02 March 2018 Written by 

పడి లేచిన పూజ

pooja hegdeప్రజంట్ టాలీవుడ్ లో ఐరెన్ లెగ్ నుంచి గోల్డ్ లెగ్ గా ట్రాక్ మార్చిన బ్యూటీ పూజా హెగ్డే. ఇప్పటివరకు సరైన హిట్ లేదు.. అయినా ఆఫర్స్ వరద అగడం లేదు. మహేష్ నుంచి ప్రభాస్ వరకు అందరితో జోడి కట్టే ఛాన్స్ ని పట్టేసింది. ఇప్పటికే చెర్రీ మూవీలో చిందేసిన పూజా.. శ్రీనివాస్ తో కలిసి సాక్ష్యం చెప్పబోతుంది. మరి ఈ సారైనా తన సీన్ మారుతుందా?

 టాలీవుడ్ లో అప్పుడెప్పుడో ఎంట్రీ ఇచ్చి క్యూట్ హీరోయిన్ గా ఫోకస్ అయ్యింది పూజా హెగ్డే. ముకుంద, ఒకలైలా కోసం వంటి సినిమాలు హిట్ అవ్వకున్నా పూజా హెగ్డే నటనకు మంచి మార్కులే పడ్డాయ్. తరువాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తన  పంథానే మార్చేసింది. అందాల ఆరబోతకు హద్దులు లేని పూజా... దేనికైనా రెడీగా ఉంటుంది. రీసెంట్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టి  డీజే అంటూ కుర్రకారును ఫిదా చేసింది. దీంతో యూత్ లో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ పెరిగిపోయింది.

టాలీవుడ్ లో ప్రజంట్ పూజకు సరైన హిట్ లేకపోయినా వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయ్. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో త్వరలో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం పూజా హెగ్డే ఎకౌంట్ లో పడిందనే ప్రచారం జరుగుతోంది. పూజా ఎక్కడో నక్కతోక తొక్కినట్లు ఉంది. ప్రభాస్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. ప్రజంట్ ప్రభాస్ సాహో షూటింగ్ ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ అవగానే కృష్ణంరాజు నిర్మాణంలో జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోఓ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాలో కూడా పూజానే సెలెక్ట్ చేసినట్టు టాక్. ఇక మహేష్ 25వ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్నాడు. ఇందులో కూడా పూజానే హీరోయిన్ అనేది టాక్. ఎలా చూసినా ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ ఈ మధ్యకాలంలో ఏ హీరోయిన్ కీ దక్కలేదు. కానీ అలాంటి అవకాశాన్ని సొంతం చేసుకుంది పూజా. త్వరలో ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ప్రభాస్, మహేష్ సినిమాలు ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది. మరి వీటిలో ఏ రెండు సినిమాలు హిట్ అయినా పూజా సీన్ మారే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ లో వచ్చే టూ త్రీ ఇయర్స్ తన హవా నడిచే అవకాశం ఉంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • పేటలో పోటీకెవరు?
  జిల్లాలో తెలుగుదేశంపార్టీకి గట్టి నియోజకవర్గాలలో సూళ్ళూరుపేట ఒకటి. ఇది ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం అయినప్పటికి ఇంతకాలంగా వేనాటి సోదరులే ఇక్కడ పార్టీని నడుపుతూ వచ్చారు. అభ్యర్థులను నిర్ణయిస్తూ, గెలిపిస్తూ వచ్చారు. తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటివరకు 8సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, 5సార్లు…
 • జగన్‌ జోరు.. బాబు బేజారు
  'మన్మధుడు' సినిమాలో సీన్‌ ఇది... బ్రహ్మానందం ఇంటికి నాగార్జున, సోనాలిబింద్రే వస్తారు. అక్కడ బ్రహ్మానందం భార్యగా ఒక నల్లజాతి మహిళ ఉండడాన్ని చూసి మీది లవ్‌ మ్యారేజీనా అని నాగార్జున అడుగుతాడు. దానికి బ్రహ్మానందం... ముందు ఆమె నన్ను ప్రేమించింది... తర్వాత…
 • ఈ నరకం ఇంకెన్నాళ్ళు
  ''ఈ నగరానికి ఏమైంది... ఓ పక్క మసి... మరోపక్క పొగ... నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం''... థియేటర్లలో గాని, టీవీలలో గాని సినిమా ప్రదర్శనకు ముందు వచ్చే ప్రకటన ఇది. ఇప్పుడు నెల్లూరు పరిస్థితి కూడా అలాగే వుంది. ఓ…
 • వణికిస్తున్న సైకో
  ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు…
 • రాజకీయ ప్రయాణంలో... ఇది తొలి సంతకం
  ఇప్పటికే నెల్లూరు కేంద్రంగా నెల్లూరుజిల్లాలోనే కాక రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆథ్యాత్మిక, మానవీయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన సుల్లో సేవాస్వాప్నికుడిగా ముద్రపడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి... తన జీవితంలో మరో సేవా ప్రయాణానికి తొలి సంతకం చేసారు. ఇంతదాకా…

Newsletter