Friday, 16 February 2018 08:45

టీడీపీ ఎంపీల దెబ్బకు వణికిన మోడీ

Written by 
Rate this item
(0 votes)

galpikaఅది ఢిల్లీలోని పార్లమెంటు భవనం. పార్లమెంటు బయట తెలుగుదేశం ఎంపీలు మాగంటి బాబు, తోట నర సింహం, గల్లా జయదేవ్‌, మురళీమోహన్‌, కేశినేని నాని, సుజనాచౌదరి, సీఎం రమేష్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు, గరికపాటి మోహన్‌రావు తదితరులు న్నారు. అందరి చేతుల్లోనూ 'ఆంధ్రాకు న్యాయం చేయండి' అంటూ తెలుగులో వ్రాసిన ప్లకార్డ్స్‌ వున్నాయి. అప్పుడే చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ వచ్చాడు. ఒంటిమీద చొక్కాలేదు. గోచీకట్టి చేతిలో కొరడా పెట్టుకుని పెద్దగా కేకలు పెడుతూ ఒళ్ళు వాతలు తేలేలా కొట్టుకోసాగాడు. తర్వాత రెండు పోల్స్‌ను రోడ్డుపై నిలబెట్టి వాటి మధ్య తాడు కట్టారు. శివప్రసాద్‌ ఆ తాడు మీద బ్యాలెన్స్‌ చేస్తూ నడిచాడు. ఈ ఫీట్‌లను చూస్తూ దారిన పోయే జనాలు ఎక్కడికక్కడ ఆగిపోయారు. తర్వాత ఆయన నిటారుగా నిలబెట్టిన కర్రపై పద్మాసనం వేసుకుని కొద్దిసేపు కూర్చున్నాడు. ఈ ఫీట్లన్నీ బ్రతుకుతెరువు కోసం పడుతున్న పాట్లేమోననుకున్న జనాలు తలో పదిరూపాయలు అక్కడ ధర్మం కింద వేసేసి పోసాగారు. అది చూసి తోట నరసింహం... ఓ శివప్రసా దన్నా, ఇక్కడ మనం బడ్జెట్‌లో ఆంధ్రాకు జరిగిన అన్యాయం మీద పోరాటం చేస్తున్నామని ఎవరూ అనుకోవడం లేదు. ఏదో సాపాటు కోసం చేస్తున్న ఫీట్లు అనుకుంటున్నారు. మనల్ని అడుక్కునే వాళ్ళు మాదిరిగా చూస్తున్నారు. ఈ పోరాడేదేదో పార్లమెంట్‌ హాల్‌లోకి వెళ్ళి పోరాడుదాం రండి... ఆ మోడీని, జైట్లీని నిలువునా కడిగేద్దాం పదండీ అని అన్నాడు. అప్పుడు సుజనాచౌదరి.... ఆ అంటావ్‌... నీదేం పోయింది. పార్ల మెంటు లోపల మోడీని గట్టిగా మాట్లా డితే ఆ తర్వాత ఎఫెక్ట్‌ వుండేది మా మీదే అని అన్నాడు. దానికి ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక, కొత్తపల్లి గీతలు కూడా... అవును మీదేం పోదు... పార్టీ ఫిరాయిం చారని చెప్పి ముందు మా మీదే వేటు వేస్తారని తమ బాధ చెప్పుకున్నారు. అప్పుడు సీఎం రమేష్‌... పార్లమెంటు లోపల పోరాడాలంటే మోడీ భయం... అలాగని పోరాడకపోతే ఆంధ్రా ప్రజలు ఛీ కొడుతారు... ఎలా చేయాలబ్బా... ఈ సమస్యకు హైటెక్‌ మేధావి చంద్ర బాబునాయుడే పరిష్కారం చూపగలడు అనుకుంటూ ఆయనకు ఫోన్‌ చేసాడు. చంద్రబాబు ఫోన్‌లోనే ఏదో ఐడియా చెప్పాడు. అది విని సీఎం రమేష్‌ సంతో షంగా ఫోన్‌ పెట్టేసాడు.

-------

పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌... ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా, రాహుల్‌, ఇంకా కేంద్రమంత్రులు, పలువురు ఎంపీలు వచ్చి కూర్చున్నారు. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వచ్చి తన స్థానంలో కూర్చున్నారు. వైసిపితో సహా ఇతర పార్టీల ఎంపీలెవరూ సభలో లేరు. సభ మొద లైంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ లేచాడు. అధ్యక్షా, ఏమనుకుంటున్నారు మా చంద్రబాబు నాయుడు గారి గురించి... మౌనంగా ఉంటున్నాడు కదా అని ముని అనుకుంటున్నారా? ఓటు- నోటు కేసులో బుక్కయ్యాడు, ఏం చేయ లేడు అనుకుంటున్నారా? అగ్ని పర్వతం బద్ధలైనా, చంద్రబాబు ఆవేశం కట్టలు తెంచుకున్నా మీరు నిలవలేరు. చంద్ర బాబు మూడోకన్ను తెరవక ముందే మేలుకోండి... ఆంధ్రా పట్ల మీరు చేసిన తప్పును తెలుసుకుని వెంటనే న్యాయం చేయండి అని గద్దించాడు. గల్లా జయ దేవ్‌ హెచ్చరికలతో మోడీ, జైట్లీలు బిక్క మొహం వేశారు. వారి రెండు చేతులు బిగుసుకుపోయి వణికిపోసాగాయి. వెంటనే సుజనాచౌదరి లేచాడు. ఏం తమాషాలు చేస్తున్నారా? చేతులకు గాజులు తొడుక్కున్నామనుకుంటున్నారా? మీరు కుక్కలకు బిస్కెట్లు వేసినట్లు మాకు నిధులిస్తే మేం తోక ఊపుకుంటూ తీసు కోవాల్నా? మీ ఆటలు, మీ డ్రామాలు ఇక కట్టిపెట్టండి. మా చంద్రబాబు నాయుడు తలచుకుంటే ఇప్పటికిప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వం కూలిపోతుంది. ఇంతకాలం మీరెంతగా అవమానించినా సహించాం... ఇక సమరం తప్ప, సహనం లేదు. ఇప్పటికైనా మీరు చేసిన తప్పును సరిదిద్దుకో లేదో 'ఖబడ్దార్‌' అంటూ గట్టిగా తొడ చరిచాడు. ఆ సౌండ్‌కు భయపడి మోడీ ఒక్క క్షణం గుండెను గట్టిగా పట్టుకున్నాడు. తర్వాత ఎంపీ ఎన్‌.శివప్రసాద్‌ లేచి శివాలెత్తాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు మోడీ... వెళ్ళి ఆ చంద్రబాబు శరణు కోరండి... ఆయన శాంతిలో కరుణా మయుడు, దానగుణంలో దయా మయుడు... చేసిన తప్పుకు వెళ్ళి ఆయ నను క్షమాపణ కోరండి... లేదో భూమి ఆకాశాలు బద్ధలవుతాయి అని హెచ్చ రించాడు. వారి హెచ్చరికలతో జడిసి మోడీ, జైట్లీలు తమ స్థానాలలో నుండి లేచి సుజనాచౌదరి దగ్గరకు వెళ్ళారు. ఆయన చేతులు పట్టుకుని... చౌదరి గారు... ఇప్పటిదాకా తెలిసో తెలియకో తప్పులు చేసాం... మా తప్పు తెలుసు కున్నాం. మీకు న్యాయం చేస్తాం... దయ చేసి చంద్రబాబు గారిని మూడోకన్ను తెరవొద్దని చెప్పండి. ప్లీజ్‌... ప్లీజ్‌.... ప్లీజ్‌... అని వేడుకోసాగారు.

అప్పుడే సరిగ్గా కట్‌ కట్‌ కట్‌ అంటూ దర్శకుడు రాజమౌళి వచ్చాడు. అక్కడ ఆయనతో పాటు చంద్రబాబు, లోకేష్‌, మంత్రులు సోమిరెడ్డి, నారాయణ, పత్తిపాటి పుల్లారావులు కూడా వున్నారు. చంద్రబాబుతో రాజమౌళి... సార్‌, పార్ల మెంట్‌ సీను బాగానే వచ్చింది, మన ఎంపీలు కూడా బ్రహ్మాండంగా యాక్ట్‌ చేశారు. అమరావతిలో పార్లమెంటు సెట్టింగ్‌కు నాలుగు కోట్లయ్యింది. ఇక మోడీ, జైట్లీ, సోనియా, రాహుల్‌ పాత్రల కోసం డూప్‌ యాక్టర్‌లను తెచ్చాం. వారి పోలికలకు దగ్గరగా వుండే ఆర్టిస్టులే దొరికారు. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ పాత్రధారికి పది లక్షలు, మిగతా ఆర్టిస్టు లకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు... అంతా బిల్లు 10కోట్ల దాకా కావచ్చని చెప్పాడు. అప్పుడు చంద్రబాబు... లోకేష్‌తో... సాయంత్రం ఈ సీన్‌ సి.డిలన్నింటిని ఏబిసిడి, ఎఫ్‌బి, టీవీ 10.5, టీవీ 9I9=99, కళాజ్యోతి, ఏనాడులకు పంపించు.. పార్లమెంటులో విరగదీసిన తెలుగుదేశం ఎంపీలు... అని కథనాలు రావాలి అని చెప్పాడు. లోకేష్‌ వుండి... ఈ సీన్‌లో వైకాపా ఎంపీలు లేరు కదా నాన్నారు... చూసేవాళ్ళకు అనుమానం వస్తుందేమో అని ధర్మసందేహం వ్యక్తం చేశాడు. అందుకు చంద్రబాబు... ఆంధ్రాకు న్యాయం చేయాలని టీడీపీ ఎంపీలు పోరాడుతుంటే పత్తాలేకుండా పోయిన వైసీపీ ఎంపీలని వ్రాసుకో మనం డని చెప్పి అక్కడనుండి బయల్దేరాడు.

Read 59 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • పేటలో పోటీకెవరు?
  జిల్లాలో తెలుగుదేశంపార్టీకి గట్టి నియోజకవర్గాలలో సూళ్ళూరుపేట ఒకటి. ఇది ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం అయినప్పటికి ఇంతకాలంగా వేనాటి సోదరులే ఇక్కడ పార్టీని నడుపుతూ వచ్చారు. అభ్యర్థులను నిర్ణయిస్తూ, గెలిపిస్తూ వచ్చారు. తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటివరకు 8సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, 5సార్లు…
 • జగన్‌ జోరు.. బాబు బేజారు
  'మన్మధుడు' సినిమాలో సీన్‌ ఇది... బ్రహ్మానందం ఇంటికి నాగార్జున, సోనాలిబింద్రే వస్తారు. అక్కడ బ్రహ్మానందం భార్యగా ఒక నల్లజాతి మహిళ ఉండడాన్ని చూసి మీది లవ్‌ మ్యారేజీనా అని నాగార్జున అడుగుతాడు. దానికి బ్రహ్మానందం... ముందు ఆమె నన్ను ప్రేమించింది... తర్వాత…
 • ఈ నరకం ఇంకెన్నాళ్ళు
  ''ఈ నగరానికి ఏమైంది... ఓ పక్క మసి... మరోపక్క పొగ... నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం''... థియేటర్లలో గాని, టీవీలలో గాని సినిమా ప్రదర్శనకు ముందు వచ్చే ప్రకటన ఇది. ఇప్పుడు నెల్లూరు పరిస్థితి కూడా అలాగే వుంది. ఓ…
 • రాజకీయ ప్రయాణంలో... ఇది తొలి సంతకం
  ఇప్పటికే నెల్లూరు కేంద్రంగా నెల్లూరుజిల్లాలోనే కాక రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆథ్యాత్మిక, మానవీయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన సుల్లో సేవాస్వాప్నికుడిగా ముద్రపడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి... తన జీవితంలో మరో సేవా ప్రయాణానికి తొలి సంతకం చేసారు. ఇంతదాకా…
 • వణికిస్తున్న సైకో
  ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు…

Newsletter