23 February 2018 Written by 

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ పచ్చిమోసం వెనుక అవినీతిదే ప్రముఖపాత్ర!

sravanఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకో లేడనటానికి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో జరిగిన దారుణమైన ఉదంతమే ఉదాహరణ.

కంప్యూటరీకరణతో తరిస్తున్న బ్యాంకుల్లో సైతం మోసాలు విరివిగా జరుగుతుండడం ఆశ్చర్యకరంగా పరిణమిస్తుంది. రోజు లావాదేవీలను తనిఖీ చేసే ఆడిటర్లు, నెలల తరబడి తనిఖీ చేసే బ్యాంకుల అంతర విభాగ బృందాలు, రిజర్వ్‌బ్యాంక్‌ నిఘా వ్యవస్థ, మళ్ళీ సంవత్సరానికొకసారి చట్టబద్ధమైన ఆడిట్‌ విభాగాన్ని దాటుకొని కోర్‌ బ్యాంకింగ్‌ కళ్ళు గప్పి ఇలాంటి మోసాల వైపరీత్యాలు జరుగుతున్నా యంటే కేవలం బ్యాంకు అధికార్లు ప్రలోభాలకు లొంగడమే అసలైన కారణం.

ఎన్ని నిఘా నేత్రాలు తెరచినా ప్రజల సొమ్మును అప్పనంగా ఆరగించే వాళ్ళకు ఋణాలివ్వడం వెనుక బ్యాంక్‌ అధికార్ల బలహీనతలే కారణం అంటే నివ్వెరపోకతప్పదు. లేకుంటే 2700 కోట్లు ప్రజలసొమ్ము వృధా చేసిన బ్యాంకింగ్‌ అధికారులను ఏ విధంగా శిక్షించాలో చట్టాలకు తెలియకపోవచ్చు. కాని అంత సొమ్మును ఆరగించి తప్పించుకొని వెళ్ళగల్గడం మాత్రం ఒక నీరవ్‌మోడీ, మరో కొఠారీ, విజయమాల్యాలకు మాత్రం బాగా తెలుసు. వ్యాపారవర్గాలకు బ్యాంకులు ధన రూపేణ గానీ, హామీ రూపంలో (ధనేతరంగా) గాని ఋణం ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు ధనేతర రూపేణా ఇచ్చిన ఋణాల్లో ఎక్కడా మోసం జరిగినట్టు మనం వినలేదు. అలా ఇచ్చిన హామీ ఋణాల్లో తొలిసారిగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో జరగడం రికార్డుగా పేర్కొనవచ్చు.

విదేశీ విఫణిని సాగించే నీరవ్‌మోదీ వజ్రాల దిగుమతి కోసం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ద్వారా 280కోట్ల హామీలను విదేశీ వ్యాపారులకు అందించడం అవి చెల్లించ లేకపోవడంతో హామీ ఇచ్చిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ చెల్లించాల్సిన అగత్యం ఏర్పడింది. ఇక్కడ వడ్డీ శాతం కేవలం నాలుగు మాత్రమే కావడం అలా వేసుకొన్న వడ్డీతో సహా మొత్తం ఇప్పటి వరకు 2700 కోట్ల స్కాం అంటే ప్రజల గుండెల్లో రైళ్ళు పరుగెడ్తున్నాయి. 2011 నుండి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఖాతాదారుడుగా ఉన్న నీరవ్‌ మోదీ తాను ఇచ్చిన సెక్యూరిటీ ఆస్తుల కంటే అత్యధికంగా హామీ ఋణాల్ని పొందడం వెనుక బ్యాంకు అధికార్ల అవినీతే కారణమవుతుంది.

చిన్నచిన్న ఋణాల కోసం బ్యాంకులకు వెళ్ళిన సామాన్యుడి వద్ద నూరుశాతం లేక రెండు వందల శాతం సెక్యూరిటీని గుంజే బ్యాంకింగ్‌ సంస్థలు ఏకబిగిన అత్యంత తక్కువ మొత్తం సెక్యూరిటీతో నీరవ్‌ మోదీ లాంటి వ్యక్తులకు వందలకోట్లకు హామీ లివ్వడమంటే ప్రజల సొమ్మును ఆరగించే ఇలాంటి సంస్థల్ని కఠినంగా శిక్షించాల్సిన అగత్యం ఎంతైనా ఉంది.

ఋణ హామీ పొందిన నీరవ్‌ మోదీ 180రోజుల తర్వాత ఋణాన్ని చెల్లించాల్సి ఉంది. అలాకాకుండా ఆ ఋణ ఖాతాను అలాగే పునరుద్ధరించడం ఎంతైనా శోచనీయం. ఇక్కడే బ్యాంకింగ్‌ అధికార్లను తన మేధస్సుతో బురిడీ కొట్టించి ప్రజల సొమ్ముతో పండగ చేసుకొన్నాడు నీరవ్‌మోదీ. 2011 నుండి కాలం చెల్లిన ఋణాల్ని తిరిగి చెల్లించకుండా అన్ని లెటర్‌ ఆఫ్‌ అండర్‌ టేకింగ్‌లను పునరుద్ధరిస్తూ పోవడం వెనుక ఆంతర్యం నీరవ్‌మోదీ అందించిన వజ్రాల మహత్యం కాక మరేమిటుంటుంది? నీరవ్‌ మోదీకి హామీ ఋణాల్ని అందించిన అధికారి ఉద్యోగ విరమణ పొందేదాకా బయట పడకపోవడం వెనుక అవినీతి ఎంత ప్రముఖ పాత్ర వహిస్తున్నదో అర్ధం అవుతున్నది. కొత్తగా నియమితులైన అధికారి ఒక్కసారిగా ఉలిక్కిపడి స్టాక్‌ఎక్ఛేంజ్‌ మరియు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు రంగు బయటపడింది. ఎప్పటిలాగే ప్రభుత్వం ఇంతపెద్ద స్కాంలో ఎలా వ్యవహరిస్తుందో కాలమే నిర్ణయించాలి. ప్రజల సొమ్మును ఏ మాత్రం జాగ్రత్తగా కాపాడలేని బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లపై చర్యలకు ఉపక్రమిస్తుందో లేదో చూడాలి.

ప్రజల సొత్తును పప్పు బెల్లాలుగా పరచుకొంటున్న బ్యాంకు అధికార్ల మోసానికి అడ్డుకట్ట వేయలేని ఆడిట్‌, నిఘా వ్యవస్థల్లో మనం మనగల్గడం ఎంతవరకు సాధ్యమో ఆందోళన కల్గిస్తుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter