Friday, 09 March 2018 08:50

ఈ నరకం ఇంకెన్నాళ్ళు

Written by 
Rate this item
(0 votes)

drian''ఈ నగరానికి ఏమైంది... ఓ పక్క మసి... మరోపక్క పొగ... నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం''... థియేటర్లలో గాని, టీవీలలో గాని సినిమా ప్రదర్శనకు ముందు వచ్చే ప్రకటన ఇది. ఇప్పుడు నెల్లూరు పరిస్థితి కూడా అలాగే వుంది. ఓ పక్క మసి... ఇంకో పక్క పొగ అన్నట్లుగా మారింది భూగర్భడ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్‌ల పుణ్యమా అని!

నెల్లూరు నగరంలో 1100కోట్ల ఖర్చుతో భూగర్భ డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్‌ల పనులు ముమ్మరంగా జరుగుతుండడం తెలిసిందే! గత ప్రభుత్వాలలో వందలకోట్ల వ్యయంతో వేసిన సిమెంట్‌, తారురోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఏ రోడ్డు కూడా ఇప్పుడు శుభ్రంగా లేదు. ఏ రోడ్డులోనూ వాహనాలు సక్రమంగా వెళ్ళే పరిస్థితి లేదు. తవ్వేసిన రోడ్ల మూలంగా వాహనదారులు నరకం చూస్తున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తవ్విన రోడ్లు ఓ పక్క ఇబ్బంది పెడుతుంటే, తవ్విన చోట పూడ్చడానికి పై లేయర్‌గా చేస్తున్న బ్లాక్‌పౌడర్‌(డస్ట్‌) జనానికి సినిమా చూపిస్తోంది. మినీబైపాస్‌, మాగుంట లే అవుట్‌ మెయిన్‌రోడ్డుతో పాటు నగరంలో పలు రోడ్లపై ఈ బ్లాక్‌పౌడర్‌నే వేశారు. వాహనాలు వెళ్ళినప్పుడు ఈ దుమ్ము మేఘాలు మాదిరిగా వీస్తుంది. ఈ దుమ్ము ముక్కుల్లోకి పోతే అనారోగ్య సమస్యలు తలెత్తకమానవు. బ్లాక్‌పౌడర్‌తో లేనిపోని అనర్ధాలు తలెత్తుతున్నాయి. ఆ రోడ్లో వెళ్ళే ద్విచక్రవాహనదారులు గాని, ఏ.సిలు వేసి వాహనాలలో ప్రయాణించేవాళ్ళు గాని, పాదచారులుగాని ఈ డస్ట్‌ను పీల్చక తప్పనిపరిస్థితి. ఎంతసేపని ముక్కులు మూసుకుని ఊపిరి బిగపట్టి ఉండగలరు? ఈ రోడ్లమీద గట్టిగా కిలోమీటరు దూరం నడిచినా, బండి మీద వెళ్ళినా అరకిలో డస్ట్‌ నెత్తిన, ముఖాన వుంటుంది. ఈ డస్ట్‌లో పోలీసులకు కూడా ట్రాఫిక్‌ విధులు నిర్వహించడం కష్టంగా ఉం టుంది. వాళ్ళూ మనుషులే కదా! రోగాలకు వాళ్ళేం అతీతులు కాదుకదా! ఈ డస్ట్‌ దెబ్బకు ప్రధాన రోడ్ల పక్కనవున్న భవనాలు దుమ్ము పేరుకుపోయి, కొత్తగా పెయింట్‌లు వేసుకోవాల్సిన పరిస్థితి. తవ్విన గుంతలను పూడ్చడానికి కనీసం గ్రావెల్‌ వాడున్నా ఇంత ఇబ్బంది ఉండేది కాదు. లేదా పౌడర్‌తో పాటు సన్న చిప్స్‌ వేసున్నా ఈ దుమ్ము బాధ ఇంత వుండేది కాదేమో? ఏదైనా తవ్విన రోడ్లను తొందరగా వేస్తే ఈ డస్ట్‌ బాధల నుండి నగర ప్రజలకు మోక్షం కల్పించినవాళ్ళవుతారు!

Read 385 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • అమ్మో... దొంగల ముఠా
  కరుడుగట్టిన కిరాతకులు వాళ్ళు... మంచితనం, మానవత్వం ఉండదు... దయ, కరుణ మచ్చుకైనా కానరావు... పిల్లా, పెద్ద అనే తేడా లేదు... ఇంట్లో దూరితే అందర్నీ చంపేయడం, అందినకాడికి దోచుకునిపోవడం... దోచుకున్న ఇంట్లోనే భోం చేయడం, అక్కడే మలమూత్రాలు విసర్జించడం... ఈ ముఠా…

Newsletter