Friday, 16 February 2018 08:26

అజీజా... నిన్నొదలా...!

Written by 
Rate this item
(0 votes)

azizనెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత నాలుగేళ్ల కాలంలో 9మంది కమిషనర్లు మారారు. ఇక సొంత పార్టీ కార్పొరేటర్లతోనూ వివాదాలే. అధికార పార్టీ నాయకులందరితోనూ విభేదాలే!

ఇంతకాలం రాజకీయ వివాదాలే తెరకెక్కుతూ వచ్చాయి. ఇప్పుడు వ్యాపార పరమైన వివాదాలు కూడా ఆయనను చుట్టుముడుతున్నాయి. ఇటీవల చెన్నైకు చెందిన ప్రసాద్‌ జెంపెక్స్‌ అనే కంపెనీ అజీజ్‌పైన, ఆయన కుటుంబసభ్యులపైన కేసు పెట్టడం తెలిసిందే! స్టార్‌ ఆగ్రోకు తామిచ్చిన 42కోట్ల రూపాయలను తమ వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్ళించు కున్నారంటూ జెంపెక్స్‌ కంపెనీ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు కావడం, ఈ సంఘటన జిల్లాలో అలజడి రేపడం తెలిసిందే! తాజాగా యూనియన్‌ బ్యాంక్‌ ఇండియా వాళ్లు కూడా స్టార్‌ ఆగ్రోపై ఫిర్యాదు చేశారు. స్టార్‌ ఆగ్రోకు అజీజ్‌కు సంబంధం లేదంటూ వాళ్ళ తమ్ముడు, కార్పొరేటర్‌ జలీల్‌ మీడియా ముందుకొచ్చాడు. మరి యూనియన్‌ బ్యాంకు వాళ్ళయినా, జింపెక్స్‌ కంపెనీ వాళ్లయినా డబ్బులు కట్టింది, లోన్‌లు ఇచ్చింది అజీజ్‌తో జరిపిన లావాదేవీలవల్లనా? లేక ఆయనకు సంబంధం లేకుండానే ఇన్నేసి కోట్లు లోన్లు ఇచ్చారా? ఎవరు అబద్ధం చెబుతున్నట్లు? ఎవరు నిజాయితీగా వున్నట్లు? త్వరలో తేలకుండాపోతుందా?

Read 699 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter