02 March 2018 Written by 

రంగస్థలానికి రాని ప్రకాష్ రాజ్

rangaదక్షిణాది సినిమారంగంలో మాత్రమే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతమైన నటుల లిస్టులో ప్రకాష్ రాజ్ ఎప్పుడు ముందు వరసలోనే ఉంటాడు. అయితే అను నిత్యం వివాదాలకు చిరునామాగా మారిపోతున్న ప్రకాష్ రాజ్ వ్యవహార శైలితో అతడి పేరు చెపితేనే దర్శక నిర్మాతలు భయపడి పోతున్నారు. ఈ నేపధ్యంలో ప్రకాష్ రాజ్ నటిస్తున్న సినిమాల సంఖ్య కూడ బాగా తగ్గిపోయింది. అయితే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘రంగస్థలం’ మూవీలో ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రకరకాల కారణాలతో షూటింగ్ ఆలస్యంగా నడుస్తున్న ఈమూవీ చిత్రీకరణ పూర్తి కావడానికి ప్రకాష్ రాజ్ ప్రవర్తన సమస్యగా మారింది అని గాసిప్పుల హడావిడి వినిపిస్తోంది.  వాస్తవానికి మొన్న ఫిబ్రవరి 28న ప్రకాష్ రాజ్ ఆది పినిశెట్టి కాంబినేషన్ లో కొన్ని సీన్స్ తీయవలసి ఉంది అని వార్తలు వచ్చాయి. అయితే విశాఖపట్నంలో వేరే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఆది పినిశెట్టిని దర్శకుడు సుకుమార్ ఒప్పించి హైదరాబాద్ రప్పిస్తే ఆరోజుకు షూటింగ్ కు వస్తాను అని మాట ఇచ్చిన ప్రకాష్ రాజ్ హైదరాబాద్ రాకుండా ఫిబ్రవరి 28న ముంబాయ్ వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. దీనితో ఈ సీన్ చిత్రీకరణ పూర్తి కాలేదు అని వార్తలు వస్తున్నాయి. ఈ సీన్ చిత్రీకరణ పూర్తి అయిన తరువాత సుకుమార్ చరణ్ పై మరికొన్ని ఈ సినిమాకు సంబంధించిన పెండింగ్ సీన్స్ షూట్ చేయవలసిన పరిస్థుతులు ఉన్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ప్రకాష్ రాజ్ ఆది పినిశెట్టిల సీన్ ఎప్పుడు షూట్ చేయాలి ఆ తరువాత చరణ్ తో చిత్రీకరించవలసిన పెండింగ్ సీన్స్ ఎప్పుడు చిత్రీకరించాలి అని దర్శకుడు సుకుమార్ తెగ టెన్షన్ పడుతున్నట్లు టాక్. ఇప్పటికే ఈరోజు నుంచి ప్రారంభం అయిన ధియేటర్ల బంద్ తన ‘రంగస్థలం’ రిలీజ్ సమస్యగా మారుతుందా అని టెన్షన్ పడుతున్న చరణ్ కు ప్రస్తుతం ప్రకాష్ రాజ్ వ్యవహార శైలి కూడ మరో తలనొప్పిగా మారిందని గాసిప్పుల హడావిడి వినిపిస్తోంది.. 



newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
    వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
  • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
    నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
  • వెంకటగిరి... నా ఊపిరి!
    నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
  • కృష్ణ పోటెత్తింది
    కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వై.యస్‌.జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్రకు విశేషస్పందన లభించింది. ఇది పెద్ద విషయమేమీ కాదు. ఈ జిల్లాల్లో కొన్ని వైకాపాకు కంచుకోటలు కాగా, ఇంకో రెండు జిల్లాల్లోనూ బలంగానే వుంది. కాని, అసలు…
  • వేమాలశెట్టి బావిలో... వేలుపెట్టిన వేమిరెడ్డి పట్టాభి
    నెల్లూరు, దర్గామిట్టలో టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా వున్న వేమాలశెట్టి బావి సత్రం స్థలం మరోసారి వివాదంలో కెక్కింది. మంగళవారం రాత్రి ఈ స్థలంలో మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ ముఖ్య అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో శనీశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్టించడం వివాదానికి…

Newsletter