Friday, 02 March 2018 07:42

ఆర్ధిక నేరాల అడ్డాగా నెల్లూరు

Written by 
Rate this item
(0 votes)

swamijiఒక నాగార్జున ఫైనాన్స్‌... ఒక సిటీ ఫైనాన్స్‌... ఒక అగ్రిగోల్డ్‌... ఒక ఆర్‌బిఎఫ్‌... ఒక సీప్‌ఫార్మ్‌... ఒక చైన్‌ లింక్‌ స్కీం... ఇప్పుడు మంత్ర పీఠికల మాయా జాలం... కంపెనీలు వేరైనా కాన్సెప్ట్‌ ఒక్కటే... అమాయకుల నుండి దండుకోవడం, టోపీ పెట్టి పరారవ్వడం.

రాష్ట్రంలోనే నెల్లూరుజిల్లాకు ఒక ప్రత్యేకతవుంది. ఈ జిల్లాలో ఫ్యాక్షన్‌ లేదు, రౌడీయిజం లేదు, రాజకీయ నాయకుల దందాలు లేవు. పద్ధతిగా పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుని పోయే వాళ్ళకు ఎంతో అనువైన జిల్లా.

ఇలాంటి జిల్లాలో అంతుబట్టని నేరాలేంటంటే వైట్‌కాలర్‌ నేరాలే. ఫైనాన్స్‌ మోసాలు ఎక్కువుగా ఈ జిల్లాలో జరుగు తున్నాయి. ఒక చైన్‌ స్నాచింగ్‌ జరిగితే ఒక మహిళ నష్టపోతుంది. ఓ ఇంట్లో దోపిడీ జరిగితే ఆ కుటుంబంలో సభ్యులు నష్టపోతారు. కాని ఫైనాన్స్‌ నేరాలలో ఒక వ్యక్తి మోసం చేస్తే బాధితులు వందలు, వేల సంఖ్యలో వుంటారు. నష్టం కోట్లలో వుంటుంది. ఇది సున్నితంగా కనిపించే తీవ్ర నేరం.

గత పాతికేళ్లలో నెల్లూరు కేంద్రంగా జరిగిన ఫైనాన్స్‌ నేరా లన్నింటిని లెక్కకడితే బాధితులు పోగొట్టుకున్న సొమ్ము వందల కోట్లలో కాదు వేల కోట్లకు చేరుతుంది.

పాతికేళ్ల క్రితం నెల్లూరు నగరంలో ఫైనాన్స్‌ కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలిసాయి. 10I10 అడుగుల గదిలో కూడా ఒక ఫైనాన్స్‌ ఆఫీసు ఉండేది. ఇలా దాదాపు 600 ఫైనాన్స్‌ కంపెనీలు వెలసి స్కీంల పేరుతో, ఐదేళ్లకు కట్టిన మొత్తానికి రెట్టింపు ఇస్తామనే ఎరతో అమాయకుల నుండి కోట్లు దండు కున్నాయి. ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ఐదేళ్ళ పాటూ ఉం డింది లేదు. ఒక్కరికంటే ఒక్కరికి కూడా కట్టిన సొమ్ము తిరిగి ఇచ్చింది లేదు. ఆ తర్వాత నెల్లూరు కేంద్రంగా ఎన్నో ఫైనాన్స్‌ కంపెనీలు వెలిసాయి. ప్రజల నుండి ఎక్కువ వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలు కట్టించుకున్నాయి. ముఖ్యంగా ఏజంట్లు ఈ మోసాలకు వారధులుగా వుంటూవచ్చారు. కమిషన్లకు ఆశపడి వాళ్ళు తమకు తెలిసిన వాళ్ళ చేత, మిత్రుల చేత మొహమాటపెట్టి డిపాజిట్లు కట్టించేవాళ్ళు. కొద్దికాలంలోనే ఈ కంపెనీలు బోర్డులు తిప్పేసేవి. బాధితులు లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్‌లకు పరుగులు తీసేవాళ్ళు. ఈ ఫైనాన్స్‌ కంపెనీలను జనం ఎంత అమాయకంగా నమ్మారంటే... ఒకడు రామ్మూర్తినగర్‌లో ఆఫీసు పెట్టి మీరు కట్టిన డబ్బుకు 28రోజుల్లో రెట్టింపు ఇస్తామంటే వాళ్ళకు కోట్లు కోట్లు కట్టారు. 28 రోజుల్లో డబ్బు రెట్టింపు కావాలంటే వాళ్ళు కరెన్సీ ప్రింటింగ్‌ ప్రెస్‌ ఏదన్నా పెట్టుకుని వుండాలి. కనీసం జనం 28రోజుల్లో డబ్బులు ఎలా డబుల్‌ అవుతాయనే ఆలోచన కూడా చేయలేదు. మూడేళ్ల క్రితం జిల్లాలో సంచలనం సృష్టించిన మనీ సర్క్యులేషన్‌ స్కీం ద్వారా ప్రజలు వందల కోట్లలో నష్టపోవడం చూసాం. తాజాగా నెల్లూరు కిసాన్‌ నగర్‌లో సుధాకర్‌ మహరాజ్‌ బురిడీబాబా ఉదంతం... భక్తి ముసుగులో ఫైనాన్స్‌ చీటింగ్‌. మంత్రపీఠికలు వ్రాస్తే నెలలో డబ్బులు రెట్టింపు ఎలా అవుతాయనే ఆలోచన కూడా లేకుండా పోయింది.

ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుకే ఈ రోజుల్లో దిక్కు లేకుండా పోతోంది. అలాంటిది ప్రైవేట్‌ కంపెనీలను, ప్రైవేట్‌ వ్యక్తులను నమ్మి ఎలా డిపాజిట్లు కడతారు. ఈ ఫైనాన్స్‌ మోసా లలో బాధితులుగా మిగులుతున్నది మధ్యతరగతి ప్రజలే! వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టి ఒక పూట తిని ఒక పూట తినక కష్టంతో వచ్చిన డబ్బును ఇలాంటి పాపాత్ముల పరం చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు. ప్రభుత్వాలు, పోలీసులను అనుకుని లాభం లేదు. ఒకడు ఇలా వ్యాపారం మొదలుపెడితే... ప్రజలు వచ్చి వారి వద్ద డబ్బులు డిపాజిట్‌ చేస్తుంటే ప్రభుత్వమేమీ ఆపలేదు. కాని అలా ఎవరినంటే వారిని నమ్మి డబ్బులు కట్టేటప్పుడు ప్రజలే ఆలోచించాలి... వారి గురించి తెలుసుకుని వుండాలి. ప్రజలు చైతన్యవంతులైతే తప్ప ఇలాంటి ఫైనాన్స్‌ మోసాలకు కళ్ళెం వేయలేము.

Read 727 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter