Friday, 02 March 2018 07:57

సింహపురి ధీరుడు... స్వర్గలోక సుందరి

Written by 
Rate this item
(0 votes)

galpikaఐఆర్‌ 20-420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరం. కాపువీధిలోని స్టైల్‌ ఆఫ్‌ సింహపురి, మాజీఎమ్మెల్యే ఆనం వివేకా(66) నివాసం. తెల్లారింది. పి.ఏ రాజు వచ్చి ఆయన గది బెల్‌ కొట్టాడు. వివేకా కళ్ళు తెరిచాడు. గదంతా చీకటిగా వుంది. ఈ అర్ధరాత్రి నన్ను లేపిందెవరబ్బా... ఎవరికి ఏం అవసరమొ చ్చిందో అనుకుంటూ ఎవరు? అని కేకేసాడు. అవతల నుండి సార్‌, నేను రాజును, ఉద యాన్నే నిద్రలేపమన్నారు కదా అని చెప్పాడు. నేను లేపమన్నది పొద్దున, ఇంత అర్ధరాత్ర ప్పుడు కాదు అని వివేకా అన్నాడు. అప్పుడు రాజు... అయ్యో సార్‌, ముందు మీరు ఆ కళ్లకున్న నల్లద్దాలు తీసేయండి... టైం పొద్దున ఆరయ్యింది అని చెప్పాడు. అప్పుడు వివేకాకు అసలు విషయం అర్ధమై కళ్లద్దాలు పక్కనపెట్టి, వెళ్లి తలుపు గడి తీసి రాజూ, కాఫీ తెమ్మని చెప్పు అని కుర్చీలో కూర్చు న్నాడు. ఆరోజు పేపర్లు తిరగేసాడు. ఈలోపు కాఫీ కూడా రావడంతో ఆయన టీవీ ఆన్‌చేసి ''ఆత్మసాక్షి'' ఛానెల్‌ పెట్టి ఒక చేత్తో కాఫీ తాగుతూ ఇంకో చేత్తో సిగరెట్‌ పట్టుకున్నాడు. అప్పుడే ఛానెల్‌లో బ్రేకింగ్‌ న్యూస్‌ ''అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం'' అని... ఆ న్యూస్‌ చూడగానే వివేకా షాక్‌... ఎడమ చేతిలో కాఫీ కప్పు, కుడి చేతిలో సిగరెట్‌... రెండూ క్రింద పడిపోయాయి. రాజూ ఆత్రు తగా వచ్చి సార్‌, ఏమైంది, ఏమైంది అంటూ పట్టుకుని ఊపాడు. పది నిముషాలకు గాని వివేకా ఈ లోకంలోకి రాలేకపోయాడు. స్పృహలోకి వచ్చాక ... శ్రీదేవి ఎంత గొప్ప నటిరా రాజు... మేం చిన్నప్పటి నుండి ఆమెను సినిమాల్లో చూస్తున్నాం... ఇప్పుడు పెద్దోళ్లమయ్యాక చూస్తున్నాం... నేను ఆమె అభిమానిని... ఆమె అభినయానికి అభిమా నిని అంటూ వివేకా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆరోజంతా వివేకా అన్యమనస్కంగానే వున్నాడు. టిఫిన్‌, తిండి తినలేదు. అది పక్కన పెడితే ఆ బాధతో ఆరోజు ఒక్క సిగరెట్‌ కూడా కాల్చలేదు. అతను సిగరెట్లు కాల్చడం మొదలు పెట్టాక ఒక్క సిగరెట్‌ కూడా వెలిగించనిది ఆరోజే! ఆరోజంతా ఎవరిని కూడా కలవ లేదు. ఆ బాధతోనే రాత్రి తన గదిలో పడుకుని నిద్రపోయాడు.

----------

నెల్లూరులోని పెన్నానది ఆనకట్ట ప్రాంతం. వివేకా పెన్నలో ఈత కొడుతు న్నాడు. అలా ఈత కొడుతుండగా ఇసుకలో ఆయన చేతికి ఏదో వస్తువు తగిలింది. పట్టుకుని తీసి చూసాడు. బంగారు ఉంగరం. పొద్దున్నే మా అమ్మ ఫోటో చూస్కొని వచ్చాను. అదృష్టం ఇలా అతుక్కుందనుకుని ఆ ఉంగ రాన్ని వేలుకు పెట్టుకుని, స్విమ్మింగ్‌ ఆపి బయటకు వచ్చాడు. డ్రెస్‌ వేసుకుని సిగరెట్‌ వెలిగించాడు. అప్పుడే అతనికి వెనుక నుండి ''మానవా'' అనే మాట వినిపించింది. అప్పుడు అతను వెనక్కి తిరిగాడు. అతని

కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఎదురుగా అప్సరస. చూడబోతే శ్రీదేవి లాగుంది. వివేకా తేరుకుని ఆమె తనను సిగరెట్‌ మానవా అని అడుగుతుందేమోననుకుని, 6ఏళ్ల వయస్సు లోనే అయిన అలవాటు... 66ఏళ్ల వయసులో మాని ఏం చేయగలను అని అన్నాడు. ఆమె మళ్ళీ మానవా... నేను అంగుళీయకము పోగొట్టుకుంటిని నీ చేతికి ఏమైనా దొరికిందా అని అడిగింది. అంగుళీయకం అంటే అదేదో వస్తువు అనుకుని వివేకా... నాకు దొరకలేదని చేయి అడ్డంగా ఊపుతూ చెప్పాడు. చేయి ఊపేటప్పుడు అతని చేతికున్న ఉంగరాన్ని ఆమె చూసింది. అతను కావాలనే అబద్ధం చెబుతున్నాడనుకుని... నా పేరు ఇంద్రజ, స్వర్గలోకపు వాసిని, ఆ అంగుళీయకం లేకుంటే స్వర్గంలోకి ప్రవేశం ఉండదు... నా అంగుళీయకం నాకివ్వు అని ఆమె అడిగింది. ఈమెవరో జిడ్డు కేసులాగుంది... వదిలించు కునిపోతే బెటర్‌ అనుకుంటూ రోడ్డు మీదకొచ్చి కారెక్కి రయ్‌మని ఏ.సి సెంటర్‌కు పోని చ్చాడు. ఇంటి వద్ద కారాపి... హమ్మయ్యా... ఆమెను వదిలించుకున్నాను అంటూ కారు దిగాడు. 'మానవా, ఇదేనా మీ నివాస గృహము' అనే మాట వినిపించడంతో కారు పైకి చూసాడు. ఇంద్రజ కారు టాప్‌ మీద వుంది. నువ్వెలా వచ్చావ్‌ అని వివేకా అడి గాడు. నువ్వు కారులోపల కూర్చుంటివి, నేను కారుపైన కూర్చుని ఈ సుందర నగర అందాలను వీక్షిస్తూ వచ్చితిని అని ఇంద్రజ చెప్పింది. అసలు నీ బాధేంటి అని వివేకా అడిగాడు. నా అంగుళీయకం నాకిస్తే నేను మా స్వర్గలోకమునకు వెళ్లెదను అని అంది. ఈ తిక్క మాలోకం నాకెక్కడ తగిలింది రా బాబూ అనుకుని... మా ఇంటిలోకి రా... అలాగే ఇస్తాను అంటూ ఇంట్లోకి రమ్మన్నాడు. ఇంద్రజ అలాగే అంటూ కారు దిగి ఇంట్లోకి అడుగుపెట్టింది. అప్పుడే వివేకా అక్కడ స్థంభానికి కట్టేసి వున్న కుక్కను 'ఇంద్రజ' మీదకు ఉస్కో అంటూ ఉసిగొల్పాడు. కుక్క దెబ్బకు ఆమె పరారవుతుందనుకున్నాడు. కుక్క పరుగున వచ్చింది. ఇంద్రజ కళ్ళల్లో మెరుపులు చూసింది. అంతే ముందు కాళ్ళు పైకెత్తి ఆమెకు నమస్కరించింది. అది చూసి వివేకా షాక్‌... ఈమె నిజంగానే స్వర్గలోకపు సుందరి లాగుంది. ఈమె కళ్ళల్లో ఆ తేజస్సు వుంది. ఇంతకీ ఆమె అడుగుతున్న 'అంగు ళీయకం' అంటే ఏమిటి? వెంటనే తెలుసు కోవాలనుకుని బ్రహ్మశ్రీ స్వయంపాకుల శ్రీనివాసులుకు ఫోన్‌ చేసి... స్వామీ అంగు ళీయకం అంటే ఏమిటని అడిగాడు. దాని కాయన అంగుళీయకం అంటే ఉంగరం అని చెప్పాడు. అప్పుడు వివేకాకు చిరంజీవి - శ్రీదేవి నటించిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమా కళ్ళముందు తిరిగింది. ఈ సుందరి దేవకన్యలతో కలిసి నెల్లూరు విహా రానికొచ్చినట్లుంది. చెలికత్తెలతో కలిసి పెన్నలో ఈతకు దిగుంటుంది. అక్కడే ఉం గరం పోగొట్టుకుని వుంటుంది. అది నాకు దొరికింది. ఇప్పుడు ఈ ఉంగరం ఇస్తే తన దారిన తాను పోతుంది. ఇలాంటి దేవతలు భూలోకంలో కూడా వుండాలి. ఆమె ఇక్కడే వుండాలంటే ఈ ఉంగరం ఇవ్వకూడదు అని మనసులో అనుకున్నాడు. తర్వాత ఆమెతో... మీరు చెబుతున్న అంగుళీయకం ఎక్కడుందో నాకు తెలియదు. మా వాళ్ళు పోలీసుస్టేషన్‌లో కంప్లైంట్‌ ఇస్తారు. అది దొరికేదాకా మీరు నెల్లూరులోనే ఓ ఇల్లు తీసుకుని వుండండి అని చెప్పాడు. అంతలో పెద్ద శబ్దంతో వెలుగు... కామధేనువు మీద ఇంద్రుడు అక్కడ దిగాడు. చూడ్డానికి మనిషి కైకాల సత్యనారాయణ లాగున్నాడు. ఇంద్రజ కామధేనువు ఎక్కు, మన లోకానికి పోదాం అని చెప్పాడు. అది విని వివేకా హా హా హా... అంటూ పెద్దగా నవ్వుతూ... ఆమె వద్ద అంగుళీయకం లేదు కదా అని వెటకారంగా అన్నాడు. దానికతను ఇదేమన్నా 'జగదేక వీరుడు - అతిలోక సుందరి' సినిమా అనుకుంటున్నావా... ఆమె ఇంతకాలం ఇక్కడ వుంది కాబట్టి ఇది స్వర్గం... ఇక నుండి వుండాల్సింది మా లోకంలో... అందుకే ఆమెను తీసుకెళుతున్నాను అంటూ కామధేనువుపై ఇంద్రజను ఎక్కించుకుని 'జై జగన్మాత' అని అన్నాడు. కామధేనువు గాల్లోకి లేచింది. 'ఇంద్రజ'ను ఎలాగైనా ఈ లోకం వదిలి పోకుండా చూడాలన్న తపనతో వివేకా గాల్లోకి ఎగిరి కామధేనువు తోక పట్టుకున్నాడు. కాని దాని తోక జారిపోతుంది. ఆది చూసి ఇంద్రుడు బిగ్గరగా నవ్వుతూ... మీ మానవులు ఇలాంటి చేష్టలు చేస్తారనే కామధేనువు తోకకు దట్టంగా ఆముదం పూసుకుని వచ్చానన్నాడు. అప్పుడే వివేకా చేతులు తోక నుండి జారాయి. ఆయన మోసం, దగా అంటుండగానే ఆకా శంలో నుండి క్రింద పడసాగాడు. ఆ భయంతో కాపాడండి... కాపాడండి... అంటూ పెద్దగా కేకలు పెట్టసాగాడు వివేకా...

ఆ కేకల దెబ్బకు పైగదిలో వున్న పెద్ద కొడుకు ఏ.సి.సుబ్బారెడ్డి, క్రింద హాల్‌లో వున్న చిన్నకొడుకు రంగమయూర్‌రెడ్డి, పి.ఏ రాజులు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆయ నను గట్టిగా పట్టుకుని ముఖాన నీళ్ళు చల్లారు. అప్పటికిగాని ఆయన ఈ లోకంలోకి రాలేదు. అప్పటిదాకా వచ్చింది కల అని తెలుసుకు న్నాడు. ఏమైంది సార్‌ అని రాజు అడిగాడు. శ్రీదేవి స్వర్గానికి వెళుతూ కూడా ఈ అభిమా నిని పలుకరించిపోయిందిరా... మహానటి అంటూ రెండు కన్నీటి చుక్కలు రాల్చాడు.

Read 109 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter