02 March 2018 Written by 

శివయ్య సన్నిధికి 'సరస్వతి'

saraswathiప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త, అపర శంకరాచార్య, హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడు, కంచి కామకోటి పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ శివసాయుజ్యం పొందారు. హిందూ ధర్మాన్ని జగజ్జేయమానం చేస్తూ, ప్రత్యే కించి శంకరమఠం ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తం చేసేందుకు జీవితాంతం అహర్ని శలు నిర్విరామంగా శ్రమించారు జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ. ఆయనకు 83 ఏళ్ళు. తమిళనాడులోని కంచి కామకోటి పీఠానికి ఆయన 69వ అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 27 మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామీజీ, అనంతరం తన గదిలోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో భక్తులు హుటాహుటిన సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయి స్తుండగా, ఉదయం గుండెపోటు వచ్చి స్వామివారు మహానిర్యాణం చెందారు. జయేంద్ర సరస్వతి స్వామీజీ పార్ధివ దేహానికి మఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతి పూజలు చేశారు. స్వామిజీ నిర్యాణం చెందడంతో భక్తులు కన్నీరుమున్నీరయ్యారు.

జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ అసలు పేరు సుబ్రహ్మణ్య మహదేవన్‌. మన్నార్‌గుడి సమీపంలోని ఇరుళ్‌నీక్కి అనే కుగ్రామంలో ఆయన జన్మించారు. వేద విద్యాభ్యాసం చేసిన తరువాత 1954లో అప్పటి పీఠాధిపతి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి నుంచి సన్యాసం స్వీకరించారు. ఆ పీఠానికి బాల శంకరాచార్యులుగా అప్పట్లో బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 40ఏళ్ళకు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ నిర్యాణం చెందడంతో 1994లో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ కంచికామకోటి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. జనకల్యాణ్‌, జనజాగరణ్‌ల పేరుతో ప్రజల్లో ఆధ్యాత్మిక భావపరంపరలను పెంపొందించారు.

మాధవ సేవ... మానవ సేవే ధ్యేయంగా.....

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటించి ఆధ్యాత్మిక బోధలు చేసి, ప్రజల్లో ఆధ్యాత్మిక భక్తిభావాలను పెంపొందింప జేశారు. అనేక ఆసుపత్రులు, వేదపాఠశాలలు, విద్యాలయాలు, వృద్ధాశ్రమాలు, చిన్నారులకు వైద్యాలయాలు నెలకొల్పి మానవాళికి, సమాజానికి నిర్విరామ సేవలందించారు. గోశాలలు నెలకొల్పి మూగజీవాలకు ఆశ్రయం కల్పించారు. అంతేకాదు, 1993లో కాంచీపురంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయాన్ని శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీవారు ఏర్పాటు చేశారు. సైన్స్‌, ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ తదితర కోర్సులన్నీ అభ్యసించేందుకు వీలుగా ఈ విద్యాలయాన్ని రూపుదిద్దారు. ఇలా ఎన్నో మహత్కార్యాలను నిర్వహించి శ్రీ జయేంద్ర సరస్వతిస్వామీజీ జగద్గురువుగా అందరి పూజలందుకున్నారు. జగద్గురువు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ నిర్యాణంతో అశేష భక్తజనులు కన్నీటి సాగరంలో మునిగిపోయారు.

దేశం ఓ గొప్ప ఆధ్యాత్మికవేత్తను కోల్పోయింది - రాష్ట్రపతి

శ్రీ జయేంద్ర సరస్వతి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితర ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్ప ఆధ్యాత్మికవేత్తను, సమాజ సంస్కర్తను కోల్పోయిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. జయేంద్ర సరస్వతి లక్షలాది భక్తుల మనసుల్లో జీవించే వుంటారని ప్రధాని తన సంతాపంలో తెలిపారు. గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ఎన్‌ నరసింహంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కెసీఆర్‌లు జయేంద్ర సరస్వతి మృతికి విచారం ప్రకటించారు. ఆయన మరణం మానవాళికి తీరని నష్టమన్నారు. ఆధ్యాత్మిక గురువుగా ఉంటూ కంచి పీఠాన్ని బలమైన సంస్థగా తీర్చిదిద్దారని, పాఠశాలలు, వృద్ధాశ్రమాలు, గోశాలలు, కంటి ఆసుపత్రులు, చిన్నపిల్లలకు ఆసుపత్రులు నిర్వహింపజేస్తూ మానవసేవలో తరించారని వారు కొనియాడారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌ తన సంతాపం ప్రకటిస్తూ, ధార్మికత, అత్యున్నత మానవతా విలువలను జీవితమంతా ఆచరించి ప్రబో ధించిన గురువుగా, జగద్గురువుగా జయేంద్ర సరస్వతి ఖ్యాతిగారచారని కొనియాడారు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter