02 March 2018 Written by 

దైవం చెంతకు 'దేవి'

srideviదాదాపు అయిదు దశాబ్దాల పాటు భారతీయ చిత్రపరిశ్రమను ఉర్రూతలూగించిన అగ్రతార శ్రీదేవి తిరిగిరాని లోకాలకు తరలిపోయింది. అందం, అభినయంతో అభిమానుల గుండెల్లో తనదంటూ ఓ ప్రత్యేకముద్ర వేసుకున్న అందాలతార... అతిలోక సుందరి.. అనంతలోకాలకు చేరిపో యింది. అశేష అభిమానజనానికి ఇక సెలవంటూ.. ఏ కన్నీళ్లూ.. ఏ శోకాలూ లేని దిగంతాలకో... ఏ దూర సుదూర తీర సరోవరాలవతలికో తరలివెళ్ళి పోయింది. ఆమె జీవితమంతా నటన లోనే ఉండిపోయింది.. 54 ఏళ్ళ జీవి తంలో 50 ఏళ్ళు నటనారంగంలోనే పండిపోయింది. నటించిన ప్రతి సన్ని వేశంలోనూ జీవించింది. దక్షిణాది,

ఉత్తరాది రాష్ట్రాలను అన్నిటినీ ఒకటి చేస్తూ, ప్రాంతాలకు భాషలకు అతీతంగా నటనా ప్రావీణ్యంతో భారతీయ నటనా రంగంలో ఆమె ఒక విశిష్ట తారగా అవతరించింది. అంతటి విశేషనటనాను భవం ఉన్న ఏకైననటి భారతదేశంలో ఒకే ఒక్క నటి... మహానటి.. శ్రీదేవి కావడం తెలుగువారి అదృష్టం.

శ్రీదేవి... ఈ పేరంటేనే తెలుగుసినీ జగత్తులో ఏదో తెలియని ఆనందం వెల్లి విరుస్తుంది. ప్రత్యేకించి శ్రీదేవి అభిమాను లకు ఆమె పేరంటేనే ఒక సంబరం. ఆమె సినిమాలు చూసి ఆనందించిన ఎందరో అభిమానుల హృదయాల్లో ఆమె అందాల నటిగా.. అత్యద్భుత నటీమణిగా నిలిచి పోయారు. గత నెల 24న ఆమె దుబాయ్‌లో ఓ వివాహానికి వెళ్ళి ఉండగా, హోటల్‌ గదిలో ప్రమాదవశాత్తూ బాత్‌ టబ్‌లో పడి మృతి చెందినట్లు దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ వర్గాలు నిర్ధారించాయి. ఆమె మరణవార్త విని యావత్‌ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఈ నేపథ్యంలో గత నెల 28న అశేష జనవాహిని అశృనయ నాల మధ్య ఆమె అంత్యక్రియలు ముంబైలో జరిగాయి. శ్రీదేవి ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక.. అభిమానజనం ఆమె భౌతికకాయాన్ని చూసి పెద్దపెట్టున రోదించారు. అందరూ శోక తప్త హృదయాలతో ఆమెకు కడసారి కన్నీటి వీడ్కోలు తెలిపారు. భర్త బోనీకపూర్‌ ఆమె చితికి నిప్పంటించగా, శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు జాహ్నవి, ఖుషీ గుండెలవిసేలా విలపిస్తుండగా... దేశవ్యాప్తంగా తరలి వచ్చిన భారతీయ చిత్రపరిశ్రమ ప్రము ఖులు, ప్రత్యేకించి బాలీవుడ్‌, టాలీవుడ్‌ నటులు, నటీమణులు ఇతర ప్రముఖులు ఉప్పొంగిన కన్నీటితో వీడ్కోలు చెప్తుం డగా.. అందరి హృదయాలు బాధతో బరు వెక్కుతుండగా శ్రీదేవి అంతిమ సంస్కా రాలు యధావిధిగా జరిగిపోయాయి.

1963లో శివకాశిలో శ్రీదేవి జన్మించారు. 54ఏళ్ళ జీవితంలో దాదాపు 50ఏళ్ళ పాటు సినీలోకాన్ని ఏలిన ఇండి యన్‌ సూపర్‌స్టార్‌ శ్రీదేవి తెలుగమ్మాయే. ఆమె తల్లి రాజేశ్వరి స్వస్థలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్‌ తమిళనాడులోని శివ కాశిలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం వారే. ఆయన తెలుగు చాలా చక్కగా మాట్లాడే వారు కూడా. తల్లిదండ్రులు చెన్నైలో ఉండేవారు. ఈ నేపథ్యంలో శ్రీదేవికి నాలుగేళ్ళ వయసు నుంచే వెండి తెరపై బాలనటిగా నటించే అవకాశం వచ్చింది. తల్లిదండ్రుల ప్రోత్సా హంతో 1967లో తొలిసారిగా ఆమె 'కందన్‌ కరుణై' అనే తమిళచిత్రంలో బాలనటిగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా 'బడి పంతులు' చిత్రంలో 'బూచాడమ్మా బూచాడు.. బుల్లిపెట్టెలో

ఉన్నాడు' అనే పాటకు శ్రీదేవి చిన్నతనం లోనే అత్యద్భుతమైన నటన ప్రదర్శించి బాలనటిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు. ఆ తర్వాత హీరో యిన్‌గా ఎదిగారు. రెండు తరాల నటు లతోనూ అద్వితీయంగా నటించి అందరినీ తన నటనాచాతుర్యంతో మంత్ర ముగ్ధుల్ని చేశారు. 'అనురాగాలు, 'మా బంగారక్క', 'పదహారేళ్ళ వయసు' వంటి చిత్రాలతో ఆమె అద్వితీయమైన నటనతో ఎదుగుతూ అందరి ప్రశంసలూ అందు కున్నారు. ప్రేమాభిషేకం, వేటగాడు, కొండ వీటి సింహం, దేవత, ఆఖరి పోరాటం వంటి చిత్రాలతో ఆమె నటనా ప్రతిభ

ఉన్నత శిఖరాలకు చేరింది. తెలుగు తమిళ చిత్ర రంగాల మహానటులు ఎన్‌టి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, ఎంజీఆర్‌, శివాజీగణేశన్‌ వంటి నట దిగ్గజాలతో పాటు, మెగాస్టార్‌ చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్‌ వంటి హీరోలతో కలసి అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకలోకాన్ని తన నటనాప్రతి భతో మురిపించి మెప్పించిన మహానటి శ్రీదేవి. బొబ్బిలిపులి, ప్రేమకానుక, కార్తీక దీపం ఇలా ఎన్నో చిత్రాలు ఆమె నటనా వైదు ష్యానికి నిదర్శనాలు. జగదేకవీరుడు -అతిలోక సుందరి చిత్రం మరో సూపర్‌ హిట్‌ కావడంతో, హిందీ చిత్రాల్లోనూ మంచి అవకాశాలు వచ్చాయి. విశ్వ విఖ్యాత నటుడు కమలహాసన్‌తో కలసి ఆమె నటించిన 'వసంత కోకిల', అకలి రాజ్యం వంటి చిత్రాలు చిత్ర పరిశ్రమ

ఉన్నంత కాలం ప్రేక్షకుల గుండెల్లో నిలిచి పోయేవే. తమిళ చిత్ర రంగంలోనూ అని తరసాధ్యమైన రీతిలో విఖ్యాత నటుడు రజనీకాంత్‌తో ఏకంగా 23 చిత్రాల్లో నటించారు, కమల్‌హాసన్‌తో కలసి 22 చిత్రాల్లో నటించారు. అటు తెలుగులోను ఇటు తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ ఆమె హీరోయిన్‌గా నటించి ప్రఖ్యాతి చెందారు. ఆ తర్వాత ఆమెకు హిందీ చిత్రాల్లోనూ మంచి అవకాశాలు వచ్చాయి. నటనను ఓ ఛాలెంజ్‌గా తీసు కుని, ఎంతో కృషి పట్టుదలతో ఆమె హిందీ హీరోయిన్‌గా పలు చిత్రాల్లో అద్వితీయ ప్రతిభతో రాణించడం విశేషం. మవాలీ, తోఫా, మిస్టర్‌ ఇండియా, సద్మా, చాందినీ, చాల్‌బాజ్‌, ఖుదాగవా, లమ్హే తదితర చిత్రాల్లో శ్రీదేవి నటన అపూర్వం. అద్భుతం కూడా. ఇవన్నీ బాక్సాఫీసును బద్దలుకొట్టి రికార్డులు సృష్టించిన చిత్రాలే. శ్రీదేవి హీరోయిన్‌ అయితే చాలు ఆ సినిమా హిట్టే అన్న టాక్‌ అంతటా వచ్చే సింది. అందుకు తగ్గట్టుగానే ఆమె నటించిన అనేక చిత్రాలు సూపర్‌హిట్‌ అయ్యాయి. నిర్మాతలకు లాభాల రాశులు పోశాయి. దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించి అద్వితీయ అందాల నటిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీదేవి ఇండియన్‌ లెజండరీ యాక్టర్‌గా, ఇండియన్‌ సూపర్‌ స్టార్‌గా విశ్వవిఖ్యాతిగాంచారు. ఎన్నెన్నో విశిష్టమైన పురస్కారాలను, ఘనమైన అవార్డులను ఆమె అందుకున్నారు. 2013లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 'పద్మశ్రీ' అవార్డును కూడా అందుకుని అటు తెలుగు వారికి, ఇటు భారతీయ చిత్రపరిశ్రమకు, నటనారంగానికీ మహానటి శ్రీదేవి ఎనలేని గౌరవం తెచ్చారు. 81 తెలుగు చిత్రా ల్లోనూ, 72 తమిళ చిత్రాల్లోనూ అద్వితీ యంగా నటించి, మరో 72 హిందీచిత్రా ల్లోనూ అమోఘమైన నటనతో ఖ్యాతి చెందారు. ఇవికాక, 25 మలయాళం చిత్రాల్లోనూ, 6కన్నడ చిత్రాల్లోనూ నటిం చారు. మొత్తంగా 254 చిత్రాల్లో ఆమె నటనా వైభవం వర్ణించేందుకు మాటలు చాలవు. (అయితే 'మామ్‌' ఆమె 300వ చిత్రంగా పేర్కొంటున్నారు. మధ్యలోని 45 చిత్రాల వివరాలు తెలియరాలేదు.) వీట న్నిటికీ ప్రధాన కారణం ఆమె నిబద్ధత, క్రమశిక్షణ, అంతులేని కృషి.. నటనా రంగంలో ఆమెకు అనితరసాధ్య మైన ఇంత ఘనకీర్తిని తెచ్చిపెట్టాయి. అత్యంత అమోఘమైన ఆమె నటనా చాతుర్యం భారతీయ సినీరంగానికే శిఖరాయమా నంలా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. హిందీ చిత్రాల నిర్మాత బోనీకపూర్‌తో వివాహమయ్యాక ఆమె సినీ రంగానికి కొంతకాలం దూరమైనా, 2012లో తిరిగి ఆమె నటించిన 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌' చిత్రం ఓ సంచలనంగా నిలిచింది. దశాబ్దాదల తర్వాత ఆమె మళ్ళీ మేకప్‌ వేసుకున్నప్పటికీ ఎక్కడా తడబాటు లేకుండా తన నటనా కౌశలాన్ని ప్రదర్శించింది. సినీరంగ ప్రవేశం చేసిన రోజుల్లో తనకంటూ అప్పట్లో ఎవరి దన్నూ లేకపోయినా.. కేవలం స్వయంకృషితో, పట్టుదలతో నటనారంగంలో మెరుగులు దిద్దుకుంటూ, అనుభవపాఠాలు నేర్చుకుంటూ, తననుతనే తీర్చిదిద్దుకుంటూ జీవితంలో ఎంతో కష్ట పడి ఒక మహా నటిగా ఎదిగిన మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. తన ముద్దుముద్దు మాటలతో నటనకే అభినయం నేర్పించిన మహానటి.. ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి ఆమె దుబాయ్‌లో మరణించారు. శ్రీదేవి భౌతికంగా మనమధ్య లేకపోయినా సర్వత్రా అందరి హృదయాల్లో నిండిపోయి వుంది. అదిగో ఆ నక్షత్రలోకంలోనూ జగజ్జేయమానంగా వెలుగులీనుతూ మిల మిలమెరిసే తారగా.. దివ్యతారగా.. ధృవ తారగా నిలిచిపోయింది. ఇండియన్‌ లెజండ్‌.. ఇండియన్‌ సూపర్‌స్టార్‌ శ్రీదేవి.. ఇక లేకపోవడం భారతీయ చలనచిత్ర రంగానికే తీరని లోటు. ఏనాటికీ తీరని.. ఒక విషాదమే!.. ఆ మహానటి కిదే.. మా కన్నీటి నివాళి!....Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter