09 March 2018 Written by 

ప్రత్యేక పోరులో... వైకాపాదే పైచేయి!

ycpప్రత్యేకహోదా పోరును పట్టాలెక్కించడంలో వైకాపా అధినేత వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడనిపిస్తోంది. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనూ ప్రత్యేకహోదా ఉద్యమాన్ని వేడెక్కించాడు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారిగా ఏపికి జరిగిన అన్యాయాన్ని ఢిల్లీ వీధుల్లోనూ తెలిసేలా చేయగలిగాడు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు ప్రత్యేకహోదా ఉద్యమంపై, ఏపికి జరిగిన అన్యాయంపై చర్చించే స్థాయికి తీసుకొచ్చాడు.

అడ్డగోలు విభజన ద్వారా కాంగ్రెస్‌పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేస్తే, తాము అధికారంలోకి వస్తే ఏపికి పదేళ్ళపాటు ప్రత్యేకహోదాను అమలు చేస్తామన్న నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక కాంగ్రెస్‌ కంటే కిరాతకంగా వ్యవహరిస్తున్నాడు. ప్రత్యేకహోదాను పక్కన పెట్టేసి ప్రత్యేకప్యాకేజీతో సరి పెట్టుకోమన్నాడు. చంద్రబాబు ప్రత్యేకహోదా ఇస్తే నాకేమొస్తుంది, ప్రత్యేకప్యాకేజీయే నాకు చాలన్నాడు. ప్రత్యేకహోదా అంశాన్ని బీజేపీ, టీడీపీలు పూర్తిగా పూడ్చి పెట్టాలని చూసాయి. కాని, గత నాలుగేళ్ళుగా ప్రత్యేకహోదాపై పోరాడింది వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డే! రాష్ట్ర మంతటా ప్రత్యేకహోదాపై జగన్‌ సభలు పెట్టాడు, నిరాహారదీక్ష చేసాడు, ఆందోళనలు చేపట్టాడు. వామపక్షాలు కొంతవరకు అతనికి మద్దతుగా నిలిచాయి. ప్రత్యేకహోదాకై పోరు అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబు స్క్రిప్ట్‌ ప్రకారం అప్పుడప్పుడూ బయటకొచ్చినా ప్రజలపై ప్రభావం పెద్దగా లేదు. ఈ రాష్ట్రంలో ప్రత్యేకహోదా ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టింది జగనే. ఇప్పుడు దాని సెగలు ఢిల్లీని తాకేలా చేసింది కూడా జగనే! ఎన్డీఏ ప్రభుత్వం చివరి సంవత్సరంలో కూడా ప్రత్యేకహోదా గురించి ఆలోచించక పోవడం, బడ్జెట్‌లో ఏపికి తీరని అన్యాయం చేయడంతో జగన్‌ పోరు తీవ్రతను పెంచాడు. ప్రత్యేకహోదా సాధన దిశగా పోరాటం ముమ్మరం చేశాడు. పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను తీవ్రం చేయడంతో పాటు పోరాటాన్ని ఢిల్లీ వీధుల్లోకి తీసుకెళ్ళాడు. వైకాపా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన మహాధర్నాకు జాతీయ స్థాయిలో అన్ని పార్టీల వారు మద్దతు ప్రకటించారు. హోదా పోరాటంలో ఇంకో అడుగు ముందుకేసి వైకాపా ఎంపీల చేత రాజీనామా చేయించేందుకు సిద్ధంగా ఉన్నారు. జగన్‌ హోదా పోరును ఉధృతం చేయడం వల్లే తెలుగుదేశం పార్టీకి ఏమీ పాలుపోని పరిస్థితి వచ్చి బీజేపీతో చెడింది. రేపటి రాజకీయాలలో గెలుపెవరిదో, ఓటమి ఎవరిదో చెప్పలేం... కాని, ఈ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని గట్టిగా పట్టు బట్టింది జగన్‌ అయితే, దీనిని కేసులకు భయపడి కేంద్రానికి తాకట్టుపెట్టింది మాత్రం చంద్రబాబే! రాష్ట్ర ప్రజల దృష్టిలోనే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఈ విషయంలో చంద్రబాబు కంటే జగన్‌నే సమర్ధిస్తున్నారు. హోదా పోరును జగన్‌ వేగవంతం చేసాకే అందరిలోనూ కదలిక వచ్చింది. ఢిల్లీలో దీనిపై కాక రగిలింది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter