23 February 2018 Written by 

అమ్మ భాషే..శ్వాస!

teluguఏ సమాజానికైనా అమ్మ భాషే.. శ్వాస. అదే ఉచ్ఛ్వాస..నిశ్వాస కూడా. మాతృభాష.. మన సంస్కృతికి దర్పణం. అది మన వారసత్వ సంపద. భావి తరాలవారికి మన వారసత్వ సంపదను తెలియజేసేందుకు ఉపయోగపడేది మాతృభాషే. ఒక జాతి విశిష్ట సంస్కృతి, వారసత్వం అన్నీ ఆ జాతి మాట్లాడే మాతృభాష లోనే నిబిడీకృతమై ఉంటాయి. తల్లి లేనిదే దేహం లేదు.. అదేవిధంగా భాష లేనిదే జాతికి జీవం

ఉండదు. భాష..అన్నది ఒక జీవనాదం. తల్లి నుంచి సంక్రమించే ఈ జీవనాదమే సమాజానికి జీవనాడి. అమ్మ పలుకులే భాషకు తొలిపలుకులు. తేనెలొలికే అమ్మపదాలను ఏనాటికీ ఎవరూ విస్మరించకూడదు. అమ్మభాషకు.. అందులోనూ మన తెలుగుభాషకు ఎనలేని వారసత్వ సంపద ఉంది. మహోన్నతమెన సారస్వత సంపద మనకుంది. అది తెలుగువారి సొత్తు. ఎంతోమంది మహనీయులు తెలుగుభాష అభ్యున్నతికి ఎనలేని కృషిచేశారు. ఎందరో మహాకవులు, ఎందరో మహానుభావులు తెలుగు సారస్వత ఖ్యాతిని దశదిశలా చాటేవిధంగా అత్యద్భుతమైన రచనలెన్నో చేసి అందరికీ మార్గదర్శకమయ్యారు. వారి కృషి ఏనాటికైనా శ్లాఘనీయమైనదే.

మాతృమూర్తి, మాతృభూమి, మాతృదేశం, మాతృభాష.. ఇవన్నీ ప్రతిఒక్కరిలో అత్యంత ఆత్మీ యతను, ప్రేమను.. గౌరవాన్ని కలిగిస్తాయి. మనిషిలో మమతల్ని.. మానవీయతను మేల్కొల్పి జాతిని జాగృతం చేసి.. అందరినీ ఆత్మీయతానందాల్లో పరవశింపజేసేదే భాష.. మాతృభాష. సమాజాభ్యున్న తికి శ్రీకారం చుట్టేది.. ప్రగతిపథంలో మనల్ని నడిపించేదీ.. అభివృద్ధికి నిచ్చెన వేసేదీ భాషే. అందుకే అది ఎంతో పవిత్రమైనది.. అమృతతుల్యమైనది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డకు మాతృభాషతో పరిచయం కలుగుతుంది. ఉగ్గుపాలతోనే బిడ్డకు అమ్మ భాషను నేర్పుతుంది.. అదే అమ్మవుతుంది.. అమృతమవు తుంది. ముద్దుమాటలొలికే ఆ అమ్మభాష మనకు..మన చుట్టూ ఉన్న సమాజానికీ జవజీవాలనిచ్చే జీవభాష అవుతుంది. ఆ భాషే.. ఆ తర్వాత కూడా అమ్మలా మన చేయిపట్టుకుని సమాజంలో మనల్ని మునుముందుకు నడిపిస్తుంది. సగర్వంగా జీవించేలా చేస్తుంది.

అందుకే మాతృభాషకు వందనం!.. మాతృమూర్తికి వందనం!...

ఒకవేళ మాతృభాషను చదవడం, రాయడం రాకపోయినా, అమ్మభాషను గ్రహించి పలకడం వల్ల ఆ భాష సునాయాసంగా వంటబడుతుంది. అమ్మభాషే వచ్చాక ఎంతటి కష్టమైన భాషలనైనా.. ఎన్ని భాషలనైనా నేర్చుకునేందుకు అదే సాధనమవుతుంది కూడా. ఇలా.. మనందరి మనుగడకు మన భాషే ఆధారమవు తుంది. అందుకే, ఆజన్మాంతం మనం భాషకు రుణపడి ఉండాలి. మన భాషను ఎల్లవేళలా మనం కాపాడుకోవాలి. అది ఏనాటికీ వసివాడని కుసుమంలా, పరిమళభరితంగా విరాజిల్లాలి. అందుకే అమ్మభాషను ప్రతిఒక్కరూ ప్రేమించాలి.. మాతృభాషను పరిరక్షించుకోవాలి. అది మన ధర్మం. ప్రపంచవ్యాప్తంగా పలు భాషలు కాలక్రమంలో వాడుక కోల్పోయి క్రమేణా మృతభాషగా మారిపోతున్నాయని యునెస్కో హెచ్చరిస్తున్న నేపథ్యాన్ని కూడా ఈ సందర్భంగా దృష్టిలో ఉంచుకోవాలి. యునెస్కో ప్రమాణాల ప్రకారం, ఏ భాష వాడకంలో రెండు తరాలపాటు క్రమంగా 20శాతం వంతున తగ్గిపోతూ వస్తుందో ఆ భాష ఉనికికి రెండు దశాబ్దాల్లో ప్రమాదం ముంచుకొస్తుందనేది ఒక హెచ్చరిక. అయితే, తెలుగుభాషకు అంతటి దుస్థితిని మనం ఊహించలేం కానీ, తెలుగు పలుకే మన ఉనికి... అన్నది మాత్రం ఏనాటికీ విస్మరించకుండా మన భాష అభ్యున్నతికి మనం చిత్తశుద్దితో పాటుపడాలన్నది మాత్రం స్పష్టం. అందుకే, మనకే కాక.. మన పిల్లలకు అందరికీ మాతృభాష పట్ల మమకారం పెంపొందేలా మనవంతు కృషి ఎల్లవేళలా కొనసాగుతూనే ఉండాలన్నది ఎవరూ మరచిపోకూడదు. మన మాతృభాష.. ఏనాటికైనా సరే.. అమృత భాషగానే ఉండాలే తప్ప..ఏనాటికీ మృతభాష కాకూడదు..కారాదు. అందుకు, అందరూ అమ్మభాషలోనే మాట్లాడుకోవాలి. చదువుకోవాలి..పాఠశాలల్లో విద్యాబోధన, ప్రభుత్వ పాలన అంతా తెలుగులోనే జరగాలి. అయితే తెలుగును ప్రేమించడమంటే ఇతర భాషలను వ్యతిరేకించడం కాదు.. .ఆయా భాషలను నేర్చుకున్నప్పటికీ, మాతృభాష అయిన తెలుగును మాత్రం ఎవరూ ఏనాటికీ విస్మరించకుండా తమ వంతు భాషా పరిరక్షణకు కృషి చేయడమే ముఖ్యం. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా చేయూతను అందించాల్సివుంది. ప్రధానంగా తెలుగుభాషను వ్యావహారిక భాషగా, పరిపాలనా భాషగా బాగాప్రాధాన్యత ఇచ్చి భాషాభివృద్ధికి బాటలు వేయాల్సి ఉంది. పాఠశాలల్లో, విద్యాలయాల్లో తెలుగు భాషను బోధనాభాషగా అమలుచేయాలి. తెలుగు మాధ్యమంలో విద్యాబోధన సజావుగా సాగేలా చూడాలి. మన ఆచార వ్యవహారాలు, మన సంప్రదా యాలు, మన సంస్కృతి.. మన గొప్పదనం అన్నీ భాషతోనే ముడిపడివున్నాయి. ఒక్కమాటలో చెప్పా లంటే మాతృభాష.. మన వారసత్వ సంపద. ఎంతో ప్రాచీనకాలం నుంచి వస్తున్న ఈ వారసత్వ సంప్రదాయాలను గానీ, మన భాషను గానీ విస్మరించకుండా కాపాడుకుంటూనే ఉండాలి. ముఖ్యంగా, తెలుగును మన అమ్మభాషగా.. అదే మన ధ్యాసగా.. శ్వాసగా మన గుండెల్లో నిలుపుకోవాలి. తెలుగుభాష పరిరక్షణకు ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉండాలి. గ్రామస్థాయిల్లో ఉన్న యాసను, భాషను పొదివి పట్టుకుని, భాషాభ్యున్నతికి పండితులు, పరిశోధకులు మరింతగా కృషి చేసి తెలుగు వెలుగులను ఎల్లెడలా తేజరిల్లేలా చేయాలి. కవులు, రచయితలు, కవిపండితులు ప్రపంచమే గర్వించేవిధంగా అత్యద్భుతమైన రచనలు చేస్తూ, తెలుగు సాహితీ వైభవాన్ని దశదిశలా చాటాలి.. తెలుగుభాషకు ఉన్న వైశిష్ట్యాన్ని, ఔన్నత్యాన్ని జగద్విదితం చేయాలి. తెలుగుభాషను శిఖరాయమానం చేస్తూ..తెలుగు భాష గొప్పదనాన్ని నేటితరానికే కాక.. మన భావితరాలకు కూడా అందిస్తుండాలి. తెలుగు వెలుగులను సదా ప్రకాశమానం చేస్తూనే

ఉండాలి. అందుకు, ఈ శుభదినాన..ప్రపంచ మాతృభాషా దినోత్సవం (ఫిబ్రవరి 21) రోజున అందరం.. మనందరం చిత్తశుద్థితో ప్రతినబూనుదాం!....తెలుగుతల్లికీ జై!..తెలుగుభాషకూ జై!...Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • రెండు నెలల్లో... ట్రెండ్‌ మారింది
  రాజకీయాలలో పరిస్థితులు తారుమారు కావడానికి ఎంతో కాలం పట్టదు. నాలుగేళ్ళ పదినెలలు సమర్ధవం తంగా పని చేసిన ఒక ప్రభుత్వం ఒక చిన్న తప్పు చేస్తే ఒక్క నెలలోనే గబ్బు పట్టొచ్చు. దాని మూలంగానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. నాలుగేళ్ళ పది నెలల…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…

Newsletter