23 February 2018 Written by 

ఉదయగిరిలో... పాత పోరా? కొత్త నీరా?

udayagirజిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో 9అసెంబ్లీలది ఒక దారి అయితే ఉదయగిరి అసెంబ్లీది మాత్రం ఇంకో దారి! మెట్టప్రాంతమైనప్పటికి ఇక్కడి ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. పార్టీ ప్రభంజనాలు, నాయకుల పట్ల సానుభూతి వంటి వాటికంటే కూడా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల వ్యక్తిగత సామర్ధ్యం, గుణగణాలను బట్టే ప్రజలు తీర్పునిస్తారు.

1978లో అంతటి ఇందిరాగాంధీ ప్రభంజనంలో కూడా ఈ జిల్లాలో

ఉదయగిరిలో మాత్రం కాంగ్రెస్‌ ఓడి పోయింది. జనసంఘ్‌ అభ్యర్థిగా వెంకయ్య నాయుడు గెలిచాడప్పుడు. 1983లో ఎన్టీఆర్‌ ప్రభంజనం ఉధృతంగా పని చేసింది. జిల్లాలో 10అసెంబ్లీ సీట్లలో తెలుగుదేశం విజయఢంకా మోగించింది. కాని ఉదయగిరిలో మాత్రం ఓడిపో యింది. బీజేపీ అభ్యర్థిగా వెంకయ్య నాయుడు విజయం సాధించారు. కేవలం అభ్యర్థి వ్యక్తిగత విజయాలే ఇవి.

రాజకీయాలను డబ్బు శాసిస్తున్న నేటి కాలంలో కూడా ఉదయగిరి ప్రజలు మాత్రం ముందు అభ్యర్థి వ్యక్తిగత వ్యవ హారశైలికే ప్రాధాన్యతనిస్తుంటారు. ఇక్కడనుండి ఎమ్మెల్యేగా గెలిచినవాళ్ళు తమ ఇళ్లలో పెళ్లిళ్లకు, కర్మంత్రాలకు రావాలని, తాము కనిపిస్తే పేరుపెట్టి ఆప్యాయంగా పిలవాలని కోరుకుంటారు. ఇక్కడ సామాన్య ప్రజలు ఎమ్మెల్యేల నుండి అంతకుమించి ఆశించేదేమీ వుండదు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వెంకయ్యనాయుడు, కంభం విజయరామి రెడ్డి, స్వర్గీయ మాదాల జానకిరామ్‌లు అటువంటి ట్రెండ్‌నే ఫాలో అయ్యారు.

అలా మెయింటెన్‌ చేయడంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కొంత వరకు పర్వాలేదు. 2014 ఎన్నికలలో ఆర్ధికంగా కొన్ని లోటుపాట్లు వల్ల ఓడి పోయాడు. ఎంపి అభ్యర్థి, ప్లస్‌ ఆయన అన్న అయిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఏ మాత్రం సహకరించున్నా గెలిచే సుండేవాడు.

ఇక ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లినేని రామా రావు అయితే గత ఎమ్మెల్యేల నైజానికి పూర్తిగా విరుద్ధం. అతను కాంట్రాక్టర్‌. అదికూడా మహారాష్ట్రలో ఉంటాడు. వారానికి ఒకట్రెండు రోజులు మాత్రమే నియోజకవర్గానికి రాగలుగుతున్నాడు. మండలస్థాయి నాయకులతో కలవడానికే ఆయనకు టైం సరిపోవడం లేదు. చిన్న స్థాయి వ్యక్తులను కలవడానికి ఆయన ఇష్టపడడని కూడా అంటారు. ఇక జనా లనేం కలుస్తాడు... వారిళ్ళలో కార్యా లకు ఏం వెళతాడు? జనాల్లో ఉండడం లేద నేదే ఆయనపై వ్యతిరేకత!

ఈసారి ఆయనకు సీటిస్తే ఉదయ గిరిలో గెలవడనే ప్రచారం నియోజక వర్గంలో విస్తృతంగా వుంది. మరి ఆయ నకు ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ పరంపరలో మాజీఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, పారిశ్రామికవేత్త కావేరి కృష్ణారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే వైసిపి నుండి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డే మేలని కొందరు, ఆయన కంటే గౌతమ్‌ అయితే బెటర్‌ అని మరికొందరు అంటున్నారు. మొత్తానికి పాత అభ్యర్థులు ఇద్దరూ మారితేనే బాగుం టుందనే కొత్తపాట నియోజకవర్గంలో ఇక్కడా అక్కడా వినిపిస్తూ వుంది!Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • పేటలో పోటీకెవరు?
  జిల్లాలో తెలుగుదేశంపార్టీకి గట్టి నియోజకవర్గాలలో సూళ్ళూరుపేట ఒకటి. ఇది ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం అయినప్పటికి ఇంతకాలంగా వేనాటి సోదరులే ఇక్కడ పార్టీని నడుపుతూ వచ్చారు. అభ్యర్థులను నిర్ణయిస్తూ, గెలిపిస్తూ వచ్చారు. తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటివరకు 8సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, 5సార్లు…
 • జగన్‌ జోరు.. బాబు బేజారు
  'మన్మధుడు' సినిమాలో సీన్‌ ఇది... బ్రహ్మానందం ఇంటికి నాగార్జున, సోనాలిబింద్రే వస్తారు. అక్కడ బ్రహ్మానందం భార్యగా ఒక నల్లజాతి మహిళ ఉండడాన్ని చూసి మీది లవ్‌ మ్యారేజీనా అని నాగార్జున అడుగుతాడు. దానికి బ్రహ్మానందం... ముందు ఆమె నన్ను ప్రేమించింది... తర్వాత…
 • ఈ నరకం ఇంకెన్నాళ్ళు
  ''ఈ నగరానికి ఏమైంది... ఓ పక్క మసి... మరోపక్క పొగ... నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం''... థియేటర్లలో గాని, టీవీలలో గాని సినిమా ప్రదర్శనకు ముందు వచ్చే ప్రకటన ఇది. ఇప్పుడు నెల్లూరు పరిస్థితి కూడా అలాగే వుంది. ఓ…
 • వణికిస్తున్న సైకో
  ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు…
 • రాజకీయ ప్రయాణంలో... ఇది తొలి సంతకం
  ఇప్పటికే నెల్లూరు కేంద్రంగా నెల్లూరుజిల్లాలోనే కాక రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆథ్యాత్మిక, మానవీయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన సుల్లో సేవాస్వాప్నికుడిగా ముద్రపడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి... తన జీవితంలో మరో సేవా ప్రయాణానికి తొలి సంతకం చేసారు. ఇంతదాకా…

Newsletter