayapatnamవిభజన హామీలు అమలు చేయాలంటూ రాష్ట్రంలో ఆందోళనలు తీవ్రతరమవుతున్న తరుణంలో రామాయపట్నం పోర్టు అంశం మళ్ళీ తెరమీదకొచ్చింది. విభజన హామీలలో నెల్లూరు జిల్లా వాకాడు మండలంలోని దుగరాజపట్నం పోర్టు ఒకటి. యూపిఏ ప్రభుత్వం చివరి ఘడియల్లో ఈ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయించాలని అప్పటి తిరుపతి ఎంపీ చింతా మోహన్‌ తీవ్రంగా ప్రయత్నించాడు. అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత రక్షణ పరంగా 'ఇస్రో' అభ్యంతరాలు, పులికాట్‌ సరస్సు పర్యావరణానికి ముప్పు రావచ్చనే నివేదికలతో ఈ పోర్టు నిర్మాణంపై అనుమానాలు కమ్ముకున్నాయి. ఒక దశలో భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టి కూడా నిలిపేసారు.

మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో విభజన హామీలను నెరవేర్చలేదన్న అంశం రగులుకొంది. వీటిలో దుగరాజపట్నం పోర్టు కూడా వుంది. అయితే దుగరాజపట్నం వద్ద పోర్టు నిర్మాణంపై అభ్యంతరాలున్నాయని, ప్రత్యామ్నాయ పోర్టును పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పడంతో ఇప్పుడు రామాయపట్నం మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. ప్రకాశం, నెల్లూరుజిల్లాల సరిహద్దులో వున్న రామాయపట్నం వద్ద పోర్టు నిర్మించాలని కావలి ప్రాంత నాయకులు, అలాగే, ఒంగోలు ఎంపి వై.వి.సుబ్బారెడ్డి గతంలోనూ ఆందోళనలు చేసి వున్నారు. కావలి నుండి రామాయపట్నం వరకు పాదయాత్రలు కూడా చేశారు. అప్పటి కేంద్రమంత్రి, ఇప్పటి ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు దృష్టికి కూడా రామాయ పట్నం అంశాన్ని తీసుకెళ్లారు. దుగరాజపట్నం పోర్టుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని కేంద్రమే ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు రామాయపట్నంపై ఆశలు మొలకెత్తుతున్నాయి.

రామాయపట్నం పోర్టు వస్తే జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన కావలి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పారిశ్రామికాభివృద్ధి అంతా కూడా నెల్లూరుకు దక్షిణం వైపునే కేంద్రీకృతమైంది. నెల్లూరుకు ఉత్తరాన ఇఫ్కో సెజ్‌ పెట్టినా అది సక్సెస్‌ కాలేదు. ఇప్పుడిప్పుడే అక్కడి సెజ్‌లో పరిశ్రమలు వస్తున్నాయి. ఇక దగదర్తి వద్ద ఎయిర్‌పోర్టు మంజూరు కావడం తెలిసిందే! దీనికి తగ్గట్లుగా రామాయపట్నం పోర్టు కూడా వస్తే నెల్లూరు - కావలిల మధ్య వడివడిగా అభివృద్ధి అడుగులు పడతాయని ఈ ప్రాంతవాసుల ఆశ!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • పేటలో పోటీకెవరు?
  జిల్లాలో తెలుగుదేశంపార్టీకి గట్టి నియోజకవర్గాలలో సూళ్ళూరుపేట ఒకటి. ఇది ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం అయినప్పటికి ఇంతకాలంగా వేనాటి సోదరులే ఇక్కడ పార్టీని నడుపుతూ వచ్చారు. అభ్యర్థులను నిర్ణయిస్తూ, గెలిపిస్తూ వచ్చారు. తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటివరకు 8సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, 5సార్లు…
 • జగన్‌ జోరు.. బాబు బేజారు
  'మన్మధుడు' సినిమాలో సీన్‌ ఇది... బ్రహ్మానందం ఇంటికి నాగార్జున, సోనాలిబింద్రే వస్తారు. అక్కడ బ్రహ్మానందం భార్యగా ఒక నల్లజాతి మహిళ ఉండడాన్ని చూసి మీది లవ్‌ మ్యారేజీనా అని నాగార్జున అడుగుతాడు. దానికి బ్రహ్మానందం... ముందు ఆమె నన్ను ప్రేమించింది... తర్వాత…
 • ఈ నరకం ఇంకెన్నాళ్ళు
  ''ఈ నగరానికి ఏమైంది... ఓ పక్క మసి... మరోపక్క పొగ... నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం''... థియేటర్లలో గాని, టీవీలలో గాని సినిమా ప్రదర్శనకు ముందు వచ్చే ప్రకటన ఇది. ఇప్పుడు నెల్లూరు పరిస్థితి కూడా అలాగే వుంది. ఓ…
 • రాజకీయ ప్రయాణంలో... ఇది తొలి సంతకం
  ఇప్పటికే నెల్లూరు కేంద్రంగా నెల్లూరుజిల్లాలోనే కాక రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆథ్యాత్మిక, మానవీయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన సుల్లో సేవాస్వాప్నికుడిగా ముద్రపడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి... తన జీవితంలో మరో సేవా ప్రయాణానికి తొలి సంతకం చేసారు. ఇంతదాకా…
 • వణికిస్తున్న సైకో
  ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు…

Newsletter