09 March 2018 Written by 

పరచుకుంటున్న పచ్చదనం

pachadanamపాతికేళ్ళ క్రితం నెల్లూరు నగరంలో ''పార్కు'' అంటే గాంధీ బొమ్మ వద్ద స్వతంత్ర పార్కు ఒక్కటే కనిపించేది. ఆ పార్కులో చెట్ల క్రిందే జనాలు సేద తీరుతూ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ ముచ్చట్లు పెట్టుకుని వుండేవాళ్ళు. తిక్కన పార్కు, గుప్తాపార్కు వంటివి వున్నా వాటిని పెద్దగా అభివృద్ధి చేసింది లేదు. 2000 ప్రాంతంలో అప్పటి కలెక్టర్‌ శ్రీలక్ష్మి చొరవతో ప్రముఖ దాత జె.యస్‌.రెడ్డి దాతృత్వంతో చింతారెడ్డిపాలెంరోడ్డులో నగరానికే శోభాయమానంగా చిల్డ్రన్స్‌ పార్క్‌ వెలసింది. అయితే ఆ తర్వాత వచ్చిన కలెక్టర్‌ అనంతరాము దానిని వ్యాపారం కోసం ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించి నాశనం చేసి పెట్టారు.

నగరంలో పలు చోట్ల పార్కుల కోసం రిజర్వు స్థలాలు ఉం చినా వాటిని పార్కులుగా అభివృద్ధి చేసింది లేదు. మాగుంట లే అవుట్‌లో కేకేఆర్‌ గౌతమ్‌ స్కూల్‌ ఎదురుగా మాగుంట సుబ్బరామ రెడ్డి మెమోరియల్‌ పార్కును అప్పట్లో స్థానికులే అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అయ్యప్పగుడి, బాలాజీనగర్‌లలో పార్కు స్థలాలలోనే పోలీసు స్టేషన్‌లు కట్టడం చూసాం.

వాస్తవంగా లే అవుట్లు వేసిన రియల్టర్లే పార్కుల కోసం వదిలిన స్థలాలలో పార్కులను అభివృద్ధి చేయాలి. కాని, వాళ్ళు రిజర్వు స్థలాలు వదలడం తప్పించి, అభివృద్ధి చేసేవాళ్ళు కాదు. మున్సిపాల్టీవాళ్ళు కూడా వీటిని పట్టించుకోకపోవడం వల్ల చాలాచోట్ల రిజర్వ్‌ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి.

అయితే గత నాలుగేళ్లలో నగరంలో ఇతర విభాగాలలో జరిగిన అభివృద్ధిని పక్కనపెడితే పార్కులకు మాత్రం మంచికాలమే వచ్చిందని చెప్పవచ్చు. మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల నిరుపయోగంగా వున్న ఎన్నో రిజర్వ్‌స్థలాలు పార్కులుగా రూపాంతరం చెందాయి, చెందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అమృత్‌' పథకం ద్వారానైతేనేమీ, స్థానిక దాతల సహకారంతోనైతేనేమీ, కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలోని సివిఆర్‌ ఫౌండేషన్‌ సౌజన్యంతో గాని నగరంలో చాలా పార్కులకు పచ్చని కళ వచ్చింది. ఎంతో అందంగా ఈ పార్కులు తయారవుతున్నాయి. నెల్లూరీయులకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందించబోతున్నాయి.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
    వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
  • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
    నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
  • వెంకటగిరి... నా ఊపిరి!
    నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
  • నానుతున్న నారాయణ
    చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
  • అయోమయంలో ఆనం
    నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter